News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 19th June 2019
Markets_main1560918993.png-26399

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
కెనరా బ్యాంక్‌:-
కెన్‌ ఫిన్‌ హోమ్స్‌లో  మొత్తం వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. 
హెచ్‌సీఎల్‌ :- క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఏడాది కాలంలో పాటు సాంకేతిక సేవలు అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
అదానీ పోర్ట్స్‌:-  ఫిచ్‌ రేటింగ్‌ సంస్థ ఇష్యూ రేటింగ్‌ను బిబిబి(-)కు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో స్టేబుల్‌ అవుట్‌లుక్‌ కేటాయించింది.
జైన్‌ ఇరిగేషన్‌:- ధీర్ఘకాలిక ఇష్యూ రేటింగ్‌ను ‘‘బిబిబి’’కు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు ‘‘నెగిటివ్‌’’ అవుట్‌లుక్‌ను కేటాయించింది.
అడ్‌ల్యాబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌:- కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ స్వతంత్ర డైరెక్టర్‌ పదవికి మేఘ్నా పూరి రాజీనామా చేశారు. 
పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌:- బాసెల్‌ -III నిబంధనలకు అనుగుణంగా కంపెనీ జారీ చేసిన రూ.67.5 కోట్ల విలువైన టైర్‌-I బాండ్ల ఇష్యూకు ఇండియా రేటింగ్‌ సంస్థ రేటింగ్‌ ఎ(+)/నెగిటివ్‌ నుంచి ఎ/నెగిటివ్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది.
సుందర్‌ మల్టీక్యాప్‌:- బ్రిక్‌ రేటింగ్‌ సంస్థ కంపెనీ రుణసౌకర్యపు రేటింగ్‌ను బిబి+(స్థిరత్వం) రేటింగ్‌ను కేటాయించింది.
ఎన్ఎండీసీ:-  మేలో మొత్తం ఐరన్‌ ఓర్‌ ఉత్పత్తి 3.04 మెగా టన్నులు కాగా, మొత్తంగా 3.37 మెగా టన్నుల అమ్మకాలను జరిపినట్లు తెలిపింది.
ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌:- ఎన్‌సీడీల ద్వారా రూ.500 కోట్ల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌:- కేవైసీ నిబంధలను ఉల్లఘించిన కేసులో రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.1 కోటి జరిమానా విధించింది. 
చంబల్‌ ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌:- కంపెనీ ఇటీవల విడుదల చేసిన రూ.3500 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల జారీ ఇష్యూకు క్రిసెల్‌, ఇక్రా రేటింగ్‌ సంస్థలు ఎ1(+) రేటింగ్‌ను కేటాయించాయి. 
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- జూన్‌ 18న ఎన్‌డీసీలపై చెల్లించాల్సిన రూ.10 కోట్ల రుణాన్ని చెల్లించినట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది.



You may be interested

4 శాతం లాభపడిన టాటాస్టీల్‌

Wednesday 19th June 2019

గత నాలుగు సెషన్‌లలో నష్టపోయిన టాటా స్టీల్‌ బుధవారం ట్రేడింగ్‌ 4శాతం లాభపడింది. రూ.480.20 వద్ద ప్రారంభమైన కంపెనీ షేరు రూ.492 ఇంట్రా‍డే  గరిష్ఠాన్ని రూ.480.20 ఇంట్రాడే కనిష్ఠాన్ని చూసింది. అంతర్జాతీయంగా వృద్ధి మందగమనంలో ఉండడంతో స్టీల్‌కు డిమాండ్‌ తగ్గినప్పటికి గోల్డ్‌మాన్‌ స్టాక్‌ ఈ షేరు కొనుగోలు టార్గెట్‌ను రూ.570 గా నిర్ణయించింది. వాణిజ్య యుద్ద భయాల ప్రభావం టాటా స్టీల్‌కు యూరప్‌లో ప్రతికూల ప్రభావం చూపిందని, ఇండియాలో దీని

కొనసాగుతున్న చమురు ధరల పెరుగుదల..

Wednesday 19th June 2019

గత సెషన్‌లో కనిపించిన చమురు ధరల పెరుగుదల బుధవారం ట్రేడింగ్‌లో కూడా కొనసాగుతుంది. బ్రెంట్‌ క్రూడ్‌ 0.6శాతం పెరిగి బ్యారెల్‌ 62.48డాలర్ల వద్ద, డబ్యుడీఐ క్రూడ్‌ 0.8శాతం పెరిగి బ్యారెల్‌ 54.34డాలర్ల వద్ద  ట్రేడవుతున్నాయి. ఆయిల్‌ ట్యాంకర్లపై జరిగిన దాడి కారణంగా మిడిల్‌ ఈస్ట్‌ దేశాలలో చెలరేగిన ఒత్తిడి కొనసాగుతుండడం, యూఎస్‌ -చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతాయనే నేపథ్యంలో బుధవారం చమురు ధరలు పెరిగాయి. జపాన్‌

Most from this category