News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 12th September 2018
Markets_main1536725963.png-20177

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
సన్‌ఫార్మా:- యూఎస్‌ఎఫ్‌డీఏ పంబాజ్‌లోని మొహాలీ ప్లాంట్‌ను రెండురోజుల(సెప్టెంబర్‌ 10, 11) పాటు తనిఖీలు చేసినట్లు ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
సిన్జిన్ ఇంటర్నేషన్‌:- బయోకాన్‌ కంపెనీ తన మొత్తం వాటాలో నుంచి అరశాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను సోమవారం ఓపెన్‌మార్కెట్‌ ద్వారా విక్రయించింది.
సిప్లా:- హెచ్‌ఐవీ వ్యాధి చికిత్సలో వినియోగించే ట్రిపుల్‌ కాంబినేషన్‌ ఆప్‌ యాంటిరెట్రోవైరల్‌ ఔషధానికి ఎస్‌ఎహెచ్‌పీఆర్‌ఏ(సౌత్‌ ఆఫ్రికన్‌ హెల్త్‌ ప్రోడక్ట్స్‌ రెగ్యూలేటరీ ఆథారిటీ) నుంచి అనుమతులు దక్కించుకుంది.
అదానీ గ్రీన్‌:- కజికిస్థాన్‌లో తన అనుబంధ సం‍స్థ అదానీ సౌర్ ఉర్జ కంపెనీని విలీనం చేసుకుంది.
సద్భావన్‌ ఇంజనీరింగ్స్‌:-  ప్రైవేట్‌‍ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో రూ.10లక్షల ముఖ విలువ కలిగిన 1900 అన్‌సెక్యూర్డ్‌, లిస్టెడ్‌, రీడమబుల్‌ నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.190 కోట్ల సమీకరణకు సిద్ధమైంది.
సిటీ యూనియన్‌ బ్యాంక్‌:- వచ్చే ఏడాది వరకు బ్యాంక్‌కు ఎఎ(-) రేటింగ్‌ను కేటాయించింది.
గోద్రేజ్‌ ఆగ్రోవెట్‌:- సెప్టెంబర్‌ 14న జరిగే బోర్డు సమావేశంలో ఎస్‌టెక్‌ లైఫ్‌సైన్సెస్‌ విలీనం, వ్యాపార వ్యూహాలు తదితర అంశాలపై చర్చించనుంది.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, భారతి ఎయిర్‌టెల్‌:- ట్రాయ్‌ నియమ నిబంధనలను ఉల్లఘించినందుకు ప్రాధికారిక సంస్థ ట్రాయ్‌ ఇరు కంపెనీలకు వరుసగా రూ.34లక్షలు, రూ.11లక్షల జరిమానాను విధించింది.
ఎన్‌టీపీసీ:- టల్చల్‌ థెర్మినల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులను అంశాన్ని అధికారికంగా ధృవీకరించింది.
రిలయన్స్‌ క్యాపిటల్‌:- తొలిత్రైమాసికంలో రూ.111 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. ఆదాయం రూ.563కోట్లను ఆర్జించింది.
హడ్కో:- 2019-19 ఆర్థిక సంవత్సరం ఆగస్ట్‌ 31నాటికి కంపెనీ మొత్తం రూ, 4,094.91ను మంజూరు చేసింది. ఇదే కాలానికి రూ.3,021.66 కోట్ల రుణాలను విడుదల చేసింది.
సుజ్లాన్‌ ఎలక్ట్రానిక్స్‌:- ప్రమోటర్ల తన మొత్తం వాటా 36శాతం నుంచి 2శాతం వాటాను ఉపసంహరించుకున్నారు.
మోడ్రన్‌ ఇండియా:- తన అనుబంధ సంస్థ మోడ్రన్‌ ఇండియా ఫ్రీ వేర్‌హౌసింగ్స్‌ నుంచి 24,500 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది.
విప్రో:- ఇన్సూరెన్స్‌ సంబంధిత సాంకేతిక పరిఙ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి డచ్‌ క్రీక్‌ టెక్నాలజీస్‌ సంస్థతో జతకట్టింది.
కల్పతరు పవర్‌:- రూ.100 కోట్ల విలువైన ఎన్‌సీడీల జారీ ఇష్యూ ఆమోదానికి బోర్డు అనుమతి కోరనుంది.You may be interested

73కు చేరువలో రూపీ

Wednesday 12th September 2018

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి బుధవారం మరో కొత్త రికార్డ్‌ కనిష్ట స్థాయికి పతనమైంది. 73 మార్క్‌కు కేవలం 10 పైసలు దూరంలో నిలిచింది. క్రూడ్‌ ధరలు పెరగటం, వర్ధమాన కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతుండటం ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.89 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 72.70తో పోలిస్తే 0.25 శాతం తగ్గింది. ఇక డాలర్‌తో

లాభాలతో ఆరంభం

Wednesday 12th September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,413 పాయింట్లతో పోలిస్తే 133 పాయింట్ల లాభంతో 37,546 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,287 పాయింట్లతో పోలిస్తే 53 పాయింట్ల లాభంతో 11,340 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే లాభాలు వెంటనే ఆవిరయ్యాయి. ఇండెక్స్‌లు నష్టాల్లోకి జారిపోయాయి. అయితే మళ్లీ సెన్సెక్స్‌, నిఫ్టీలు లాభాల్లోకి వచ్చాయి.  అమెరికా మార్కెట్లు

Most from this category