STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 24th May 2019
Markets_main1558672809.png-25901

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
సిప్లా:- ఏఎంపీ సోలార్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 26శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
ఓమ్‌ మెటల్స్‌ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్‌:- ప్యాకింగ్‌ విభాగాన్ని విక్రయించింది. 
రాడికో ఖైతాన్‌:- గతంలో ఉత్తరప్రదేశ్‌ యూనిట్‌కు ఆదేశించిన మూసివేత ఆర్డర్లను పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఎత్తివేసింది. 
హిందూస్థాన్‌ కాపర్‌:- మే 28న జరిగే బోర్డు సమావేశంలో కంపెనీ  రుణ సేకరణ మొత్తాన్ని పెంపుతో పాటు, షేర్‌ హోల్డర్లకు సెక్యూరిటీల జారీ, మార్పిడి అంశాలపై చర్చించనుంది. 
ఇన్ఫోసిస్‌:- వ్యాపార అవసరాల నిమిత్తం నెదర్లాండ్‌ చెందిన ఏబీఎన్‌ ఏఎంఆర్‌ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.న 
రిలయన్స్‌ క్యాపిటల్‌:- రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌లోని తన మొత్తం వాటాలో  5.25శాతానికి సమానమైన 3.21 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విక్రయానికి సిద్ధమైంది. ఇందుకు ఫ్లోర్‌ ధరను రూ.218లుగా నిర్ణయించింది.
జెన్సార్‌:- సన్లాంకు డిజిటల్‌ సేవలను అందించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైల్‌:- కేర్‌ రేటింగ్‌ సంస్థ వాణిజ్య పేపర్లపై రేటింగ్‌ను ఎ1(+)కు పెంచింది.
నేడు క్యూ4 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:- గ్రాసీం ఇండస్ట్రీస్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌, ఆర్‌ఈసీ, పేజ్‌ ఇండస్ట్రీస్‌, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌, డిష్‌ టీవీ ఇండియా, దిక్షాన్‌ టెక్నాలజీస్‌, ఇంద్రప్రస్థా గ్యాస్‌, అడ్వాన్స్‌డ్‌ ఎన్‌జైమ్‌ టెక్నాలజీస్‌, అంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, అశోక్‌ లేలాండ్‌, అస్ట్రాజెనికా ఫార్మా, ఫార్మా ఇండియా, బాటా ఇండియా, బిర్లా సాఫ్ట్‌, ఎక్సైల్‌ ఇండస్ట్రీస్‌, ఎఫ్‌డీసీ, జీఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, జీవీకే పవర్‌ ఇన్ఫ్రాస్ట్రక‌్షర్‌, ఐడీఎఫ్‌సీ, జై కార్ప్‌, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌, లిబర్టీ షూస్‌, మాగ్నా షుగర్స్‌, నాగార్జునా ఫెర్టిలైజర్స్‌, పంజాజ్‌ సింధ్‌ బ్యాంకు, యూనికెమ్‌ ల్యాబ్స్‌, జువారీ గ్లోబ్‌, ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌, నారాయణ హృదయాలయ, వెల్‌స్పన్‌ ఇండియా, వర్ల్‌పూల్‌  వీటితో పాలు దాదాపు 175 కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. You may be interested

1280 డాలర్ల వద్ద పసిడి

Friday 24th May 2019

డాలర్‌ ఇండెక్స్‌ 2ఏళ్ల గరిష్టం నుంచి వెనక్కి రావడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర 1280 డాలర్ల వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1284 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా నిన్న రాత్రి విడుదల చేసిన తయారీ రంగ గణాంకాలు పదేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. ఏప్రిల్‌లో హౌసింగ్‌ అమ్మకాల గణాంకాలు కూడా మార్కెట్‌ను నిరుత్సాహపరిచాయి. బలహీన ఆర్థిక గణాంకాల విడుదలైన నేపథ్యంలో

సెన్సెక్స్‌ 265 పాయింట్ల గ్యాప్‌అప్‌

Friday 24th May 2019

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో క్రితం రోజు తొలుత కొత్త రికార్డులు నెలకొల్పి, అటుతర్వాత లాభాల స్వీకరణతో తగ్గిన స్టాక్‌ సూచీలు శుక్రవారం తిరిగి గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 265 పాయింట్లు గ్యాప్‌అప్‌తో 39,075 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 90 పాయింట్ల లాభంతో 10,750 పాయింట్ల సమీపంలో మొదలయ్యింది. ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ధరలు తగ్గడంతో పెట్రో మార్కెటింగ్‌ షేర్లు బీపీసీఎల్‌, ఐఓసీలు 2-3 శాతం

Most from this category