News


సోమవారం వార్తల్లో షేర్లు

Monday 9th September 2019
Markets_main1568001938.png-28260

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
అవెన్యూ సూపర్‌మార్స్‌:-
రూ.150 కోట్ల విలువైన కమర్షియల్‌ పేపర్ల ఇష్యూను జారీ చేసింది. 
పీసీ జ్యూవెలర్స్‌:- సెప్టెంబర్‌ 30న కంపెనీ వార్షిక సాధారణ సమావేశం జరగనుంది. 
 పీటీసీ ఇండస్ట్రీస్‌:- ప్రిఫరెన్షియల్‌ ఇష్యూ కోసం కంపెనీ సభ్యుల అనుమతి కోరే ప్రతిపాదనను వాయిదా వేయాలని నిర్ణయించుకుంటుంది 
ఎన్‌బీసీసీ:- ఆగస్ట్‌లో రూ.400 కోట్ల విలువైన కోట్ల ఆర్డర్లను దక్కించుకున్నట్లు ఎక్సే‍్ఛంజీలకు సమాచారం ఇచ్చింది. 
రాణే హోల్డింగ్స్‌:- రూ.50 కోట్ల విలువైన లైన్‌ ఆఫ్‌ క్రిడెట్‌ ఇష్యూకు ఇక్రా రేటింగ్స్‌ సంస్థ ఇక్రా ఎఎ(-)ను, స్థిరత్వం అవుట్‌లుక్‌ను కేటాయించింది
కెనరా బ్యాంక్‌:- కెన్‌ ఫిన్స్‌ హోమ్స్‌లో తన 29.99 శాతం వాటాను విక్రయించడానికి బిడ్లను ఆహ్వానించింది.
వరుణ్‌ బేవరేజెస్‌:- క్యూఐపీ ఇష్యూలో భాగంగా ప్రతి షేరు ధరను రూ.612లుగా నిర్ణయించింది. 
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ఎన్‌సీడీలపై రూ.25 కోట్ల వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది.
చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్స్‌:- రూ.8000 కోట్ల కమర్షియల్స్‌ పేపర్ల జారీ ఇష్యూకు క్రిసెల్‌, ఇక్రా రేటింగ్‌ సంస్థలు ఎ1(+) రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు ప్రకటించాయి.
కెనరా బ్యాంక్‌:- సవరించిన వడ్డీరేట్లు సెప్టెంబర్‌ 07 నుంచి అమల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది. 
వివిమెడ్‌ ల్యాబ్స్‌:- తన అనుబంధ సంస్థ వివిమెడ్‌ సెష్పాలిటి కెమికల్స్‌తో బదిలీలు, విక్రయాలకు సంబంధించి వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
పీఎన్‌బీ:- రూ.1,234 కోట్ల బకాయిలను రాబట్టేందుకు పీఎన్‌బీ 11 మొండిబకాయిల ఖాతాలను అమ్మకానికి పెట్టింది
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- కేజీ-డీ6 క్షేత్రంలో కొత్త బావుల్లో సహజవాయువు ఉత్పత్తి చేసేందుకు, యూనిట్‌ కనీస ధర 5.4 డాలర్లు  ఉండాలంటూ కొనుగోలుదార్ల నుంచి బిడ్స్‌ ఆహ్వానించింది. 
కాఫీ డే:- అనుబంధ సంస్థలో షేర్ల విక్రయానికి ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీ సంస్థను సలహాదారు కంపెనీగా నియమించుకుంది. 
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌:- అన్ని రకాల వడ్డీరేట్లపై ఎంసీఎల్‌ఆర్‌ను 10-15 బేసిస్‌ పాయింట్ల కోత విధించింది. 
శిల్పా మెడికేర్‌:- కంపెనీ డోజేస్‌ ఫార్మూలేషన్‌ ఫ్యాకల్టీకీ యూఎస్‌ఎఫ్‌డీఏ సంస్థ 2 అబ్జర్వేషన్లతో కూడిన 483 ఫామ్‌లను జారీ చేసింది.You may be interested

గణాంకాలే దిక్సూచి..!

Monday 9th September 2019

స్థూల ఆర్థికాంశాలే ఈవారంలో కీలకం గురువారం రిటైల్‌ ద్రవ్యోల్బణం, ఐఐపీ డేటా వెల్లడి ఈవారం ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం మొహర్రం సందర్భంగా మంగళవారం మార్కెట్‌కు సెలవు ముంబై: స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. జూలై నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి, ఆగస్టు నెల రిటైల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు గురువారం వెల్లడికానుండగా.. ఈ ప్రధాన

స్వల్పనష్టాలతో ప్రారంభం

Monday 9th September 2019

 ఆగస్టు నెలలో చైనా ఎగుమతులు క్షీణించాయన్న వార్తలతో నిస్తేజంగా ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లకు అనుగుణంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 13 పాయింట్ల నష్టంతో 36,969 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9 పాయింట్ల నష్టంతో 10,937 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఆటోమొబైల్‌ షేర్లు నష్టాలకు లోనయ్యాయి. టాటా మోటార్స్‌, మారుతి, ఐషర్‌ మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, హీరో మోటో, బజాజ్‌

Most from this category