News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 23rd August 2019
Markets_main1566532351.png-27957

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌:-
కంపెనీ సీఎఫ్‌ఓగా శ్రీనివాసన్‌ వైద్యనాథన్‌ నియమితులయ్యారు. 
ఫ్యూచర్‌ రిటైల్‌:- ఫ్యూచర్‌ కూపన్‌ లిమిటెడ్‌లో 49శాతం వాటాను కొనుగోలు చేసింది. 
సోమనీ సిరామిక్స్‌:- షాబ్లోనా ఇండియా కంపెనీ విలీనానికి సంబంధించిన డ్రాఫ్ట్‌ స్కీమ్‌ ఆఫ్‌ అమాల్గమేషన్‌ కు ఆమోదం తెలిపింది. 
జిల్లేట్‌ ఇండియా:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.10లు ముఖవిలువ కలిగిన ప్రతి షేరుపై రూ.25ల తుది డివిడెండ్‌ను ప్రకటించింది.
శ్రీజీ ట్రాన్స్‌లాజిస్టిక్ట్స్‌:- మధ్యంతర డివిడెండ్‌, బోనస్‌ ఇష్యూతో పాటు ఎస్‌ఎంఈ ఫ్లాట్‌ఫామ్‌ నుంచి ప్రధాన బీఎస్‌ఈ ఫ్లాట్‌కు మారేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. 
శివరాం అటోటెక్‌:- కేర్‌ రేటింగ్‌ సంస్థ యొక్క దీర్ఘకాలిక బ్యాంక్ సదుపాయాలపై క్రెడిట్ రేటింగ్‌ను బిబిడి + అవుట్‌లుక్‌ స్థిరత్వ నుంచి బిబిబి నెగిటివ్‌ అవుట్‌లుక్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది.
కమర్షియల్‌ సైన్‌ బ్యాగ్స్:- 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీ రూ.10ముఖ విలువ కలిగిన ప్రతి షేరుపై 80పైసలు తుది డివిండెండ్‌ను రికమెండ్‌ చేసింది. 
సుప్రీం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ ఇండియా:- మార్చి క్వార్టర్‌ ఫలితాల ప్రకటనను వాయిదా వేసింది. 
భెల్‌ లిమిటెడ్‌:-  క్రిసిల్‌ రేటింగ్‌ సంస్థ... కంపెనీ ధీర్ఘకాలిక బ్యాంకు రుణసదుపాయాలపై అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి నెగిటివ్‌ కుదించింది. అయితే రేటింగ్‌ మాత్రం ఎఎ+కు కొనసాగించింది. 
గ్లెన్‌మార్క్‌:- ఏపీఐ వ్యాపారంలో 30శాతం వాటాను ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు విక్రయించేందుకు చర్చలు జరుపుతోంది. 
ఎన్‌టీపీ:- రుణ సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు, బాండ్ల ద్వారా రూ.15వేల కోట్ల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. 
పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌:- బంగ్లాదేశ్‌లో నూతన జిగురు తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది.
ఫిడిలిటి ఇన్వెస్ట్‌మెంట్‌:- ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు చెందిన రూ.820 కోట్లకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించింది. 
ఆల్కేమ్‌ ల్యాబ్స్‌:- ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌, ఆదిత్యా బిర్లా సన్‌ లైఫ్‌ కంపెనీలు రూ.538 కోట్లకు సమానమైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశాయి. 
బ్రిటానియా:- మందగమానికి అధిగమించేందుకు ధరలను స్వల్పంగా పెంచింది.
నేడు క్యూ1 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు:- టెక్నోఫ్యాబ్‌ ఇంజనీరింగ్స్‌, వడిలాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, భారత్‌ భూషణ్‌ షేర్‌, గోలెచ్చ గ్లోబల్‌ ఫైనాన్స్‌You may be interested

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Friday 23rd August 2019

 ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన ప్యాకేజీ వుండబోదంటూ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వయిజర్‌ సంకేతాలివ్వడంతో క్రితం రోజు భారీ పతనాన్ని చవిచూసిన భారత్‌ సూచీలు శుక్రవారం సైతం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 85 పాయింట్ల తగ్గుదలతో 36,387 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 10,700 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 

‘40 ఏళ్ల అనుభవంలో ఈ స్థాయి సంపద విధ్వంసాన్ని చూడలేదు’

Friday 23rd August 2019

దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సగం సమస్యలు... ప్రభుత్వం తన బకాయిలను చెల్లించడం వల్ల పరిష్కరించొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సహ వ్యవస్థపాకుడు రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అన్నారు. ‘‘30 రోజుల బిల్లును ప్రభుత్వం కనీసం 30 రోజుల్లోపు చెల్లించినా మూడింట ఒక వంతు సమస్యలు పరిష్కారం అవుతాయి’’ అని పేర్కొన్నారు. హీరో మైండ్‌మైన్‌ సదస్సు 2019 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రామ్‌దేవ్‌ అగర్వాల్‌ మాట్లాడారు. విధాన నిర్ణేతలు భారతీయ వృద్ధి

Most from this category