News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 17th June 2019
Markets_main1560746464.png-26333

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
ఆస్టర్‌ డీఎం:-
ఇక్రా రేటింగ్‌ సంస్థ రుణ రేటింగ్‌ ఎ(-) నుంచి బిబిబి(+)కు పెంచింది. కంపెనీ అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి పాజిటివ్‌కు సవరించింది.
సింజన్‌ ఇంటర్నేషనల్‌:- 1:1 నిష్పత్తిలో షేర్లు బోనస్‌ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. 
భెల్‌:- గుజరాత్‌ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ కార్పోరేషన్‌, ఎన్‌టీపీసీ సంస్థల నుంచి రూ.800ల కోట్ల విలువైన రెండు మౌలిక ప్రాజెక్ట్‌లను దక్కించుకుంది.
కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌:- గుజరాత్‌ పొల్యూషన్‌ బోర్డు ... గుజరాత్‌ ప్లాంట్‌కు గతంలో కేటాయించిన మూసివేత ఆర్డర్లను ఎత్తివేసింది.
ఇండియాబుల్స్ రియల్‌ ఎస్టేట్‌:- ప్రమోటర్లు జూన్‌ 14న కంపెనీ చెందిన కోటి షేర్లును తనఖా నుంచి విడిపించారు. 
ఇండియన్‌బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- ప్రమోటర్లు జూన్‌ 14న కంపెనీ చెందిన 42లక్షల ఈక్విటీ షేర్లను తనఖా నుంచి విడిపించారు.
ఫోర్టీస్‌ హెల్త్‌కేర్‌:- సిటీ బ్యాంక్‌ చెల్లించాల్సిన మొత్తం రుణాన్ని చెల్లించింది. 
కేడిలా హెల్త్‌కేర్‌:- తన అనుబంధ సం‍స్థ అలిడాక్‌ ఫార్మాకు చెందిన అలహాదాబాద్‌ యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఇన్‌స్పెక్షన్‌ రిపోర్ట్‌(ఈఐఆర్‌)ను అందజేసింది. ఈ ప్లాంట్‌లో యూఎస్‌ఎఫ్‌డీఏ మార్చి 18 నుంచి 26వరకు తనిఖీలను చేసింది.
జైపీ ఇన్ఫ్రా:- ఈ జూన్‌ 20వ తేదిన కంపెనీ రుణదాతలు సమావేశం కానున్నారు. 
ఎన్‌డీటీవీ:- ప్రమోటర్లు ప్రణయ్‌రాయ్‌, రాధికారాయ్‌పై సెబీ 2ఏళ్ల కాలం పాటు మార్కెట్‌ సెక్యూరిటీ యాక్సెసింగ్‌ను రద్దు చేసింది. 
కార్పోరేషన్‌ బ్యాంక్‌:- ఏడాది కాలపరిమితి కలిగిన ఎంసీఎల్‌ఆర్‌ రేట్లపై 5 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది.
సీసీఎల్‌ ప్రాడెక్ట్స్‌:- ఇండియా రేటింగ్స్‌ సంస్థ కంపెనీ అవుట్‌లుక్‌ను స్థిరత్వం నుంచి పాజిటివ్‌కు సవరించింది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- జూన్‌ 14న కంపెనీ రూ.100 కోట్ల విలువైన ఎన్‌సీడీలపై చెల్లించిన రూ.25లక్షల వడ్డీని చెల్లించినట్లు కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. 
లారస్‌ ల్యాబ్స్‌:- ఏపీఐ ఫ్యాకల్టీ యూనిట్‌లో తనిఖీలు పూర్తి చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ రెండు అబ్జర్వేషన్లు గుర్తించింది. 
దివీస్‌ ల్యాబ్స్‌:- ఆంధ్రప్రదేశ్‌లో భీమునిపట్నంలోని ప్లాంట్‌ యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలను పూర్తి చేసింది. ఎలాంటి అబ్జర్వేషన్లను జారీ చేయలేదు. You may be interested

ఫెడ్‌ నిర్ణయం, వాణిజ్య చర్చలే కీలకం..

Monday 17th June 2019

 బుధవారం వెల్లడికానున్న ఫెడ్‌ వడ్డీరేట్ల నిర్ణయం గురువారం ఆర్‌బీఐ మినిట్స్‌ వెల్లడి ఈవారంలోనే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం వాణిజ్య యుద్ధం, ముడిచమురుపై ఇన్వెస్టర్ల దృష్టి ముంబై: ఎన్నికల ర్యాలీ అనంతరం పరిమిత శ్రేణిలో కదలాడుతున్న దేశీయ స్టాక్‌ సూచీలు.. ఇక్కడ నుంచి ఏదిశగా ప్రయాణించనున్నాయనే అంశానికి అంతర్జాతీయ పరిణామాలే కీలకమని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈవారంలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశంకానుండగా.. వడ్డీరేట్ల కోతకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయనే అంశంపైనే ప్రధానంగా మార్కెట్‌

పెరిగిన ఆయిల్‌ ధరలు

Monday 17th June 2019

ఆయిల్‌ ట్యాంకర్లపై జరిగిన దాడే కారణం గతవారం ఆయిల్‌ ట్యాంకర్లపై జరిగిన దాడి తరువాత మధ్య ఆసియా దేశాలలో చెలరేగిన ఒత్తిడిని తగ్గించడానికి అమెరికా అవసరమైన చర్యలను తీసుకుంటుందని అమెరికా సెక్రటరి మైక్‌ పాంపే తెలపడంతో సోమవారం చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ ప్యూచర్‌ ధర 0.4 శాతం పెరిగి బ్యారెల్‌కు 62.28 డాలర్లగా ట్రేడవుతోంది. గత సెషన్‌లో 1.1శాతం పెరుగుదలను ఇది నమోదుచేసింది. డబ్యూటీఐ క్రూడ్‌ ప్యూచర్‌ 0.4శాతం పెరిగి

Most from this category