News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 11th February 2019
Markets_main1549862962.png-24119

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితయ్యే షేర్ల వివరాలు
భారతీ ఎయిర్‌టెల్‌:- కెన్యా ఎయిర్‌టెల్‌ విభాగం ఆఫ్రికాలోని టెలికామ్‌ కెన్యా కంపెనీ విలీనం చేసుకుంది.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- జీనియస్‌ కలర్స్‌ కంపెనీలో 9.50శాతం వాటాను రూ.45 కోట్లకు తన అనుబంధ రిలయన్స్‌ రీటైల్‌ వెంచర్‌ లిమిటెడ్‌ కొనుగోలు చేసింది.
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ హైదరాబాద్‌లోని బూచుపల్లి ఫార్మేషన్‌ యూనిట్‌-3లో తనిఖీలను పూర్తి చేసింది.
లుపిన్‌:- గోవా యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ 2రెండు అబ్జర్వేషన్లలతో కూడిన 483-ఫామ్‌ను జారీ చేసినట్లు ఎక్చే‍్సంజ్‌లకు తెలిపింది.
ఎస్‌బీఐ:- ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు అనంతరం ఇంటి రుణాలపై వడ్డీరేట్ల తగ్గించింది. రూ.30 లక్షల వరకు తీసుకున్న గృహరుణాలపై వడ్డీరేటును 5 బేసిప్‌ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
ప్రకాశ్‌ ఇండస్ట్రీస్‌:- వైర్ల ఉత్పత్తిని మరింత పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా చత్తీస్‌ఘడ్‌లోని రోలింగ్‌ మిల్స్‌ను ఆధునీకరించింది.
అలహాదాబాద్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, కార్పోరేషన్‌ బ్యాంక్‌:- రెగ్యులేటరీ నిబంధనలను ఉల్లఘించిన నేపథ్యంలో ఆర్‌బీఐ ఈ మూడు బ్యాంకులకు జరిమానా విధించింది. అలహాదాబాద్‌ బ్యాంక్‌ రూ.1.50కోటి, పీఎన్‌బీ బ్యాంక్‌ రూ.1కోటి, కార్పోరేషన్‌ బ్యాంక్‌కు రూ.2కోట్ల జరిమాన విధించింది.
వోల్టాస్‌: దక్షిణ భారతదేశంలో తన వ్యాపార విభాగాన్ని మరింత విస్తరించేందుకు రూ.500 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌:- తన అనుబంధ సంస్థ పీఎఫ్‌సీ గ్రీన్‌ ఎనర్జీని విలీనం చేసుకునేందుకు ఎన్‌సీఎల్‌టీ నుంచి అనుమతులు దక్కించుకుంది.
నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించునున్న కొన్ని ప్రధాన కంపెనీలు.
ఐషర్‌మోటర్స్‌, ఆంధ్రా బ్యాంక్‌, కార్పోరేషన్‌ బ్యాంక్‌, మదర్సన్‌ సుమీ సిస్టమ్స్‌, అమరరాజా బ్యాటరీస్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌, సెంట్రమ్‌ క్యాపిటల్‌, సీఈఎస్‌సీ వెంచర్స్‌, రిలయన్స్‌ హోమ్స్‌ ఫైనాన్స్‌, మాక్స్‌ ఇండియా, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స​, అవధ్‌ షుగర్స్‌ అండ్‌ ఇంజనీరింగ్స్‌, ఆఫ్టిమస్‌ ఇన్ఫ్రాకామ్‌, టీసీపీఎల్‌ ప్యాకేజింగ్‌,  రెప్కో ఇండియా, కేర్‌ రేటింగ్స్‌, స్వాన్‌ ఎనర్జీ, హిందూస్థాన్‌ కాపర్‌, ఆంధ్రా సిమెంట్స్‌, ఈస్ట్రర్‌ ఇండస్ట్రీస్‌, జైపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, ఆర్తి డ్రగ్స్‌, జేబీఎం అటో, జైశ్రీ టీ, మెక్‌డొనాల్డ్‌ హోల్డింగ్స్‌, బ్లూచిప్‌ ఇండియా, గుజరాత్‌ ఇండస్ట్రీస్‌ పవర్‌ కంపెనీ, ఇండ్‌-సిఫ్ట్‌ ఆర్గాన్‌, గ్రేట్‌ ఈస్ట్రన్‌ షిప్పింగ్‌ కంపెనీ, ఇండియా సిమెంట్స్‌, నహర్‌ షిప్పింగ్‌ మిల్స్‌, ఆయిల్‌ సెంచరీ, సూర్యలక్ష్మీ కాటన్‌ మిల్స్‌, మంగళం టింబర్‌ ప్రాడెక్ట్స్‌, ఐటీఐ.You may be interested

డాక్టర్‌ రెడ్డీస్‌ 8శాతం డౌన్‌

Monday 11th February 2019

దేశీయ ఫార్మా దిగ్గజ కంపెనీ డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేర్లు సోమవారం 8శాతం నష్టపోయాయి. ఇటీవల హైదరాబాద్‌ బూచపల్లి ఫార్యూలేషన్‌ యూనిట్‌-3లో తనిఖీలు నిర్వహించిన అమెరికా ప్రాతిపాధిక ఆహార నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీ) యూనిట్‌లో 11లోపాలను గుర్తిస్తూ 483-ఫామ్‌ను జారీ చేసినట్లు శుక్రవారం డాక్టర్‌ రెడ్డీస్‌ స్టాక్‌ ఎక్చ్చేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ ప్రతికూల అంశంతో నేడు బీఎస్‌ఈలో షేరు 4శాతం నష్టంతో రూ.2670.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇన్వెస్టర్లు ఇంట్రాడేలో

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 11th February 2019

10,900 దిగువన నిఫ్టీ ప్రారంభం ప్రపంచమార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల నేపథ్యంలో సోమవారం దేశీయ మార్కెట్‌ మిశ్రమంగా ప్రారంభమైంది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 10,900 పాయింట్ల దిగువన ప్రారంభంకాగా,  సెన్సెక్స్‌ 130 పాయింట్లు నష్టంతో 36,416 పాయింట్ల వద్ద మొదలైంది. ఎఫ్‌ఎంజీసీ, అటో, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, ఫార్మా,  షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు మెటల్‌, మీడియా షేర్లలో స్వల్పంగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.  నిఫ్టీ - 50 ఇండెక్స్‌లో గెయిల్‌, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, డాక్టర్‌ రెడ్డీస్‌,

Most from this category