News


నేటి వార్తల్లోని షేర్లు

Tuesday 3rd March 2020
Markets_main1583212604.png-32238

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు

భారతీ ఎయిర్‌టెల్‌: ఈ కంపెనీ చెల్లించాల్సిన ఏజీఆర్‌ బాకాయిలు ప్రభుత్వం అంచనా వేసిన దానిలో మూడో వంతు మ్రాతమే ఉన్నాయని భారతీ ఎయిర్‌ టెల్‌ తెలిపింది. మొదట్లో టెలికం విభాగం కొన్ని మినహాయింపులు ఇచ్చిందని వాటన్నింటిని తీసివేస్తే ఈ మొత్త వచ్చిందని కంపెనీ పేర్కొంది.

జిందాల్‌ స్టెయిన్‌లెస్‌: కోటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ నిర్వహించే కోటక్‌ స్పెషల్‌ సిట్యూవేషన్‌ ఫండ్‌(కేఎస్‌ఎస్‌ఎఫ్‌) జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ లిమిటెడ్‌ కంపెనీ(జేఎస్‌ఎల్‌)లో డెట్‌, ఈక్విటీల రూపంలో రూ.500 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. 

మారుతీ సుజుకీ: పర్యావరణ నిబంధనలు BS-VIకు అనుగుణంగా మారుతీ సుజుకీ  రూ.5 లక్షలలోపు ధరలో లభించే రెండు కొత్త కార్‌ మోడల్స్‌ను తయారు చేయనుంది.

కాక్స్‌ అండ్‌ కింగ్స్‌: ఈ కంపెనికి చెందిన అనుబంధ సంస్థ ప్రొమెథీయాన్‌ ఎంటర్‌ప్రైజ్‌ మే 30న వెల్లడించిన కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నకిలీ ఆర్థిక నివేదికలు ప్రకటించిందని కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ కంపెనీకి కొత్తగా నియమితులైన చట్టబద్దమైన ఆడిటర్స్‌ తెలిపారు.

ఇన్ఫోసిస్‌: మాజీ సీఎఫ్‌ఓ రాజీవ్‌ బన్సాల్‌కు కంపెనీకి ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసేందుకు కాంఫౌండింగ్‌ ఫీజును రూ.6 లక్షలు చెల్లించినట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది.

టీవీఎస్‌ మోటార్‌: BS-IV వాహన విక్రయాలు తగ్గించడం, కరోనా వైరస్‌ వ్యాప్తితో ఫిబ్రవరి నెలలో టీవీఎస్‌ మోటార్‌ విక్రయాలు 15.39 శాతం పడిపోయాయని కంపెనీ వెల్లడించింది.  కాగా ఫిబ్రవరిలో మొత్తం 2,53,261 వాహనాలను విక్రయించినట్లు తెలిపింది.

మైండ్‌ట్రీ: దయాపత్రా నెవాటియను కొత్త చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా(సీఓఓ) మైండ్‌ట్రీ కంపెనీ నియమించింది. 

ఐజీఎల్‌: ఇంద్రప్రస్థ గ్యాస్‌ కంపెనీ గ్యాస్‌ మీటర్ల తయారీ పరిశ్రమను ప్రారంభించనుంది. తద్వారా రిలయన్స్‌ కంపెనీ చైనా నుంచి దిగుమతి చేసుకునే గ్యాస్‌ మీటర్లను తగ్గించవచ్చని ఐజీఎల్‌ భావిస్తోంది.  

బజాజ్‌ ఆటో: ఈ కంపెనీ వాహన విక్రయాలు ఫిబ్రవరిలో 10 శాతం పడిపోయి గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే  3,93,089 యూనిట్ల నుంచి 3,54,913 చేరిందని బజాజ్‌ ఆటో వెల్లడించింది.  అదేవిధంగా దేశీయ వాహన విక్రయాలు 24 శాతం తగ్గి గత ఫిబ్రవరితో పోలిస్తే 2,21,706 యూనిట్ల నుంచి 1,68,747 యూనిట్లకు చేరిందని  తెలిపింది.

ఎన్‌టీపీసీ: ఎన్‌టీపీసీ అనుబంధ సంస్థలతో కలిసి సంయుక్తంగా వార్షిక(2019-20) వాణిజ్య అదనపు సామర్ధ్యం లక్ష్యం 5,290 మెగావాట్లకు చేరుకున్నట్లు ఎన్‌టీపీసీ వెల్లడించింది. You may be interested

స్వల్పంగా పెరిగిన పుత్తడి

Tuesday 3rd March 2020

సోమవారం భారీగా పెరిగిన పసిడిధరలు మంగళవారం స్వల్పంగా పుంజుకున్నాయి. దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.150 పెరిగి 10 గ్రాముల బంగారం రూ.42,026.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే 6 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,600.85 డాలర్ల  వద్ద ట్రేడ్‌ అవుతోంది. (సోమవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)  

39 శాతం సబ్‌స్క్రైబయిన ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ

Tuesday 3rd March 2020

ఈ నెల 5న ముగింపు  ఇష్యూ సైజు రూ.10,355 కోట్లు  ఈ నెల 16న లిస్టింగ్‌ న్యూఢిల్లీ: ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) తొలి రోజు 39 శాతం సబ్‌స్క్రైబయింది. సోమవారం ప్రారంభమై ఈ నెల 5న ముగిసే ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ను రూ.750-755గా నిర్ణయించారు. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.10,355 కోట్లు సమీకరిస్తుందని అంచనా. తొలి రోజు రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటా 62 శాతం,

Most from this category