STOCKS

News


శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 6th September 2019
Markets_main1567743510.png-28232

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
బజాజ్‌ ఫైనాన్స్‌:-
క్యూఐపీ ద్వారా నిధుల సమీకరణ అంశంపై చర్చించేందుకు ఈ సెప్టెండర్‌ 17న కంపెనీ బోర్డు సమావేశాన్ని నిర్వహించునుంది.
టీసీఎస్‌:- పోస్టెన్ నార్జ్ కంపెనీతో వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 
డాటామాస్టిక్స్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌:- బెంగళూర్‌ ఇంటర్నేషన్‌ ఎయిర్‌పోర్ట్‌ తన డిజిటల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ భాగస్వామిగా ఎన్నుకుంది. 
ప్రభాత్‌ డైరీ:- డీలిస్టింగ్‌ ప్రపోజల్‌పై చర్చించేందకు సెప్టెంబర్‌ 10న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.
ఇండోసోలార్‌:- కం‍పెనీ సీఈవోగా అనంద్‌ కుమార్‌ ఎన్నికయ్యారు. 
హావెల్స్‌:- దేశంలోనే మొట్టమొదటి పూర్తి చదరపు పిడిస్టల్‌ ఫ్యాన్‌ను ఆవిష్కరించింది. 
ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- ప్రమోటర్‌ ధాఖలు చేసిన పిల్‌పై క్లారిటీనిచ్చింది. 
సిండికేట్‌ బ్యాంక్‌:- లాంగ్‌ టర్మ్‌ ఇష్యూయర్‌ రేటింగ్‌కు రేటింగ్ వాచ్ ఎవాల్వింగ్ గా కేటాయించారు.
సుందరమ్‌ ఫాస్టెనర్స్:- క్రిసిల్‌ రేటింగ్‌ సంస్థ కంపెనీ స్వల్పకాలిక రుణానిక, కమర్షియల్‌ పేపర్ల ఇష్యూకు ఎ1(+) రేటింగ్‌ను కేటాయించింది.
అదానీ పోర్ట్స్‌:- నేడు బై బ్యాంక్‌ ప్రారంభం నుంచి కానుంది. ఇదే నెల 20వ తేదిన ముగియనుంది. 
సన్‌ఫార్మాస్యూటికల్స్‌ ఇండస్ట్రీస్‌:- 2015-16, 2017-18 ఆర్థిక సంవత్సరాల్లో జరిగి ఆర్థిక లావాదేవీలపై సెబీ ఫోర్సెనిక్‌ అడిట్‌కు ఆదేశించింది. 
టెక్‌ మహీంద్రా:- ఎటీ అండ్‌ టీ కంపెనీతో వ్యూహాత్మక పరస్పర సహకార భాగస్వామ్యాన్ని విస్తరించింది. 
అశోక్‌ లేలాండ్‌:- ఎన్నోర్‌ ప్లాంట్‌కు 5 రోజుల సెలవు దినాల్ని ప్రకటించింది. సెలవులు సెప్టెంబర్‌ 06 నుంచి అమల్లోకి రానున్నా‍యి. You may be interested

ఆరంభం అంతంతమాత్రం... కానీ!

Friday 6th September 2019

ముగింపు సమయానికి లాభాల్లోకే.. సెప్టెంబర్‌ సీరిస్‌పై బ్రోకరేజ్‌ల అంచనా వరుసగా మూడు సీరిస్‌లు నెగిటివ్‌గా క్లోజయిన దేశీయ మార్కెట్లు సెప్టెంబర్‌ ఎఫ్‌ అండ్‌ ఓ సీరిస్‌ను పేలవంగా ఆరంభించాయి. దేశీయ ఆర్థిక మందగమనంపై ఆందోళనలు మార్కెట్లో నెగిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమవుతున్నాయి. అయితే గతంలో పరిశీలిస్తే సెప్టెంబర్‌ సీరిస్‌ ఎక్కువమార్లు లాభదాయకంగానే ముగిసిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిఫ్టీలో డెరివేటివ్స్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి కేవలం ఒక్కమారు (2002)లో మాత్రమే సూచీలు వరుసగా నాలుగు సీరిస్‌లు నష్టాలు

ఆఫీసు సమయంలోనే ఆన్‌లైన్లో!!

Friday 6th September 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- స్మార్ట్‌ఫోన్లు వచ్చాక ఇంటర్నెట్లో విహరించడం సులువు అయింది. భారతీయుల్లో అత్యధికులు ఆఫీసు సమయంలోనే.. అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య ఆన్‌లైన్‌ కంటెంట్‌ను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారని కేపీఎంజీ, ఇరోస్‌ నౌ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్స్‌పై సగటున రోజుకు 70 నిముషాలకుపైగా సమయం వెచ్చిస్తున్నారట. హైదరాబాద్‌ సహా 16 నగరాల్లో చేపట్టిన ఈ సర్వేలో 1,458 మంది

Most from this category