News


యాక్సిస్‌, ఎల్‌అండ్‌టీకి ఫలితాల జోష్‌

Thursday 23rd January 2020
Markets_main1579752605.png-31124

డిసెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించిన యాక్సిస్‌ బ్యాంకు, ఎల్‌అండ్‌టీ షేర్లు గురువారం పాజిటివ్‌గా దూసుకుపోయాయి. యాక్సిస్‌ బ్యాంకు షేరు రూ. 725 వద్ద ఆరంభమై రూ. 737.55 గరిష్ఠాన్ని తాకి రూ. 730 వద్ద కదలాడుతోంది. గత క్లోజింగ్‌తో పోలిస్తే షేరు దాదాపు 2.5 శాతం లాభపడింది. ఎల్‌అండ్‌టీ షేరు రూ. 1307 వద్ద ఆరంభమై రూ. 1336.90 వద్ద గరిష్ఠాన్ని తాకి ప్రస్తుతం రూ. 1335 వద్ద కదలాడుతోంది. గత క్లోజింగ్‌తో పోలిస్తే షేరు సుమారు 3.08 శాతం లాభంతో ట్రేడవుతోంది. క్యు3లో ఎల్‌అండ్‌టీ లాభం 15.2 శాతం పెరిగి రూ. 2352 కోట్లకు, రెవెన్యూ 5.9 శాతం పెరిగి రూ. 36242.7 కోట్లకు చేరాయి. అదేవిధంగా యాక్సిస్‌బ్యాంకు నికర లాభం 4.5 శాతం పెరిగి రూ. 1757 కోట్లకు, ఎన్‌ఐఐ 15.3 శాతం పెరిగి రూ. 6453 కోట్లకు చేరాయి. ఫలితాలు బాగుండడంతో రెండు కౌంటర్లలో ఇన్వెస్టర్ల సందడి పెరిగింది. ఆర్థిక సంవత్సరం గైడెన్స్‌పై ఎల్‌అండ్‌టీ భరోసాగా ఉండడం, యాక్సిస్‌బ్యాంకు లోన్‌గ్రోత్‌ బాగుండడంతో రెండు షేర్లపై మదుపరులు బుల్లిష్‌గా మారారు. You may be interested

చమురుకు వైరస్‌ ఫీవర్‌!

Thursday 23rd January 2020

2 శాతం క్షీణించిన చమురు ధరలు 7 వారాల కనిష్టానికి బ్రెంట్‌ చమురు చైనాలో తలెత్తిన కరోనా వైరస్‌ దెబ్బకు ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. వెరసి బుధవారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 1.38 డాలర్లు(2.1 శాతం) క్షీణించి 63.21 డాలర్లను తాకింది. ఇక న్యూయార్క్‌ మార్కెట్లోనూ నైమెక్స్‌ బ్యారల్‌ 2.8 శాతం పతనమై 56.74 డాలర్లకు చేరింది.  నేలచూపుతోనే గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌ ముగింపుతో పోలిస్తే ప్రస్తుతం ఆసియా ట్రేడింగ్‌లో బ్రెంట్‌ బ్యారల్‌

12100 పైన ప్రారంభమైన నిఫ్టీ

Thursday 23rd January 2020

  76 పాయింట్లు లాభంతో మొదలైన సెన్సెక్స్‌  కలిసొచ్చిన క్రూడాయిల్‌ పతనం  అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం స్వల్ప లాభంతో మొదలైంది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 76 పాయింట్ల లాభంతో 41,191 వద్ద, నిఫ్టీ 16 పాయింట్లు పెరిగి 12,123.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, ఐటీ, ఆర్థిక, అటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. మీడియా, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి.  ఉదయం

Most from this category