STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 31st July 2019
Markets_main1564548956.png-27431

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితయమ్యే షేర్ల వివరాలు 
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:-
రుణదాతల కమిటికి తుది రిజల్యూషన్‌ ప్రణాళికను నివేదించింది. కమిటి ఈ నివేదికపై ఆగస్ట్‌ మొదటివారంలో చర్చించనుంది. 
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌:- రెండు రోజులపాటు జరిగిన చర్చల అనంతరం బైండింగ్‌ ఒప్పందంలో భాగంలో ప్రమోటర్లు సంస్థలో కొంతశాతం వాటా అమ్మడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఎస్‌బీఐ:- క్రిడెట్‌ కార్డు జాయింట్‌ వెంచర్‌లో కొంతభాగాన్ని విక్రయించి రూ.5,000-6,000 కోట్లను సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- తన టెలికాం అనుబంధ సం‍స్థ రిలయన్స్‌ జియో ఇన్పోకామ్‌ వ్యాపార విస్తరణలో భాగంగా టెలికాం పరికరాలను కొనుగోలు చేసేందుకు 1బిలయన్‌ డాలర్ల నిధుల సమీకరణకు ప్రణాళికలు సిద్ధమైనట్లు కంపెనీ అధికారులు తెలిపారు. 
టాటా కమ్యూనికేషన్‌:- జపాన్‌లో టీసీఎస్ సంస్థకు సీఈవోగా సేవలు అందిస్తున్న అమూర్‌ స్వామినాథన్‌ లక్ష్మీనారణయన్‌ టాటా కమ్యూనికేషన్‌ సీఈవోగా నియమించే అవకాశం ఉందని వార్తలు వెలువడ్డాయి.
మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌:- క్రిసెల్‌ రేటింగ్‌ సంస్థ... కంపెనీ ధీర్ఘకాలిక సదుపాయాలపై ఎఎ/స్థిరత్వం గానూ, స్వల్పకాలిక సదుపాయాలకు ఎ1(+) రేటింగ్‌ను కేటాయించింది.
ఆల్కేమ్‌ ల్యాబ్స్‌:- కంపెనీ సమాచారం మేరకు యూఎస్‌ఎఫ్‌డీ బుద్దీ యూనిట్‌ తనిఖీలను పూర్తి చేసింది. మే నెలలో ఈ యూనిట్‌ యూఎస్‌ఎఫ్‌డీ 4 అబ్జర్వేషనన్ల జారీ చేసిన సంగతి తెలిసిందే.
కాక్స్‌ అండ్‌ కింగ్స్‌:- జూలై 29న కమర్షియల్‌ పేపర్లపై చెల్లించాల్సిన రూ.10 కోట్ల రుణాన్ని చెల్లించడంలో విఫలమైంది. 
బంధన్‌ బ్యాంక్‌:- గృహ్‌ ఫైనాన్స్‌ విలీనానికి షేర్‌ హోల్డర్లు ఆమోదం తెలిపారు. 
నేడు క్యూ1 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు 
ఐషన్‌ మోటర్స్‌, ఐఓసీ, యూపీఎల్‌, అలహదాబాద్‌ బ్యాంక్‌, అశోక్‌ లేలాండ్‌, ఫ్యూచర్‌ రీటైల్‌, అపోల్‌ టైర్‌, బ్లూ డార్ట్‌, ట్రెంట్‌, జీ మిడియా, టాటా గ్లోబల్‌, సింఫనీలతో పాటు సుమారు 150 కంపెనీలు క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి.You may be interested

తగ్గిన రూపీ, బాండ్‌ ధరలు

Wednesday 31st July 2019

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశియంగా ద్యవ్యోల్బణం పెరుగుతుందని మార్కెట్‌ ఆందోళన చెందడంతో రూపీ, బాండ్‌ ధరలు బుధవారం పడిపోయాయి. దీంతోపాటు కీలక ఫెడ్‌ సమావేశం ముందు ట్రంప్‌ చైనాను ఒత్తిడికి గురిచేస్తుండడంతో  ట్రేడ్‌ వార్‌ తిరిగి ప్రారంభమవుతుందనే ఆందోళనలలో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. రూపీ డాలర్‌ మారకంలో బుధవారం 4 పైసలు బలహీనపడి 68.90 వద్ద ప్రారంభమైంది. గత సెషన్లో రూపీ  68.86 వద్ద ముగిసింది.   పదేళ్ల ప్రభుత్వ

కాఫీ డే షేరు...మరో 20 శాతం డౌన్‌ సర్క్యూట్‌

Wednesday 31st July 2019

 నిలిచిపోయిన 1.34 కోట్ల  షేర్ల అమ్మకం  కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ మృతదేహాం బుధవారం ఉదయం బయటపడడంతో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ షేరు విలువ బుదవారం(జులై 31) ట్రేడింగ్‌లో మరో 20 శాతం నష్టపోయి రూ. 122.75  వద్ద డౌన్‌ సర్య్కూట్‌ ఫ్రీజ్‌ అయ్యింది. ఉదయం 10.15 సమయానికి ఎన్‌ఎస్‌ఈలో 1,34,45,904 షేర్లు అమ్మకపు అర్డర్లు పేరుకుపోయాయి.  ఈ షేరు క్రితం రోజు సైతం 20 శాతం డౌన్‌సర్క్యూట్‌ను తాకిన సంగతి తెలిసిందే.

Most from this category