News


బుధవారం వార్తల్లోని షేర్లు

Thursday 11th July 2019
Markets_main1562817337.png-26964

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
స‌న్ ఫార్మా:-
రైస్ డ్రోనేట్ సోడియం ఔష‌ధాల‌ను యూఎస్ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు ద‌క్కించుకుంది.
అర‌బిందో ఫార్మా:- అమెరికా మార్కెట్లో సెన్సిప‌ర్ ఔష‌ధాల‌ను ఆవిష్కరించింది. 
పిరమిల్ ఎంట‌ర్‌ప్రైజెస్‌:- ఎన్‌సీడీల జారీ ద్వారా కంపెనీ రూ.1500 కోట్ల నిధుల స‌మీక‌ర‌ణ‌కు బోర్డు ఆమోదం తెలిపింది.
గ్రేవీస్ కాట‌న్‌:- ఆంపియర్‌ వెహికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అదనంగా 15 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. తద్వారా కంపెనీలో తన మొత్తం వాటాను 67.34శాతం నుంచి 72.11శాతానికి పెంచుకుంది. 
మెహతా ఇండస్ట్రీస్‌:- కంపెనీ గల బ్యాంకు రుణ సౌకర్యాన్ని సదుపాయానికి బ్రిక్‌ రేటింగ్స్‌ సంస్థ బిబిబి(+) రేటింగ్స్‌ను బిబిబి రేటింగ్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది.
ఇన్‌సిల్కో:- షెడ్యూల్‌లో భాగంగా జూలై 10 తేదీన ప్లాంట్‌ కార్యకలాపాలను ప్రారంభించింది.
టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ:- శ్రీలంక వాహన మార్కెట్లో 100సిసి మోటర్స్‌సైకిల్‌, టీవీస్‌ స్పోర్ట్స్‌ వాహనాలను ఆవిష్కరించింది. 
మహీంద్రా లాజిస్టిక్స్‌:- కంపెనీ సీఈవోగా రామ్‌ ప్రవీణ్‌ స్వామినాథన్‌ నియమితులయ్యారు. 
సాక్‌సాఫ్ట్‌ లిమిటెడ్‌:- డ్రీమ్‌ఆర్బిట్‌ కంపెనీ విలీన ప్రక్రియ పూర్తి చేసింది. 
నేడు క్యూ1 ఫ‌లితాల‌ను ప్రక‌టించే కొన్ని ప్రధాన కంపెనీలు:- సీసీఎల్ ప్రాడెక్ట్స్‌, డెన్ నెట్‌వ‌ర్క్‌You may be interested

నెల గరిష్ఠానికి చమురు

Thursday 11th July 2019

గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికోలో హరికేన్‌ పొం‍చి ఉండడంతో చమురు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీనితో పాటు బ్రిటిష్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ మధ్యప్రాచ్యంలో చిక్కుకోవడంతో గురువారం(జులై 11) ట్రేడింగ్‌లో డబ్యూటీఐ క్రూడ్‌ 11సెంట్‌లు పెరిగి బ్యారెల్‌కు 66.54 డాలర్ల వద్ద, బ్రెంట్‌ క్రూడ్‌ 5 సెంట్లు పెరిగా బ్యారెల్‌కు 66.96 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇరాన్‌ బ్రిటన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌ను బుధవారం నిలిపివేయడంతో మధ్యప్రాచ్యంలో ఒత్తిళ్లు పెరిగాయి. ఫలితంగా బుధవారం ఆయిల్‌

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Thursday 11th July 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పొవెల్‌....వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాల్ని వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్ల సానుకూలత ఫలితంగా భారత్‌ సూచీలు బుధవారం గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌  194 పాయింట్ల లాభంతో 38,750  పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 62 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,562 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది.  ఆసియా మార్కెట్లు పాజిటివ్‌ ట్రేడ్‌వార్‌ కారణంగా ఆర్థికాభివృద్ధి మందగిస్తున్నదని, ఇందుకు అవసరమైన చర్యల్ని తీసుకుంటామంటూ  జెరోమ్‌ పొవెల్‌ వడ్డీ

Most from this category