News


మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 18th June 2019
Markets_main1560833133.png-26363

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:-
ఎన్‌సీడీలపై చెల్లించిన రూ.56.8 కోట్ల రుణాన్ని చెల్లించినట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది.
రెప్కో ఇండియా:- తన అనుబంధ సంస్థ రెప్కో ఇన్నోవేషన్‌ డిజి ప్రింట్‌ లిమిటెడ్‌ విభజనకు డ్రాఫ్ట్‌ స్కీంకు బోర్డు ఆమోదం తెలిపింది.
బినాని ఇండస్ట్రీస్‌:- కంపెనీ స్వతం‍త్ర డైరెక్టర్‌ పదవికి రతన్‌ కుమార్‌ సరవాగీ రాజీనామా చేశారు.
కాక్స్‌ అండ్‌ కింగ్స్‌:- కంపెనీ ఇటీవల జారీ చేసిన రూ.375 కోట్ల కమర్షియల్‌ పేపర్లకు కేర్‌ రేటింగ్‌ సంస్థ ఎ1(+) రేటింగ్‌ను కేటాయించింది. అయితే నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల ఇష్యూకు ఎఎ(స్థిరత్వం) నుంచి ఎఎ(-)స్థిరత్వంకు రేటింగ్ డౌన్‌గ్రేడ్‌ చేసింది.
మెక్‌లాయిడ్‌ రస్సెల్‌:- ఇక్రా రేటింగ్‌ సంస్థ కంపెనీ రుణ రేటింగ్‌ను బిబిబి(-) నుంచి బి(-)కు కోత విధించింది. కంపెనీ అవుట్‌లుక్‌ కు సైతం నెగిటివ్‌ రేటింగ్‌ను కేటాయించింది.
బయోకాన్‌:- కంపెనీ బ్రాండెడ్‌ ఫార్మూలేషన్‌ ఇండియా వ్యాపారాన్ని తన అనుబంధ సంస్థ బయోకాన్‌ బయోలాజిక్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీకి రూ.45 కోట్లకు విక్రయించింది.
ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌:- టైర్‌-II బాండ్ల జారీ ద్వారా నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- మహారాష్ట్రలోని పాతళగంగ ప్లాంట్‌లోని ఆల్కైల్-బెంజీన్ యూనిట్‌లో అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. 
సంధర్‌ టెక్నాలజీస్‌:- వ్యాపార అవసరాల నిమిత్తం విన్నర్‌ కామ్‌ కో.తో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు సిద్ధమైంది.
బజాజ్‌ హోల్డింగ్స్‌:- మహారాష్ట్ర స్కూటర్‌ కంపెనీ మరో 27శాతం వాటాను కొనుగోలు చేసింది. తద్వారా కంపెనీ మొత్తం 51శాతానికి చేరుకుంది. 
టెక్‌ మహీంద్రా:- కెనడాకు చెందిన ఆబ్జెక్ట్‌వైజ్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ను 2.75మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసింది. 
జెట్‌ ఎయిర్‌వేస్‌:- బిడ్డింగ్‌లో మిగిలిన ఏకైక సంస్థకు జెట్‌ ఎయిర్‌వేస్‌కు విక్రయించే ఇష్టం లేక రుణదాతలు కంపెనీపై దివాళా స్మృతి చర్యలకే నిర్ణయం తీసుకున్నారు. 
సంతోష్‌ ఫైన్‌ ఫ్యాబ్‌:- కంపెనీ ఛీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా సునీల్‌ ఆర్‌. తులసీయాన్‌ నియమితులయ్యారు.You may be interested

రెండో రోజు తగ్గిన ఆయిల్‌ ధరలు

Tuesday 18th June 2019

వరుసగా రెండో రోజు కూడా చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.3శాతం నష్టపోయి బ్యారెల్‌ 60.78డాలర్ల వద్ద, డబ్యుడీఐ క్రూడ్‌ 0.2శాతం నష్టపోయి బ్యారెల్‌ 51.92 డాలర్ల వద్ద  మంగళవారం ట్రేడవుతున్నాయి. యూఎస్‌ -చైనా ట్రేడ్‌వార్‌ భయాలు, గత వారం ఆయిల్‌ ట్యాంకర్లపై జరిగిన దాడి కారణంగా మిడిల్‌ ఈస్ట్‌ దేశాలలో చెలరేగిన ఒత్తిడి వలన చమురు ధరలు తగ్గాయి. గత సెషన్‌లో  బ్రెంట్‌ క్రూడ్‌ 1.7 శాతం,

69.83 వద్ద ప్రారంభమైన రూపీ

Tuesday 18th June 2019

డాలర్‌ మారకంలో రూపీ మంగళవారం ట్రేడింగ్‌లో 69.83 వద్ద ప్రారంభమైం‍ది. దేశియ మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తడం, ట్రేడ్‌ వార్‌ భయాలు కారణంగా గత సెషన్‌లో 11 పైసాలు కోల్పోయి 69.91 వద్ద ముగిసింది. ఫెడరల్‌ బ్యాం‍క్‌ పాలసీ ప్రకటన ఈ వారంలో వెలువడనున్న  నేపథ్యంలో రూపీ ఒత్తిడికి గురికావచ్చు. సెంట్రల్‌ బ్యాంక్‌ పాలసీ వెలువడే ముందు రూపీ తక్కువ రేంజ్‌లో ఏకీకృతం అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు ఫెడరల్‌

Most from this category