News


నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 11th March 2020
Markets_main1583900869.png-32401

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

అదానీ పోర్ట్స్‌: అప్పుల్లో కూరుకుపోయిన డిగ్గీ పోర్ట్‌ కొనుగోలుకు అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ రూ.650 కోట్ల ప్లాన్‌ను ప్రతిపాదించగా ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది. 

ఇన్ఫోసిస్‌: అమెరికాకు చెందిన స్టార్టప్‌ కంపెనీ వాటర్‌ లైన్‌ డేటా సైన్స్‌లో పెట్టిన 4.5 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వదులుకున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. కాగా ఈ మొత్తాన్ని 2016,2018 సంవత్సరాలలో రెండు దశల్లో ఇన్ఫోసిస్‌లో పెట్టుబడులు పెట్టింది.

రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌: రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌ ఫిబ్రవరిలో రూ.40.08 కోట్ల లోన్‌ మొత్తాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనట్లు రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారంలో తెలిపింది.

జెట్‌ ఎయిర్‌వేస్‌: జెట్‌ ఎయిర్‌వేస్‌ దివాలా ప్రక్రియకు బిడ్లు సమర్పించడానికి సవరించిన గడువు మంగళవారం ముగియడంతో కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌ సమావేశం మార్చి 12న జరగనుంది.

వేదాంత: ఇండియా రేటింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ వేదాంత లిమిటెడ్‌ అవుట్‌లుక్‌ రేటింగ్‌ను స్టేబుల్‌ నుంచి నేగిటివ్‌గా మార్చినట్లు వెల్లడించింది.

ఓఎన్‌జీసీ: ఆయిల్‌ ధరలు తగ్గినప్పటికి తమ పెట్టుబడుల ప్రణాళికలను ఉపసంహరించుకోమని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శశి శంకర్‌ వెల్లడించారు.

యూనియన్‌ బ్యాంక్‌: మార్చి 11నుంచి అమల్లోకి వచ్చే ఎంసీఎల్‌ఆర్‌లో 10 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్లు యూనియన్‌ బ్యాంక్‌ ప్రకటించింది.



You may be interested

ఆటో రంగానికి బీఎస్‌-4 గుదిబండ

Wednesday 11th March 2020

కరోనా వైరస్‌ కారణంగా తగ్గిన వాహన విక్రయాలు మార్చి 31తో ముగియనున్న పాతవాటి రిజిస్ట్రేషన్లు ఈలోపే అమ్మకాలు పూర్తి చేయలేమంటున్న కంపెనీలు ఆటో రంగానికి మరో కొత్త కష్టం న్యూఢిల్లీ: వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడం కోసం భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలను ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలుచేయాలని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు రిజిస్ట్రేషన్లకు సంబంధించి తాజా ఉత్తర్వులను జారీ

నష్టాలతో మొదలై క్షణాల్లోకి లాభాల్లో...!

Wednesday 11th March 2020

హోలీ సెలవురోజు అనంతరం బుధవారం ప్రారంభమైన దేశీయ మార్కెట్‌ మొదట నష్టాల్లో ప్రారంభమైన క్షణాల్లో లాభాల్లోకి మళ్లింది. సెన్సెక్స్‌ 151 పాయింట్ల నష్టంతో 35,483 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు నష్టంతో 10,393 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  అయితే అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లలో రికవరి, ముడిచమురు ధర బౌన్స్‌బ్యాక్‌ కావడంతో పాటు సోమవారం మార్కెట్‌ భారీ పతనం నేపథ్యంలో జరిగిన షార్ట్‌ కవరింగ్‌, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ

Most from this category