News


సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 26th August 2019
Markets_main1566791380.png-28000

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
ఎన్‌సీఎల్‌ ఇండస్ట్రీస్‌:-
చైనా దిగ్గజ కంపెనీ కింగ్డావో జింగువాంగ్జెంగ్ కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు ఒప్పంద పత్రంపై సంతకం చేసింది. 
లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌:- ఈక్విటీ, రుణ పద్దతిలో నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. 
అదానీ పోర్ట్స్‌:- అర్హత కలిగిన ఇన్వెస్టర్ల నుంచి షేర్ల తిరిగి కొనుగోలు చేసేందుకు(బై బ్యాక్‌) బోర్డు ఆమోదం తెలిపింది. బై బ్యాక్‌ ఇష్యూ సెప్టెంబర్‌6న ప్రారంభమై అదే నెల20న ముగియనుంది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- ఎన్‌సీడీలపై వడ్డీని చెల్లించింది.
పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్‌:- ప్రైవేట్‌ ప్లేస్‌పద్ధతిలో సెక్యూర్డ్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.500 కోట్లను సమీకరించేందుకు కంపెనీ అడ్మినిస్ట్రేటివ్‌ కమిటి ఆగస్ట్‌ 28న ప్రారంభం‍ కానుంది.
ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- ఎన్‌డీసీలపై వడ్డీ చెల్లింపులను సకాలంలో చెల్లించించింది. 
ఆల్కేమ్‌ ల్యాబ్స్‌:- యూస్‌ఎఫ్‌డీఏ సెయింట్‌ లూయీస్‌ యూనిట్‌కు 4 అబ్జర్వేషన్లు కలిగిన 483 ఫామ్‌ను, బద్దీ యూనిట్‌కు జీర్‌ అబ్జర్వేషన్‌ కలిగిన ఫామ్‌ను జారీ చేసింది.
దివీస్‌ ల్యాబ్స్‌:- కంపనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా మురళి కే.దివిగా తిరిగి నియమితులయ్యారు.
డైనమిక్స్‌ టెక్నాలజీస్‌:- ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థ అవుట్‌లుక్‌ను పాజిటివ్‌ నుంచి స్థిరత్వంకు పెంచింది. అయితే, దీర్ఘకాలిక ఇష్యూయర్‌ రేటింగ్‌ను ఇండియా బిబిబి(+)గా సవరించింది. 
ఇప్కా ల్యాబ్స్‌:- పిపరియా ఫార్మూలేషన్ తయారీ యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ 3 అబ్జర్వేషన్లు కలిగిన 483 ఫామ్‌ను జారీ చేసింది. 
గెయిల్‌ ఇండియా:- మధువన్‌ విహార్‌, కుకారి యూనిట్‌లో సీఎన్జీ స్టేషన్లు ప్రారంభించింది. పిపరియా ఫార్మూలేషన్ తయారీ యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ 3 అబ్జర్వేషన్లు కలిగిన 483 ఫామ్‌ను జారీ చేసింది
జెట్‌ ఎయిర్‌వేస్‌:- నేడు కమిటి ఆఫ్‌ క్రెడిటర్స్‌ సమావేశం జరగునుంది.
బంధన్‌ బ్యాంక్‌:- స్టాండర్‌ ఛార్జెడ్‌ బ్యాంక్‌ భాగస్వామ్యంలో క్రిడెట్‌ కార్డులను ఆవిష్కరించింది.
ఇన్సిల్కో:- అధిక నిల్వలు ఉండటంతో ఫ్లాంట్‌ను ఆగస్ట్‌ 23నుంచి సెప్టెంబర్‌ 3 వరకు మూసివేస్తున్నట్లు కంపెనీ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది.
బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర:- రిటైల్ రుణాలను రెపో రేటుతో అనుసంధానించింది.
గ్లెన్‌మార్క్‌:- యూఎస్‌ మార్కెట్‌ను కొన్ని ఔషధ ఉత్పత్తులను రీకాల్‌ చేసింది.You may be interested

భారీ గ్యాప్‌అప్‌...సెన్సెక్స్‌ 660 పాయింట్లు, నిఫ్టీ 170 పాయింట్లు జంప్‌

Monday 26th August 2019

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఫలితంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు భారీ గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 663 పాయింట్ల లాభంతో 37,364 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 171 పాయింట్ల లాభంతో 11,000 పాయింట్ల వద్ద ఆరంభమయ్యాయి.

మార్కెట్లు ముందుకే...: నిపుణుల అంచనాలు

Sunday 25th August 2019

అంతర్జాతీయ సంకేతాలు ఎలా ఉన్నా కానీ, మన స్టాక్‌ మార్కెట్లలో ర్యాలీ ఖాయమంటున్నారు పలువురు నిపుణులు. గత శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ఆర్థిక ఉద్దీపనలు, ప్రోత్సాహక చర్యలు మార్కెట్ల ర్యాలీని నడిపిస్తాయంటున్నారు. విశ్లేషకులు, నిపుణుల అభిప్రాయాలు, అంచనాలను పరిశీలిస్తే...   ఎఫ్‌పీఐలపై పెంచిన సర్‌చార్జీని ఉపసంహరించుకోవడం మార్కెట్లకు చాలా సానుకూలం. బడ్జెట్‌ నాటి నుంచి తరలి వెళ్లిపోతున్న విదేశీ పెట్టుబడులను ఇది వెనక్కి రప్పిస్తుంది. రూపాయి బలపడేందుకూ కారణమవుతుంది.

Most from this category