News


నేటి వార్తల్లోని షేర్లు

Friday 31st January 2020
Markets_main1580448461.png-31366


వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

హెచ్‌ఏఎల్‌: ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో 15 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఖజానాకు రూ.4,000 కోట్లను సమకూర్చవచ్చని కేం‍ద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

భారతీ ఇన్‌ఫ్రాటెల్‌: ఈ కంపెనీ డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో  కన్సాలిడేటెడ్‌ నికర లాభం 23 శాతం పెరిగి రూ.798.7 కోట్లకు చేరింది.

యస్‌బ్యాంక్‌, సికాల్‌ లాజిస్టిక్స్‌: సికాల్‌ లాజిస్టిక్స్‌లోని 2.68 శాతం వాటా కలిగిన 15 లక్షల షేర్లను దశలవారిగా విక్రయించనున్నట్లు యస్‌బ్యాంక్‌ ప్రకటించింది.

పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌: భారత మోర్టగేజ్‌ సెక్టార్‌లో భాగస్వామి అయ్యేందుకు ఐఎఫ్‌సీ, దక్షిణ కోరియాకు చెందిన కేబీ ఫైనాన్షియల్‌ గ్రూప్‌ పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో చిన్నమొత్తంలో వాటాను కొనుగోలు చేయనుంది.

టీటీకే ప్రెస్టేజ్‌: డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 3.34 శాతం పెరిగి రూ.60.20 కోట్లకు చేరిందని టీటీకే ప్రెస్టేజ్‌ ప్రకటించింది. కాగా గతేడాది ఈ త్రైమాసికంలో నికర లాభం రూ.58.25 కోట్లుగా ఉంది.

ఎంసీఎక్స్‌: క్యూ3లో 32 శాతం పెరిగి నికర లాభం రూ.56 కోట్లకు చేరిందని మల్టీ కమోడిటీ ఎక్సెంజ్‌ గురువారం వెల్లడించింది. కాగా గతేడాది ఈ త్రైమాసికంలో నికర లాభం రూ.42 కోట్లుగా ఉంది.

జేకే టైర్‌: ఈ కంపెనీ క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.62 శాతం తగ్గి రూ.10.27 కోట్లకు చేరింది.గతేడాది ఈ త్రైమాసికంలో నికర లాభంరూ.27 కోట్లుగా ఉంది.

ఎల్‌ఐసీ హౌసింగ్‌: మొండి బకాయిల వల్ల ఈ కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం నామమాత్రంగా తగ్గి రూ.607.29 నుంచి రూ.602.25కు చేరింది.



You may be interested

కొటక్‌ మహీంద్రా, యాంబర్‌.. జోరు

Friday 31st January 2020

52 వారాల గరిష్టాన్ని తాకిన యాంబర్‌ 4 శాతం జంప్‌చేసిన కొటక్‌ మహీంద్రా కొద్ది సమయంలో ఆర్థిక సర్వే వెలువడనున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్నాయి. ఉదయం 10.50 ప్రాంతంలో సెన్సెక్స్‌ 2 పాయింట్ల నామమాత్ర లాభంతో 40,915కు చేరగా.. నిఫ్టీ 11 పాయింట్లు తక్కువగా 12,025 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రయివేట్‌ రంగ సంస్థ కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, వైట్‌గూడ్స్‌ కాంట్రాక్ట్‌

లక్ష కోట్ల డాలర్ల క్లబ్‌లోకి అమెజాన్‌!

Friday 31st January 2020

గురువారం అద్భుత ఫలితాలు ప్రకటించడంతో ఆన్‌లైన్‌ ఈకామ్‌ దిగ్గజం అమెజాన్‌ షేరు ట్రేడింగ్‌ ఆఫ్టర్‌ అవర్స్‌లో దాదాపు 10 శాతం లాభంతో కదలాడుతోంది. దీంతో శుక్రవారం ఆరంభంలో షేరు 2050 డాలర్ల పైన ఆరంభమయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఈలెక్కన కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ లక్ష కోట్ల డాలర్లను చేరనుంది. గురువారం క్లోజింగ్‌ రేటు ప్రకారం కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ సుమారు 93000 కోట్ల డాలర్లుంది. కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ సాధిస్తే

Most from this category