News


నేటి వార్తల్లోని షేర్లు

Monday 24th February 2020
Markets_main1582521683.png-32035

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు

రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌: ఈ కంపెనీ కమిటీ ఆఫ్‌ క్రెడిటార్స్‌ సమావేశం సోమవారం జరగనుంది.

యస్‌ బ్యాంక్‌: హిందుజా గ్రూపు సెర్బ్రస్‌ క్యాపిటల్‌ మేనేజ్‌ మెంట్‌తో కలిసి యస్‌ బ్యాంక్‌లో వాటా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. 

బయోకాన్‌: ఈ కంపెనీ యూఎస్‌డీఎఫ్‌ఏ నుంచి మూడు పరిశీలనలను అందుకున్నట్లు వెల్లడించింది. మలేసియాలోని ఇన్సులిన్‌ తయారీ కేంద్రంలో అమెరికా హెల్త్‌ రెగ్యులేటరీ సంస్థ ఫిబ్రవరి 10-21 వరకు తనిఖిలు నిర్వహించి సూచనలు చేసింది. 

యూపీఎల్‌: బాండ్ల ఇష్యూ ద్వారా మారిషస్‌ సబ్సిడిరీ రూ.2,840 కోట్లు సమీకరించింది. ఈ మొత్తాన్ని రుణాల చెల్లింపుకు వినియోగిస్తామని యూపీఎల్‌ వెల్లడించింది.

భారతీ ఇన్‌ఫ్రాటెల్‌: ఇండస్‌ టవర్స్‌ను భారతీ ఇన్‌ఫ్రాటెల్‌లో విలీనం చేసేందుకు టెలికం విభాగం అనుమతివ్వడంతో... భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు  భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ బోర్డు ఫిబ్రవరి 24న సమావేశంకానుంది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌: ఆర్థిక సంవత్సంరం  2013-2018 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 50 వేగంగా వృద్ధి చెందిన రిటైలర్స్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మొదటి స్థానంలో ఉందని డెలాయిట్‌ గ్లోబల్‌ పవర్స్‌ ఆఫ్‌ రేటింగ్‌ ఇండెక్స్‌-2020 వెల్లడించింది.


 



You may be interested

కరిగిపోతున్న మెటల్‌ షేర్లు..!

Monday 24th February 2020

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం మెటల్‌ షేర్లు భారీగా కరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌ వ్యాధి తీవ్రతరం కావడంతో పాటు ప్రపంచదేశాలకు అత్యధికంగా లోహాలను ఎగుమతి చేసే చైనాలో కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తితో ఉత్పత్తి ఆగిపోవడంతో వృద్ధి భయాలు తలెత్తాయి. ఫలితంగా ప్రపంచమార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ తగ్గింది. అంతర్జాతీయ ట్రెండ్‌కు తగ్గట్లుగానే దేశీయంగా మెటల్‌ షేర్లకు డిమాండ్‌ కరువైంది. ఫలితంగా నేడు ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే

రూపాయికీ కరోనా దెబ్బ!

Monday 24th February 2020

ప్రారంభంలోనే 24 పైసలు డౌన్‌ 72 సమీపానికి చేరిన రూపాయి ప్రపంచవ్యాప్తంగా కోరలు చాస్తున్న కరోనా వైరస్‌ కారణంగా దేశీ కరెన్సీకి దెబ్బ తగిలింది. దీంతో డాలరుతో మారకంలో రూపాయి నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలోనే  25 పైసలు క్షీణించింది. ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో 71.89 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. తదుపరి 71.90 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం కాస్త కోలుకుంది. 18 పైసలు బలహీనపడి 71.82 వద్ద ట్రేడవుతోంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా

Most from this category