News


నేటి వార్తల్లోని షేర్లు

Thursday 23rd January 2020
Markets_main1579754176.png-31126

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్లు

కర్ణాటక బ్యాంక్‌: మూలధన సమీకరణ ప్రతిపాదనలను కర్ణాటక బ్యాంక్‌ బోర్డు జనవరి 27న పరిశీలించనుంది.

రేమండ్‌: క్యూ3 నికర లాభం పెరిగి రూ.43 కోట్లనుంచి రూ.197 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన గతేడాది క్యూ3లో ఉన్న నికర ఆదాయం రూ.1,675 కోట్లనుంచి 12.5 శాతం పెరిగి రూ.1,885 కోట్లకు చేరింది.

సియట్‌: సియట్‌ క్యూ3 నికర లాభం దాదాపు యదాతధంగా రూ.53 కోట్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన నికర ఆదాయం 1.9 శాతం పెరుగుదలతో రూ.1,762 కోట్లకు చేరింది.

టాటా కమ్యూనికేషన్స్‌: ఈ కంపెనీ క్యూ3 నికర లాభం 8.6 శాతం పెరిగి రూ.58.5 కోట్లుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన నికర ఆదాయం 1 శాతం తగ్గి రూ.4,229 కోట్లకు చేరింది.

సిప్లా: గోవాలోని సిప్లా తయారీ ప్లాంట్‌లో అభ్యంతరాలు ఉన్నట్లు యూఎస్‌ఎఫ్‌డీఏ గుర్తించిందని సిప్లా వెల్లడించింది. 

ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌ పొర్టేషన్‌: రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖ ఇచ్చే సెటిల్‌మెంట్‌ రూ.144 కోట్లను ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ట్రాన్స్‌ పొర్టేషన్‌  పొందింది.

బయోకాన్‌: డయాబెటీస్‌ మందు డప్లాగ్లిఫ్లోజిన్‌ను యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదించినట్లు బయోకాన్‌ వెల్లడించింది.

ఐటీఐ: ఎఫ్‌పీఓ షేర్‌ ధరను రూ.72-77 గా ఐటీఐ నిర్ణయించింది.



You may be interested

యాక్సిస్‌ బ్యాంకుపై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయి?!

Thursday 23rd January 2020

 యాక్సిస్‌ బ్యాంకు ఫలితాల నేపథ్యంలో బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి.. 1. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 830. అధిక ప్రొవిజన్స్‌, స్లిపేజ్‌ల కారణంగా ఆర్థిక సంవత్సరం ఎర్నింగ్స్‌ను తగ్గించింది. బ్యాంకింగ్‌ రంగంలో ఇతర బ్యాంకులకు మంచి పోటీ ఇస్తుందని అంచనా వేసింది.  2. కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌: రెడ్యూస్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 740. ఆదాయాలు మిశ్రమంగా ఉన్నాయి. ఎన్‌ఐఐ బాగున్నా, ఆదాయ వృద్ధి తగ్గడం,

చమురుకు వైరస్‌ ఫీవర్‌!

Thursday 23rd January 2020

2 శాతం క్షీణించిన చమురు ధరలు 7 వారాల కనిష్టానికి బ్రెంట్‌ చమురు చైనాలో తలెత్తిన కరోనా వైరస్‌ దెబ్బకు ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. వెరసి బుధవారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 1.38 డాలర్లు(2.1 శాతం) క్షీణించి 63.21 డాలర్లను తాకింది. ఇక న్యూయార్క్‌ మార్కెట్లోనూ నైమెక్స్‌ బ్యారల్‌ 2.8 శాతం పతనమై 56.74 డాలర్లకు చేరింది.  నేలచూపుతోనే గత రాత్రి అమెరికా ట్రేడింగ్‌ ముగింపుతో పోలిస్తే ప్రస్తుతం ఆసియా ట్రేడింగ్‌లో బ్రెంట్‌ బ్యారల్‌

Most from this category