News


మంగళవారం యాక్టివ్‌ స్టాక్స్

Tuesday 24th December 2019
Markets_main1577159841.png-30397

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ట్రేడింగ్‌లో ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు చూద్దాం..

సొలారా యాక్టివ్‌ ఫార్మా: స్ర్టైడ్స్‌ కెమికల్స్‌ కంపెనీతో విలీన ప్రతిపాదనకు జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఆమోదముద్ర వేసినట్లు సొలారా యాక్టివ్‌ ఫార్మా తాజాగా పేర్కొంది.

చాలెట్‌ హోటల్స్‌: హయత్‌ ఇండియా కన్సల్టెన్సీతో ఫ్రాంచైజీ, తదితర పలు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు చాలెట్‌ హోటల్స్‌ తెలియజేసింది.

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌: దాదాపు 3 కోట్ల క్యుములేటివ్‌ రీడీమబుల్‌ ప్రిఫరెన్స్‌ షేర్ల(సీపీఆర్‌ఎస్‌) జారీకి అనుమతి లభించినట్లు ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ తెలియజేసింది. తద్వారా రూ. 300 కోట్లను సమీకరించనున్నట్లు వెల్లడించింది.

హిందాల్కో: జార్ఖండ్‌లోని మూరీ రిఫైనరీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించినట్లు ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం హిందాల్కో తాజాగా వెల్లడించింది. ఇందుకు జార్ఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి అనుమతి పొందినట్లు తెలియజేసింది.

ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌: సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనకు బోర్డు ఆమోదించినట్లు ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ తెలియజేసింది. దీనిలో భాగంగా షేరుకి రూ. 1725 ధర మించకుండా 19.56 కోట్ల ఈక్విటీ షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు వివరించింది. ఇందుకు రూ. 337 కోట్లను వెచ్చించనుంది.

పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌: హోమ్‌విస్టా డెకార్‌ అండ్‌ ఫర్నీషింగ్స్‌ సంస్థలో రూ. 49 కోట్లు ఇన్వెస్ట్‌ చేసేందుకు అంగీకరించినట్లు పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది.



You may be interested

ఏపీ, తెలంగాణలో ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌

Tuesday 24th December 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- టెలికం రంగ సంస్థ ఎయిర్‌టెల్‌ వాయిస్‌ ఓవర్‌ వైఫై సర్వీస్‌ ‘ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌’ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌కు విస్తరించింది. అలాగే ముంబై, కోల్‌కత, కర్నాటక, తమిళనాడులోనూ ఈ సేవలను పరిచయం చేసింది. వైఫై ఆధారంగా ఏదేని నెట్‌వర్క్‌కు టెల్కో గ్రేడ్‌ కాల్స్‌ చేసుకునే వీలుండడం దీని ప్రత్యేకత. వినియోగదార్ల నుంచి అదనంగా ఎటువంటి చార్జీ వసూలు చేయబోమని కంపెనీ ప్రకటించింది. ఇల్లు, కార్యాలయంలో మొబైల్‌

రూ.899లకే విమాన టికెట్‌

Tuesday 24th December 2019

భారీ డిస్కౌంట్లను ప్రకటించిన ఇండిగో న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్‌ గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో).. రూ. 899కే దేశీ రూట్లలో టికెట్ అందిస్తోంది. ‘ది బిగ్‌ ఫ్యాట్‌ ఇండిగో సేల్‌’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్‌.. డిసెంబర్‌ 23 (సోమవారం) ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్‌ ఈ నెల 26న రాత్రి 11 గంటల

Most from this category