News


మంగళవారం వార్తల్లోని కంపెనీలు

Tuesday 14th January 2020
Markets_main1578973915.png-30907

నేడు(14న) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారం‍భమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11 పాయింట్ల స్వల్ప లాభంతో 12,373 వద్ద ట్రేడవుతోంది. అయితే టెక్నాలజీ దిగ్గజాలు యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌సహా ఫేస్‌బుక్‌, నెట్‌ప్లిక్స్‌, అమెజాన్‌ బలపడటంతో సోమవారం యూఎస్‌ స్టాక్‌ ఇండెక్సులు సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. దేశీయంగానూ సెన్సెక్స్‌, నిఫ్టీ ఇంట్రాడేతోపాటు ముగింపులోనూ సరికొత్త గరిష్టాలను సాధించాయి. ఈ  నేపథ్యంలో నేడు ట్రేడర్లు కొంతమేర లాభాల స్వీకరణకు దిగే వీలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో మార్కెట్లు కన్సాలిడేట్‌ కావచ్చని అభిప్రాయపడ్డారు. కాగా.. విభిన్న వార్తల ఆధారంగా కొన్ని కౌంటర్లు నేడు యాక్టివ్‌గా ట్రేడయ్యే అవకాశముంది. ఈ జాబితా చూద్దాం..

రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌
సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ ఆశిష్‌ కచోలియా బల్క్‌డీల్‌ ద్వారా రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన 40 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు ఎన్‌ఎస్‌ఈ డేటా వెల్లడించింది. ఇందుకు కచోలియా దాదాపు రూ. 18 కోట్లను వెచ్చించినట్లు తెలుస్తోంది. దీంతో నేడు ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌పై దృష్టిపెట్టే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

డెల్టా కార్ప్‌ లిమిటెడ్‌
కాసినోల నిర్వాహక కంపెనీ డెల్టా కార్ప్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో డెల్టా కార్ప్‌ నికర లాభం 9 శాతం పుంజుకుని రూ. 55 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం యథాతథంగా రూ. 205 కోట్లుగా నమోదైంది. మార్జిన్లు 3 శాతం నీరసించినట్లు తెలుస్తోంది.

ఐఆర్‌సీటీసీ
అహ్మదాబాద్‌- ముంబై సెంట్రల్‌ మధ్య తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ నిర్వహణకుగాను రైల్వే శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఐఆర్‌సీటీసీ తాజాగా పేర్కొంది. దీంతో నేడు ఈ కౌంటర్‌ యాక్టివ్‌గా ట్రేడయ్యే అవకాశమున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇండాగ్‌ రబ్బర్‌
కంపెనీకి చెందిన ఎల్‌వోసీకి సంబంధించిన దీర్ఘకాలిక రేటింగ్‌ను A గ్రేడ్‌గా  ఇక్రా పునరుద్ఘాటించింది. ఇదే విధంగా స్వల్పకాలిక రేటింగ్‌ను సైతం స్థిర(స్టేబుల్‌) ఔట్‌లుక్‌తో A1గా పేర్కొంది. 

సిండికేట్‌ బ్యాంక్‌
రుణ వడ్డీ రేట్లకు కీలకంగా నిలిచే ఎంసీఎల్‌ఆర్‌(మార్జినల్‌ క్యాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్‌డ్‌ లెండింగ్‌ రేట్‌)ను తాజాగా 7.5-8.25 శాతానికి సవరిస్తున్నట్లు పీఎస్‌యూ సంస్థ సిండికేట్‌ బ్యాంక్‌ పేర్కొంది.You may be interested

టాటా ఎలెక్సీకి అత్యధిక త్రైమాసిక ఆదాయం

Tuesday 14th January 2020

4 శాతం వృద్ధితో రూ.407 కోట్లు  14 శాతం పెరిగిన నికర లాభం  న్యూఢిల్లీ: టాటా ఎలెక్సీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2019-20)మూడో త్రైమాసిక కాలంలో 14 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.66 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.75  కోట్లకు పెరిగిందని టాటా ఎలెక్సీ కంపెనీ తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.407 కోట్ల నుంచి 4 శాతం వృద్ధితో రూ.423 కోట్లకు

ఫ్లాట్‌ ప్రారంభం

Tuesday 14th January 2020

క్రితం రోజు కొత్త రికార్డుల్ని నెలకొల్పిన స్టాక్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 20 పాయింట్ల స్వల్ప పెరుగుదలతో 41,820 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 3 పాయింట్ల స్వల్ప తగ్గుదలతో 12,320 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. 

Most from this category