News


శుక్రవారం వార్తల్లో షేర్లు

Friday 17th January 2020
Markets_main1579245086.png-30990

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు 
భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా:-
టెలికం సంస్థలు దాఖలు చేసిన ఏజీఆర్‌ సమీక్షా పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. 
యస్‌ బ్యాంక్‌:-  యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను మూడీస్‌ సమీక్షలో ఉంచింది.
సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌:- మూడో త్రైమాసిక నికరలాభం 8 శాతం పెరిగి రూ.90.5 కోట్లకు చేరింది. ఎన్‌ఐఐ 15.6 శాతం పెరిగి రూ.601.8  
కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయి(ఎన్‌పీఏ)లు 4 బేసిస్‌పాయింట్లు పెరిగాయి. రూ.500 కోట్ల నిధులను బాండ్ల ద్వారా సమీకరించడానికి బోర్డు ఆమోదం తెలిపింది.
మెట్రోపొలీస్‌ హెల్త్‌కేర్‌:- గుజరాత్‌లోని శ్రద్దా డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో 51 శాతం వాటాను రూ.9.36 కోట్లకు కొనుగోలు చేసింది.
హాత్‌వే కేబుల్‌:- గత త్రైమాసికంలో రూ.55.8 కోట్ల నష్టంలో ఉన్న హాత్‌వే కేబుల్‌ ఈ మూడో త్రైమాసిక ఫలితంలో రూ.68.2 కోట్ల లాభాన్ని ఆర్జించింది. వార్షిక ఆదాయం 12.3 శాతం పెరిగి రూ. 450 కోట్లకు చేరింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌:- బొగ్గు సరఫరా ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఇద్దరు మాజీ ఎన్‌సీసీఎఫ్‌ అధికారులపైన, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది.
విప్రో:- అభివృద్ది చెందుతున్న డిజిటల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సాప్ట్‌వేర్‌ లీడర్స్‌తో కలిసి పెట్టుబడులు పెట్టడానికి విప్రో వెంచర్స్‌ 150 మిలియన్‌ డాలర్ల ఫండ్‌-2ను ప్రకటించింది.
జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌:- జీఎంఆర్‌ గోవా అంతర్జాతీయ విమానాశ్రయం పర్యావరణ క్లియరెన్స్‌ సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు ఎత్తివేసింది.
టాటా మెటాలిక్స్‌:- రెండో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 5 శాతానికి పడిపోయింది. కానీ నికర లాభం మాత్రం 15.9 శాతానికి పెరిగింది.
ర్యాలీస్‌ ఇండియా:- రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం దాదాపు 3 శాతం పెరిగి, ఆదాయం 27.8 శాతం పెరిగింది. 
యూనిటెక్‌:- కంపెనీ ప్రమోటర్ల నుంచి రూ.1600 కోట్లను స్వాధీనం తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలలో ఎటువంటి వాస్తవం లేదని, తమకు ఈడీ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదని యూనిటెక్‌ స్పష్టం చేసింది.
డిష్‌మాన్‌ కార్బొజెన్‌:- ఈ కంపెనీ బోర్డు రూ.72 కోట్ల  బైబ్యాక్‌కు అనుమతినిచ్చింది.
మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌:- బోనస్‌ షేర్ల జారీ ప్రతిపాదనను జనవరి 27న మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌  పరిశీలించనుంది.
సీజీ పవర్‌:- నిధుల కొరతతో బెల్జియంలోని సీజీపవర్‌ అనుబంధ సంస్థల వ్యాపారాలు తీవ్రంగా ప్రభావితమవ్వడంతో కొన్ని బ్యాంకు ఖాతాలు కూడా బ్లాక్‌ అయ్యాయి.
యుకో బ్యాంక్‌:- మూలధన నిధుల సమీకరణలో భాగంగా కేంద్రానికి ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన ఈక్విటీ షేర్లను జారీ రూ.2,142 కోట్ల సేకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. You may be interested

బ్యాంకులకు ఏజీఆర్‌ భయాలు?!

Friday 17th January 2020

సవరించిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) బకాయిలపై టెలికం కంపెనీలు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగంవైపు దృష్టిసారిస్తున్నారు. యూబీఎస్‌ గ్రూప్‌ వివరాల ప్రకారం మొబైల్‌ టెలికం కంపెనీలు ప్రభుత్వానికి 13 బిలియన్‌ డాలర్ల బకాయిలను చెల్లించవలసిఉంది. ఈ కారణంగా వైర్‌లెస్‌ టెలికం కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకులపై ఈ ప్రభావం కనిపించే అవకాశముంది. ఏజీఆర్‌ చెల్లింపులు టెలికం కంపెనీల క్యాష్‌ ఫ్లోలను దెబ్బతీసే వీలున్నట్లు పరిశ్రమవర్గాలు

మూడోరోజూ పెరిగిన పసిడి

Friday 17th January 2020

కలిసొచ్చిన రూపాయి బలహీనత  దేశీయ బులియన్‌ మార్కెట్లో బంగారం ధర వరుసగా మూడోరోజూ లాభపడింది. ఎంసీఎక్స్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ.39790 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 7పైసలు నష్టంతో బంగారానికి కలిసొచ్చింది. మిశ్రమ ఫండమెంటల్స్‌ కారణంగా స్వల్పకాలానికి బంగారం అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చని రూ.39600స్థాయి వద్ద కీలక మద్దతు ధరను, రూ.39,800 నిరోధస్థాయిని ఏర్పాటు చేసుకున్నట్లు

Most from this category