News


శుక్రవారం వార్తల్లోని స్టాక్స్‌

Friday 10th January 2020
Markets_main1578627959.png-30817

అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు ఉపశమించిన నేపథ్యంలో గురువారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. దేశీయంగా సెన్సెక్స్‌ 635 పాయింట్లు జంప్‌చేసి 41,452కు చేరగా.. నిఫ్టీ సైతం 191 పాయింట్లు ఎగసి 12,216 వద్ద ముగిసింది. ఇక యూఎస్‌ మార్కెట్లు 0.7 శాతం బలపడటం ద్వారా సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు ‍స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అయ్యే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. కాగా.. విభిన్న వార్తల ఆధారంగా నేడు(శుక్రవారం) యాక్టివ్‌గా నిలిచే అవకాశమున్న కంపెనీల వివరాలు చూద్దాం..

ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌
నేడు(10న) ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో క్వార్టర్‌ ఫలితాలు ప్రకటించనుంది. ఓవైపు క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) పనితీరు వెల్లడించనుండగా.. మరోపక్క షార్దుల్‌ అమర్‌చంద్‌ ఆడిట్‌ కమిటీ విజిల్‌బ్లోవర్‌ దర్యాప్తు నివేదికను అందజేయనున్నట్లు తెలుస్తోంది.

జీటీపీఎల్‌ హాథవే
కేబుల్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సేవల కంపెనీ జీటీపీఎల్‌ హాథవే ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో క్వార్టర్‌(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలు ప్రకటించింది.  క్యూ3లో నికర లాభం 98 శాతం జంప్‌చేసి రూ. 39 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం రెట్టింపునకు ఎగసి రూ. 674 కోట్లకు చేరింది.

ఇమామీ పేపర్‌మిల్స్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో క్వార్టర్‌(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలను ఇమామీ పేపర్‌మిల్స్‌ ప్రకటించింది.  క్యూ3లో నికర లాభం మూడు రెట్లు జంప్‌చేసి రూ. 18.5 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 7 శాతం పెరిగి రూ. 400 కోట్లకు చేరింది.

స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌
అనుబంధ సంస్థ ద్వారా ఇజ్రాయెల్‌ కంపెనీ ఏఎస్‌వోసీఎస్‌లో 12 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు బ్రాడ్‌బ్యాండ్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ సర్వీసుల కంపెనీ స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ పేర్కొంది. 

సద్భావ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 
బల్క్‌ డీల్‌ ద్వారా రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ (నిప్పన్‌ ఇండియా ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌) కంపెనీకి చెందిన కోటి షేర్లను కొనుగోలు చేసినట్లు సద్భావ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పేర్కొంది.



You may be interested

వచ్చే వారం భారత్‌కు అమెజాన్‌ బెజోస్‌

Friday 10th January 2020

 ప్రధాని మోదీతో భేటీకి అవకాశం న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ వచ్చే వారం భారత్‌ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రభుత్వాధికారులు, పలువురు వ్యాపార దిగ్గజాలతో ఆయన సమావేశమయ్యే అవకాశమున్నట్లు సంబంధితవర్గాలు తెలిపాయి. జనవరి 15-16న న్యూఢిల్లీలో జరిగే చిన్న, మధ్యతరహా సంస్థల సదస్సు ఎస్‌ఎంభావ్‌ కార్యక్రమంలో బెజోస్ పాల్గోనున్నారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలపై దేశీయంగా

‘నార్డిక్‌’ దిశగా మన ఐటీ నావ!

Friday 10th January 2020

హెచ్‌సీఎల్‌, ఇన్ఫోసిస్‌లకు ఇప్పటికే నార్డిక్‌ దేశాల్లో కార్యకలాపాలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్న టెక్‌ మహీంద్రా, విప్రో ఇంగ్లిష్‌ భాషా పరంగా అనుకూలత, నిపుణుల లభ్యత కలిసొస్తున్న ప్రభుత్వ విధానాలు, ఇతర సానుకూలతలు న్యూఢిల్లీ: మన దేశ ఐటీ కంపెనీల చూపు నార్డిక్‌ దేశాల వైపు మళ్లింది. నార్డిక్‌ దేశాలుగా పిలిచే ఫిన్లాండ్‌, స్వీడన్‌, నార్వే, డెన్మార్క్‌, ఐస్‌లాండ్‌ల్లో ప్రముఖ ఐటీ కంపెనీలు కార్యాలయాలను తెరిచేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. యూరోప్‌లో ఈ దేశాలు ప్రధానంగా ఇంగ్లిష్‌ భాషా

Most from this category