News


మంగళవారం వార్తల్లోని కంపెనీలు

Tuesday 7th January 2020
Markets_main1578369212.png-30722

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ తాజాగా ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. సోమవారం టెక్నాలజీ దిగ్గజాల అండతో అమెరికా స్టాక్‌ ఇండెక్సులు 0.25-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల వాతావరణం కనిపిస్తోంది. దీంతో దేశీయంగా నేడు(మంగళవారం) ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా దేశీ మార్కెట్లు గ్యాపప్‌తో ప్రారంభంకావచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు విభిన్న వార్తల కారణంగా కొన్ని కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడయ్యే అవకాశమున్నట్లు చెబుతున్నారు. ఆయా కౌంటర్ల వివరాలు చూద్దాం..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో అడ్వాన్సులు(రుణ మంజూరీ) 20 శాతం ఎగసి రూ. 9.34 లక్షల కోట్లను తాకినట్లు ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌  తెలియజేసింది. ఇదే కాలంలో డిపాజిట్లు సైతం 25 శాతం వృద్ధితో రూ. 10.67 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది. 

పీఐ ఇండస్ట్రీస్‌
గుజరాత్‌లోని జంబుసర్‌లోగల మల్టి ప్రొడక్ట్‌ ప్లాంట్ల యూనిట్‌కు చెందిన ఒక విభాగంలో ఫ్యాక్టరీ యాక్సిడెంట్‌ జరిగినట్లు పీఐ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. ఇక్కడ ఫైన్‌ కెమికల్స్‌ను కంపెనీ తయారు చేస్తోంది. దీంతో ఇద్దరు మరణించగా.. మరో తొమ్మిదిమంది గాయపడినట్లు బీఎస్‌ఈకి వెల్లడించింది.

వీఎస్‌టీ టిల్లర్స్‌
డిసెంబర్‌(2019)లో పవర్‌ టిల్లర్స్‌ అమ్మకాలు 4.3 శాతం పెరిగి 1410 యూనిట్లకు చేరినట్లు వీఎస్‌టీ టిల్లర్స్‌ ట్రాక్టర్స్‌ పేర్కొంది. ఇదే కాలంలో ట్రాక్టర్ల అమ్మకాలు మాత్రం 39 శాతంపైగా క్షీణించి 366 యూనిట్లకు పరిమితమైనట్లు తెలియజేసింది.

సాగర్‌ సిమెంట్స్‌
ఏకీకృత ప్రాతిపదికన డిసెంబర్‌(2019)లో సిమెంట్‌ ఉత్పత్తి 7.5 శాతం నీరసించి 3 లక్షల టన్నులకు పరిమితమైనట్లు సాగర్‌ సిమెంట్స్‌ పేర్కొంది. ఇదే కాలంలో సిమెంట్‌ అమ్మకాలు 4.3 శాతం తక్కువగా 3.12 లక్షల టన్నులను తాకినట్లు తెలియజేసింది.

ఐటీఐ లిమిటెడ్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం భారీగా పెరిగి రూ. 168 కోట్లను అధిగమించినట్లు టెలికం పీఎస్‌యూ ఐటీఐ లిమిటెడ్‌ తెలియజేసింది.

యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 9న సమావేశంకానున్నట్లు ఆరోగ్య పరిరక్షణ రంగ కంపెనీ యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ వెల్లడించింది.

ఎన్‌టీపీసీ లిమిటెడ్‌
అవంతా గ్రూప్‌నకు చెందిన 600 మెగావాట్ల ఝబువా పవర్‌ ప్లాంటు కొనుగోలుకి అత్యధిక బిడ్‌ను దాఖలు చేసినట్లు విద్యుత్‌ రంగ పీఎస్‌యూ ఎన్‌టీపీసీ తాజాగా పేర్కొంది. అదానీ గ్రూప్‌నకు చెందిన ఈ ప్లాంటు మధ్యప్రదేశ్‌లో ఏర్పాటుకాగా.. రూ. 1900 కోట్లకు బిడ్‌ దాఖలు చేసినట్లు తెలియజేసింది. ప్రత్యర్థి కంపెనీ దాఖలు చేసిన బిడ్‌కంటే ఈ విలువ రెట్టింపుకంటే అధికమని వివరించింది.You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ జోరు

Tuesday 7th January 2020

పీఎస్‌యూ, ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ స్టాక్స్‌కు డిమాండ్‌ ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల ప్రోత్సాహంతో మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఉదయం 9.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 500 పాయింట్లు జంప్‌చేసింది.  41,176కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 145 పాయింట్లు ఎగసి 12,137 వద్ద ట్రేడవుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ టెక్నాలజీ దిగ్గజాల అండతో సోమవారం అమెరికా స్టాక్‌ ఇండెక్సులు 0.25-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక ప్రస్తుతం ఆసియా

బీఎస్‌-6 ఇన్నోవా క్రిస్టా విడుదల

Tuesday 7th January 2020

ధరల శ్రేణి రూ. 15.36 లక్షలు - 24.06 లక్షలు  న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టీకేఎం).. భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న ‘ఇన్నోవా క్రిస్టా’ ఎస్‌యూవీని సోమవారం ఆవిష్కరించింది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లలో అందుబాటులో వచ్చిన ఈ అధునాతన వాహనం ధరల శ్రేణి రూ.15.36 లక్షలు నుంచి రూ. 24.06 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. సోమవారం నుంచే బుకింగ్స్‌ ప్రారంభం

Most from this category