News


మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 31st December 2019
Markets_main1577764319.png-30546

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(మంగళవారం) బలహీనంగా కదిలే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నష్టాలతో కదులుతోంది. దీనికితోడు సోమవారం డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 0.65 శాతం స్థాయిలో క్షీణించాయి. ఇటీవల ర్యాలీ బాటలో సాగిన అమెరికా స్టాక్‌ మార్కెట్లలో సోమవారం లాభాల స్వీకరణకు తెరలేచినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆసియాలోనూ బలహీన ధోరణి కనిపిస్తోంది. కాగా.. నేడు విభిన్న వార్తల నేపథ్యంలో కొన్ని స్టాక్స్‌ యాక్టివ్‌గా ట్రేడయ్యే వీలుంది. ఈ వివరాలు చూద్దాం...

యునైటెడ్‌ స్పిరిట్స్‌
రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ దీర్ఘకాలిక బ్యాంక్‌ సౌకర్యాల(రుణ చెల్లింపులు) రేటింగ్‌ను స్థిరత్వం(స్టేబుల్‌) నుంచి సానుకూలం(పాజిటివ్‌)కు సవరించినట్లు డియాజియో నిర్వహణలోని యునైటెడ్‌ స్పిరిట్స్‌ పేర్కొంది. 

పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌
ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో మార్పిడికి వీలుకాని డిబెంచర్ల జారీకి బోర్డు అనుమతి లభించినట్లు పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తెలియజేసింది. తద్వారా రూ. 1600 కోట్లు సమీకరించనున్నట్లు వెల్లడించింది.

ఎన్‌హెచ్‌పీసీ
వివిధ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.2000 కోట్లు సమీకరించేందుకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రభుత్వ రంగ జలవిద్యుత్‌ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ తెలియజేసింది.

పీటీసీ ఇండియా ఫైనాన్షియల్‌
పీఎస్‌యూ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి తాజాగా రూ. 500 కోట్లమేర దీర్ఘకాలిక రుణాన్ని పొందనున్నట్లు తెలియజేసింది. ఈ నిధులను మౌలిక సదుపాయ ప్రాజెక్టుల ఫండింగ్‌కు వెచ్చించనున్నట్లు వివరించింది.

ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలను జనవరి 10న ప్రకటించనున్నట్లు సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ బీఎస్‌ఈకి తెలియజేసింది.

చాలెట్‌ హోటల్స్‌
ఆతిథ్య రంగ గ్లోబల్‌ కంపెనీ మారియట్‌ ఇంటర్నేషనల్‌తో తాజాగా ఐదు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు చాలెట్‌ హోటల్స్‌ పేర్కొంది. తద్వారా మారియట్‌ ఇంటర్నేషనల్‌ సహకారాన్ని మరింత విస్తరించుకోనున్నట్లు తెలియజేసింది. You may be interested

2019 బిజినెస్‌: కొత్త బాధ్యతలు

Tuesday 31st December 2019

జనవరి 8 : అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్‌) సంస్థ చీఫ్‌ ఎకనమిస్ట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా గీతా గోపీనాథ్‌. మే 31: దేశ ఆర్థికమంత్రిగా నియమితులైన నిర్మలా సీతారామన్‌. గతంలో ఇందిరాగాంధీ తాత్కాలికంగా ఆర్థికశాఖను నిర్వహించినా, పూర్తి స్థాయి ఆర్థికమంత్రిగా నియమితులైన తొలి భారత మహిళగా సీతారామన్‌కు గుర్తింపు. జూలై 30: విప్రో చైర్మన్‌గా ప్రేమ్‌జీ బాధ్యతల విరమణ. కుమారుడు రిషేద్‌కు బాధ్యతలు.    

2019 బిజినెస్‌ రివైండ్‌: ఏ నెలలో ఏం జరిగింది

Tuesday 31st December 2019

జనవరి...  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయా, దేనా బ్యాంక్‌ల విలీనానికి కేంద్రం ఓకే. దీనితో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ తర్వాత దేశంలోనే మూడవ అతిపెద్ద బ్యాంకుగా బీఓబీ అవతరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండవ అతిపెద్ద బ్యాంకుగా నిలిచింది. బంధన్‌ బ్యాంక్‌ చేతికి గృహ్‌ ఫైనాన్స్‌.  అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చీఫ్‌ ఎకనమిస్ట్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా గీతా గోపీనాథ్‌.  వీడియోకాన్‌ క్విడ్‌ప్రోకో వ్యవహారంలో చందా కొచర్‌పై సీబీఐ కేసు.  ఫిబ్రవరి...  ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ఆరోగ్యం

Most from this category