STOCKS

News


బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 15th January 2020
Markets_main1579059981.png-30937

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు(15న) ప్రతికూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. చైనాతో వాణిజ్య వివాద పరిష్కార ప్రాథమిక్‌ డీల్‌ నేడు కుదరనున్న నేపథ్యంలో మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఇక ప్రస్తుతం ఆసియా స్టాక్‌ మార్కెట్లలో జపాన్‌, చైనా, హాంకాంగ్‌ తదితరాలు 0.5 శాతంపైగా నీరసించి కదులుతున్నాయి. మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు చరిత్రాత్మ గరిష్టాల వద్ద నిలవడంతో నేడు దేశీ మార్కెట్లలో కొంతమేర లాభాల స్వీకరణకు వీలున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశమున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల కారణంగా నేడు కొన్ని కంపెనీలు యాక్టివ్‌గా ట్రేడయ్యే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం..

స్టేట్‌బ్యాంక్‌
ఏడాది నుం‍చి పదేళ్ల కాలంవరకూ వివిధ కాలావధి గల డిపాజిట్లపై వడ్డీ రేట్లలో కోత పెడుతున్నట్లు పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ తాజాగా పేర్కొంది. వెరసి దీర్ఘకాలిక డిపాజిట్లపై వడ్డీ రేటును 0.15 శాతం(15 బేసిస్‌ పాయింట్లు) తగ్గిస్తున్నట్లు తెలియజేసింది. జనవరి 10 నుంచీ రేట్లు అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది.

విప్రో లిమిటెడ్‌
ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో విప్రో రూ. 2456 కోట్ల నికర లాభం ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 2 శాతం తక్కువకాగా.. మొత్తం ఆదాయం 3 శాతం పుంజుకుని రూ. 15,470 కోట్లను తాకింది. ఒక్కో షేరుకీ రూ. 1 డివిడెండ్‌ ప్రకటించింది. 

మైండ్‌ట్రీ లిమిటెడ్‌
ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ మైండ్‌ట్రీ లిమిటెడ్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో మైండ్‌ట్రీ రూ. 197 కోట్ల నికర లాభం ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన ఇది 3 శాతం అధికంకాగా.. మొత్తం ఆదాయం 10 శాతం పెరిగి రూ. 1,965 కోట్లను తాకింది. 

ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌
ప్రమోటర్‌ రాధాకృష్ణన్‌ దమానీ.. సంస్థాగత ఇన్వెస్టర్లకు కొంతమేర వాటాను విక్రయించే ప్రణాళికల్లో ఉన్నట్లు డీమార్ట్‌ రిటైల్‌ స్టోర్ల నిర్వాహక సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ తాజాగా పేర్కొంది. సుమారు రూ. 6,200  కోట్ల విలువైన వాటాను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. తద్వారా లిస్టింగ్‌ నిబంధనలకు అనుగుణంగా ప్రమోటర్‌ వాటాను 75 శాతానికి చేర్చుకునే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి.

టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌
కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో నికర నష్టాలు మరింత పెరిగినట్లు ప్రయివేట్‌ రంగ కంపెనీ టాటా స్టీల్‌ బీఎస్‌ఎల్‌ తెలియజేసింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ. 501 కోట్లకుపైగా నికర నష్టం నమోదైనట్లు తెలియజేసింది. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 240 కోట్ల నికర నష్టం నమోదైనట్లు గుర్తుచేసింది.  You may be interested

ఆర్‌కామ్‌ ఆస్తులు జియో, యూవీఏఆర్‌సీకే..!

Wednesday 15th January 2020

టాప్‌ బిడ్డర్లుగా నిలిచిన సంస్థలు న్యూఢిల్లీ: దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ ఆస్తులకు నిర్వహించిన వేలంలో టాప్‌ బిడ్డర్లుగా రిలయన్స్‌ జియో, యూవీఏఆర్‌సీ నిలిచాయి. ఆర్‌కామ్‌కు సంబంధించి స్పెక్ట్రమ్‌, రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులు, డేటా కేంద్రాలకు రూ.16,000 కోట్లను కోట్‌ చేసి అత్యధిక బిడ్డర్‌గా యూవీఏఆర్‌సీ నిలిచినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. అలాగే, ఆర్‌కామ్‌కు చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ మొబైల్‌ టవర్‌, ఫైబర్‌ ఆస్తులకు

భారత్‌లో అమెజాన్‌ రూ. 1,700 కోట్ల పెట్టుబడులు

Wednesday 15th January 2020

న్యూఢిల్లీ: భారత్‌లో జోరుగా కార్యకలాపాలు విస్తరిస్తున్న అమెరికన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌..  చెల్లింపులు, హోల్‌సేల్‌ వ్యాపార విభాగాల్లోకి రూ. 1,700 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్‌ పే ఇండియా విభాగానికి అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్‌, అమెజాన్‌డాట్‌కామ్‌డాట్‌ఐఎన్‌సీఎస్‌ నుంచి రూ. 1,355 కోట్లు వచ్చాయి. ఇందుకు ప్రతిగా ఆయా సంస్థలకు అమెజాన్ పే ఇండియా షేర్లు కేటాయించింది. ఆ రెండు సంస్థల నుంచి రూ. 360 కోట్లు అందుకున్న అమెజాన్

Most from this category