News


సోమవారం వార్తల్లోని కంపెనీలు

Monday 13th January 2020
Markets_main1578887170.png-30877

నేడు(13న) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారం‍భమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి ట్రేడవుతోంది. అయితే వారాంతాన ట్రేడర్ల లాభాల స్వీకరణ కారణంగా యూఎస్‌ స్టాక్‌ ఇండెక్సులు స్వల్ప వెనకడుగు వేశాయి. ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను అందుకున్నాక చివర్లో అమ్మకాలు తలెత్తడంతో డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ నష్టాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా కొన్ని కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడయ్యే అవకాశముంది. ఈ జాబితా పరిశీలిద్దాం..

ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌
ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతోపాటు, భారీ ఆర్డర్లు లభించడంతో దేశీ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌.. ప్రోత్సాహకర ఆదాయ అంచనాలు(గైడెన్స్‌) ప్రకటించింది. దీనికితోడు ప్రజావేగు(విజిల్‌బ్లోయర్‌) ఆరోపణల్లో వాస్తవాలు లేవంటూ ఆడిట్‌ కమిటీ పేర్కొంది. దీంతో శుక్రవారం న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్టయిన ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1.6 శాతం బలపడి 10.65 డాలర్ల వద్ద ముగిసింది. ఫలితంగా ఈ కౌంటర్‌ నేటి ట్రేడింగ్‌లో లాభాలలతో ప్రారంభం‍కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌
డీమార్ట్‌ బ్రాండుతో రిటైల్‌ స్టోర్లను నిర్వహిస్తున్న ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం 53 శాతంపైగా జంప్‌చేసి రూ. 394 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం సైతం 24 శాతం ఎగసి రూ. 6,752 కోట్లకు చేరింది. దీంతో ఈ కౌంటర్‌ సైతం సానుకూలంగా ట్రేడయ్యే వీలున్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

యస్‌ బ్యాంక్‌
వారాంతాన నిర్వహించిన సమావేశంలో బ్యాంకు బోర్డు రూ. 10,000 కోట్ల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. అయితే ఎర్విన్‌ సింగ్‌, ఎస్‌పీజీపీ హోల్డింగ్స్‌ ప్రకటించిన 1.2 బిలియన్‌ డాలర్ల ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలియజేసింది.

వొడాఫోన్‌ ఐడియా
టెలికం అధీకృత సంస్థ డాట్‌ రెండేళ్ల మారటోరియానికి అనుమతించడంతో రైట్స్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల వినియోగ ప్రణాళికలను సవరించనున్నట్లు వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది. ఫలితంగా రూ. 2826 కోట్ల రైట్స్‌ నిధులను రుణాలతోపాటు, మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) ణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు వెల్లడించింది.

టాటా మోటార్స్‌
జేఎల్‌ఆర్‌సహా గ్రూప్‌ అంతర్జాతీయ విక్రయాలు డిసెంబర్‌ 2019లో 3 శాతం నీరసించి 97,348 యూనిట్లకు పరిమితమైనట్లు దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్‌ పేర్కొంది.

టాటా కెమికల్స్‌
కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసే ప్రతిపాదనకు జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు టాటా గ్రూప్‌ సంస్థ టాటా కెమికల్స్‌ తెలియజేసింది.You may be interested

చిన్న స్టాకుల సందడి కొనసాగుతుంది!

Monday 13th January 2020

సందీప్‌ పోర్వల్‌ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో ర్యాలీ కొనసాగుతుందని టెక్నికల్‌ సెటప్‌ సూచిస్తోందని ఆషికా స్టాక్‌ బ్రోకింగ్‌ అనలిస్టు సందీప్‌ పోర్వల్‌ చెప్పారు. చిన్న షేర్లు బుల్లిష్‌గా ఉన్నందున ప్రస్తుత తరుణంలో ఈ విభాగానికి చెందిన నాణ్యమైన స్టాకులను ఎంచుకోవచ్చని సూచించారు. ఎంఅండ్‌ఎం, ఎక్సైడ్‌, అపోలోటైర్స్‌, షాపర్స్‌ స్టాప్‌ షేర్లను ఈ విభాగం నుంచి రికమండ్‌ చేశారు. లార్జ్‌క్యాప్స్‌లో ఆర్‌ఐఎల్‌ను పెరిగినప్పుడుల్లా అమ్మొచ్చని సిఫార్సు చేశారు. నిఫ్టీకి 12300 పాయింట్ల వద్ద

రికార్డు గరిష్టాల సమీపంలో సూచీల ప్రారంభం

Monday 13th January 2020

అమెరికా-చైనా ట్రేడ్‌డీల్‌పై మరో రెండు రోజుల్లో సంతకాలు జరగనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాలకు అనుగుణంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు రికార్డు గరిష్టస్థాయిలకు సమీపంలో ఆరంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 192 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 41,792 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఈ సూచి గత రికార్డుస్థాయి 42,810 పాయింట్లకు మరో 18 పాయింట్ల దూరంలోనే వుండటం విశేషం. అలాగే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 12,297 పాయింట్ల

Most from this category