News


నేటి వార్తల్లోని షేర్లు

Tuesday 25th February 2020
Markets_main1582607920.png-32068

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

ఎన్‌టీపీసీ: ఎన్‌ఈఈపీసీఓ లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 100 శాతం, టెహ్రీ హైడ్రో పవర్‌ కాంప్లెక్స్‌లో 74.5 శాతం వాటాను ఎన్‌టీపీసీ కొనుగోలు చేయడానికి సీసీఐ ఆమోదం తెలిపింది.

ఐఆర్‌బీ: ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌లో జీఐసీ అనుబంధ సంస్థ రూ.4,400 కోట్ల పెట్టుబడులు పెడతానని ఒప్పందం చేసుకోగా, తొలిదశలో రూ.3,753 కోట్లును ఐఆర్‌బీకి పెట్టుబడి కింద ఇచ్చింది. ట్రస్ట్‌లో ఐఆర్‌బీకి 51 శాతం, జీఐసీకి 49 శాతం వాటాలు ఉన్నాయి.

హిందుస్తాన్‌ యూనీలీవర్‌: ట్యాక్స్‌లు తగ్గడంతో హిందుస్తాన్‌ యూనీలీవర్‌ రిన్‌, డౌవ్‌ సబ్బు తయారీకి మరో రెండు కొత్త యూనిట్లను ప్రారంభించనుంది.

టెక్‌ మహీంద్రా: అమెరికాకు చెందిన జెన్‌3 ఇన్ఫోసొల్యూషన్స్‌ను 44 మిలియన్‌ డాలర్లకు టెక్‌ మహీంద్రా కొనుగోలు చేసింది. మరో 22 మిలియన్‌ డాలర్లను మూడేళ్లలో చెల్లించనుంది. ఈ లావాదేవీలు మొత్తం ఏప్రిల్‌ 1న ముగియనున్నాయి.
 



You may be interested

వొడాఫోన్‌ ఐడియా షేరు పతనం

Tuesday 25th February 2020

బ్యాంక్‌ గ్యారంటీలను నగదు చేసుకోవద్దంటున్న రుణదాతలు 6.5 శాతం పతనమైన వొడాఫోన్‌ ఐడియా షేరు మొబైల్‌ సేవల కంపెనీ వొడాపోన్‌ ఐడియాకు రుణాలిచ్చిన ఫైనాన్షియల్‌ సంస్థలు బ్యాంక్‌ గ్యారంటీలను నగదుగా మార్చుకోవద్దని వారాంతాన టెలికం శాఖ(డాట్‌)ను అభ్యర్థించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇలా చేస్తే బ్యాంకుల రుణాలను చెల్లించే విషయంలో కంపెనీ విఫలంకాగలదని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. టెలికం రంగంలో మూడు కంపెనీల కార్యకాలపాలు కొనసాగే పరిస్థితులు కల్పించే బాటలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రుణదాత

11682 పాయింట్ల మద్దతు కూడా కోల్పోవచ్చు?!

Tuesday 25th February 2020

నిఫ్టీ రాబోయే రోజుల్లో 11682 పాయింట్ల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సోమవారం ఎఫ్‌ఐఐల భారీ విక్రయాలతో కీలకమైన 11900- 12000 పాయింట్ల మద్దతును నిఫ్టీ కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భారీ నెగిటివ్‌ మూడ్‌ను ప్రతిబింబిస్తూ దేశీయ మార్కెట్లో కూడా సోమవారం భారీ కరెక‌్షన్‌ వచ్చింది. ఈ వరుస చూస్తుంటే త్వరలో నిఫ్టీ కీలకమైన 200 రోజుల డీఎంఏ స్థాయిని పరీక్షించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Most from this category