News


నేటి వార్తల్లోని షేర్లు

Tuesday 18th February 2020
Markets_main1582007804.png-31888

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

వొడాఫోన్‌ఐడియా: రూ.2500 కోట్లు ఏజీఆర్‌ బకాయిలు చెల్లించన వొడాఫోన్‌ఐడియా కంపెనీ ఈ వారంతంలోపు మరో రూ.1000 కోట్లు కట్టడానికి బోర్డు అనుమతించిందని వెల్లడించిం‍ది.

గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌:  ముంబై కేంద్రంగా పనిచేస్తున్న గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌.. రైల్వే ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ నుంచి భూమిని కొనుగోలు చేయనుంది. దీనిలో భాగంగా ఢిల్లీలోని అశోక్‌ విహార్‌ ప్రాంతంలో ఉన్న 26.58 ఎకరాల భూమిని రూ.1,359 కోట్లకు సొంతంచేసుకోనుంది.

ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌: ఈక్విటీ షేర్లు, బాండ్లు, ఇతర సెక్యూరిటీల జారీ ద్వారా నిధులు సమీకరించేందుకు ఫిబ్రవరి 20న ఈ కంపనీ బోర్డు సమావేశం కానుందని కిశోర్‌ బియాని వెల్లడించారు.

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌: ఒడిశాలోని మూడు ఇనుప ఖనిజ గనులను సొంతం చేసుకునేందుకు బిడ్లను వేస్తున్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఆయా గనుల్లో 109.2 కోట్ల టన్నుల నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తోంది.

సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌: వివిధ మెట్రోనగరాల్లో ప్రముఖ బ్రిడ్జ్‌లు నిర్మించిన సింప్లెక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వివిధ ప్రభుత్వ ఏజెన్సీల నుంచి కంపెనీకి రావాల్సిన నిధులు సమకూరకపోవడంతో బ్యాంకులు లోన్‌ చెల్లింపుల్లో విఫలం అయ్యింది.
 



You may be interested

కుప్పకూలిన వొడాఫోన్‌ ఐడియా

Tuesday 18th February 2020

కేర్‌ రేటింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ షాక్‌ 10 శాతం పతనమై రూ. 3 దిగువకు  7 రోజుల్లో 44 శాతం దిగజారిన షేరు రూ. 2,500 కోట్లమేర ఏజీఆర్‌ చెల్లింపులు మరో రూ. 1,000 కోట్ల చెల్లింపులకు సిద్ధం సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వొడాఫోన్‌ ఐడియా ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులకు ముందుకొచ్చింది. తొలి విడతగా సోమవారం రూ. 2,500 కోట్లను టెలికం శాఖ(డాట్‌)కు చెల్లించింది. వారాంతానికల్లా మరో రూ. 1,000 కోట్లను చెల్లించేందుకు సిద్ధపడుతోంది. ఇందుకు బోర్డు అనుమతించినట్లు

జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ జూమ్‌

Tuesday 18th February 2020

నష్టాల మార్కెట్లోనూ షేరు  5 శాతం ప్లస్‌ జీఎంఆర్‌ కమలంగ ఎనర్జీ(జీఈఎల్‌)లో పూర్తి వాటా కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించడంతో ప్రయివేట్‌ రంగ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో నష్టాల మార్కెట్లోనూ ఈ షేరు లాభాలతో కళకళలాడుతోంది. ఉదయం 10.45 ప్రాంతంలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ షేరు ఎన్‌ఎస్‌ఈలో 4.5 శాతం జంప్‌చేసి రూ. 66 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 68.4 వరకూ ఎగసింది.

Most from this category