News


నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 12th February 2020
Markets_main1581488183.png-31721

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్‌లో ప్రభావితమయ్యే షేర్లు

ఐడీబీఐ బ్యాంక్‌: ఐడీబీఐ బ్యాంక్‌ వరుసగా 13సారి నష్టాలను చవిచూసింది. వన్‌టైమ్‌ ట్యాక్స్‌ రూ.6,273 కోట్లు చెల్లించడంతో ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో నికర నష్టం రూ.5,763 ‍కోట్లకు చేరింది. 

అలహాబాద్‌: మొండి బకాయిలు ఎక్కువగా ఉండడంతో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అలహాబాద్‌ బ్యాంక్‌ స్టాండేలోన్‌ నికర నష్టం రెండు రెట్లు పెరిగి రూ.1,986.26 కోట్లకు చేరింది. గత ఆర్థికసంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర నష్టం రూ.732.81 కోట్లుగా ఉంది.

టైటాన్‌ కంపెనీ: హైదరాబాద్‌ క్రేంద్రగా పనిచేస్తున్న హెచ్‌యూజీ టెక్నాలజీని టైటాన్‌ కంపెనీ సొంతం చేసుకుంది. 

ఇండస్‌లాండ్‌ బ్యాంక్‌: నాణ్యతా ప్రమాణాలు దృష్టిలోపెట్టుకుని ఇండస్‌లాండ్‌ బ్యాంక్‌ కు మూడీస్‌ సంస్థ స్టేబుల్‌నుంచి నెగిటివ్‌ రేటింగ్‌ను ఇచ్చింది. బ్యాంకు జారీచేసిన స్వదేశీ, విదేశీ కరెన్సీ బాండ్ల రేటింగ్‌ Baa3 గా ఉంది. 

వేదాంత: ఛత్తీస్‌ఘడ్‌లోని కోర్భా ప్రాంతంలో ఉన్న ల్యాంకోస్‌కు చెందిన అమర్‌కంఠక్‌ పవర్‌ ప్లాంట్‌ను సొంతంచేసుకునేందుకు అదానీ, వేదాంత కంపెనీలు పోటిపడుతున్నాయి. కాగా గతేడాది నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) అమర్‌కంఠక్‌ పవర్‌ ప్లాంట్‌ దివాల ప్రొసీడింగ్స్‌ను అంగీకరించిన సంగతి తెలిసిందే.

టాటా పవర్‌: నిర్మాణంలో ఉన్న వరోరా-కర్నూల్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ను విక్రయించేందుకు ఎస్సల్‌ గ్రూపు చైర్మన్‌ సుభాష్‌ చంద్ర అదానీ ట్రాన్స్‌మిషన్‌, టాటా పవర్‌లతో చర్చలు జరుపుతున్నారు.

ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌: ఒక దశాబ్దం పాటు ముంబై-పునే ఎక్స్‌ప్రెస్‌వేను నిర్వహించి, టోల్‌ వసూళ్లు చేసే కాంట్రాక్ట్‌ను ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్స్‌ సొంతం చేసుకుంది. కాగా ఈ కాంట్రాక్టును సొంతం చేసుకునే జాబితాలో ఈ కంపెనీ ఒక్కటే పోటీపడడం విశేషం.

ఆదానీ ట్రాన్స్‌మిషన్‌: వచ్చే ఆర్థిక సంవత్సరంలో కోనుగోలు ధరను తగ్గించుకోవడానికి బాండ్ల అమ్మకం ద్వారా 1 బిలియన్‌డాలర్లను సమకూర్చుకోవాలని గౌతమ్‌ అదానీ భావిస్తున్నారు.

హెక్సావేర్‌ టెక్నాలజీస్‌: డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో ఈ కంపెనీ నికర లాభం 36 శాతం పెరిగి రూ.168 కోట్లకు చేరింది. కాగా గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.123.4 కోట్లుగా ఉంది.

పిరమాళ్‌ ఎంటర్‌ప్రైజెస్‌: ఈ కంపెనీ  డిజిటల్‌ వినియోగదారులకు చేరువయ్యేందుకు అతిపెద్ద ఆన్‌లైన్‌ లెండింగ్‌ యూనిట్‌ను ప్రారంభించేందుకు టెలికం సంస్థతో కలిసి పనిచేయనుంది.

సీఈఎస్‌సీ: ఆర్‌పీ సంజీవ్‌ గోయంకా గ్రూప్‌కు చెందిన ప్రధాన కంపెనీ సీఈఎస్‌సీ లిమిటెడ్‌  క్యూ3 ఫలితాలను వెల్లడించింది. కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 10 శాతం పెరిగి రూ.263 కోట్లకు చేరిందని తెలిపింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌: VSSL, GMSL,PISLను తమ కంపెనీ అయిన AAHLలో పూర్తిగా విలీనం చేసినట్లు అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ వెల్లడించింది.

జిందాల్‌ స్టెయిన్‌లెస్‌: ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3లో మెటీరియల్‌ ధరలను తగ్గించుకోవడంతో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 16 శాతం పెరిగి రూ.51.81 కోట్లకు చేరిందని ప్రకటించింది. 

స్పెన్సర్స్‌ రిటైల్‌: ఈ కంపెనీ డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.39.05 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర నష్టం రూ.11 లక్షలుగా ఉంది.

కోల్‌ఇండియా: CPSE ETF మ్యూచువల్‌ ఫండ్‌​ స్కీమ్‌ ద్వారా కోల్‌ ఇండియా 3 శాతం వాటాను విక్రయించింది. కాగా ఈ కంపెనీ క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 14 శాతం తగ్గి రూ.3,922 కోట్లకు చేరింది.

సిండికేట్‌ బ్యాంక్‌: మొండి బకాయిలు తగ్గడంతో క్యూ3లో  సిండికేట్‌ బ్యాంక్‌ నికర లాభం పెరిగిరూ. 435 కోట్లకు చేరింది. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.108 కోట్లుగా ఉంది.You may be interested

ఎంఎస్‌సీఐ ఇండెక్స్‌లో బంధన్‌ బ్యాంక్‌ వెయిటేజ్‌కి బూస్ట్‌

Wednesday 12th February 2020

ఎంఎస్‌సీఐ ఇండియా ఇండెక్స్‌లో బంధన్‌ బ్యాకు వెయిటేజి 32 బేసిస్‌ పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. ఈ బ్యాంకు ఈక్విటీ ఫ్రీఫ్లోట్‌ పెరిగిన కారణంగా వచ్చే సమీక్షలో ఈ వెయిటేజిలో మార్పు ఉండవచ్చని  మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. బుధవారం ఎంఎస్‌సీఐ  ఇండెక్స్‌పై సమీక్ష నిర్వహించనున్నారు.వెయిటేజీ పెరగనున్నందున రూ.700 కోట్ల విదేశీ నిధులు ఈ బ్యాంకు స్టాక్‌లోకి ప్రవహించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

స్పార్క్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ షాక్‌

Wednesday 12th February 2020

కేన్సర్‌ ఔషధానికి నో షేరు 8 శాతం పతనం కేన్సర్‌ ఔషధం టేక్లంటిస్‌కు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) అనుమతి నిరాకరించినట్లు వెలువడిన వార్తలు హెల్త్‌కేర్‌ రంగ సంస్థ సన్‌ ఫార్మా అడ్వాన్స్‌డ్‌ రీసెర్చ్‌ కంపెనీ(స్పార్క్‌) కౌంటర్‌ను దెబ్బతీశాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ఈ కౌంటర్‌ పతన బాట పట్టింది. ఎన్‌ఎస్‌ఈలో ఉదయం 11.15 ప్రాంతంలో దాదాపు 8 శాతం దిగజారి రూ. 177 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 171

Most from this category