News


నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 26th February 2020
Markets_main1582701333.png-32104

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు

సిప్లా: సిప్లాకు చెందిన గోవా ఫెసిలిటీ కేంద్రానికి యూఎస్‌ఎఫ్‌డీఏ హెచ్చరిక లేఖను రాసింది.

బంధన్‌ బ్యాంక్‌: ఎటువంటి అనుమతులు లేకుండా వివిధ ప్రాంతాల్లో బంధన్‌ బ్యాంక్‌ శాఖలను ఏర్పాటు చేసుకోవచ్చని ఆర్బీఐ సూచించింది.

బీపీసీఎల్‌: బీపీసీఎల్‌ 3–5 డాలర్ల డిస్కౌంట్‌తో 500 మిలియన్‌ బేరల్స్‌ క్రూడ్‌ను కొనుగోలు చేసింది.

వొకార్డ్‌: ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ వొకార్డ్‌కు లాంగ్‌ టర్మ్‌ రేటింగ్‌ బీబీ ఫ్లస్‌ను ఇచ్చింది.

యస్‌ బ్యాంక్‌:  రూ.21000 కోట్ల విలువైన యస్‌బ్యాంక్‌ బాండ్లకు  కేర్‌ రేటింగ్స్‌  ప్రతికూలతలతో కూడిన క్రెడిట్‌ వాచ్‌ రేటింగ్‌ను ప్రకటించింది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా: సింప్లెక్స్‌ ప్రాజెక్ట్స్‌కు ఇచ్చిన బ్యాంక్‌ గ్యారెంటీపై కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆర్డరును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా వెల్లడించింది.

ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌: ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ లావాదేవీల్లో నిబంధనలు ఉల్లఘించారని సెబీ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 



You may be interested

ఈ రెండు షేర్లను కొనొచ్చు!

Wednesday 26th February 2020

అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న కరోనా వైరస్‌ వ్యాధి భయాలు దేశీయ ఈక్విటీ మార్కెట్‌ను తాకడంతో ఈ వారంలో బెంచ్‌ మార్క్‌ సూచీలు వరుసగా మూడోరోజూ నష్టాల బాట పట్టాయి. బుధవారం నాటి ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఒకదశలో సెన్సెక్‌ 39వేల మార్కును నిఫ్టీ 12వేల మార్కును కోల్పోయాయి. ఈ నేపథ్యంలో ఇండియానివేశ్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ సాంకేతిక నిపుణుడు మెహుల్‌ కొఠారీ స్వల్పకాలానికి(3నుంచి 4వారాలు) మూడు స్టాక్‌లపై తన అభిప్రాయాన్ని వ్యక్తం

దేశీ మార్కెట్‌ వైపు గ్లోబల్‌ ఫండ్స్‌ చూపు!

Wednesday 26th February 2020

కరోనా ప్రభావం తక్కువగా ఉండడమే కారణమంటున్న నిపుణులు కరోనా వైరస్‌ ప్రభావం ఇండియా మార్కెట్‌పై పెద్దగా ఉండదని భావిస్తున్న విదేశీ మదుపరులు, గ్లోబల్‌ ఫండ్స్‌ తమ పెట్టుబడులను భారత మార్కెట్లోకి మరలిస్తున్నాయి. భారత మార్కెట్‌ ఎక్కువగా స్థానిక అంశాలపై ఆధారపడుతుందని, ప్రస్తుతం ఇక్కడ ఎకానమీలో రికవరీ సంకేతాలు కనిపిస్తున్నాయని ఈస్ట్‌ స్ప్రింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్, నార్త్‌కేప్‌ క్యాపిటల్‌లాంటి సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా చైనాలో దాదాపు మూడువేలమంది మరణించారు. ఈ

Most from this category