News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 16th January 2020
Markets_main1579160208.png-30965

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 

డెన్‌ నెట్‌వర్క్‌:-  డెన్‌ నెట్‌వర్క్‌ ఆర్థిక సంవత్సరం-2020 మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ముగిసిన ఆర్థిక సంవత్సరం 2019 మూడో త్రైమాసికంలో రూ.31.2 కోట్లు నష్టపోగా.. ఈ త్రైమాసికంలో పుంజుకుని నికర లాభాన్ని రూ.12.3 కోట్లుగా ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కార్యాకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.318 కోట్లు ఉంది. గతేడాది ఈ ఆదాయం రూ.308 కోట్లుగా నమోదైంది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌:- గతేడాది త్రైమాసిక ఫలితంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం-20 మూడో త్రైమాసికంలో నికర లాభం 12.6 శాతం ఎగబాగి రూ.2.46 కోట్లకు చేరింది. గతేడాది నికర లాభం రూ.2.18 కోట్లుగా నమోదైంది. 

ఐఓసీ:- ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన అన్‌సెక్యూర్డ్‌, రేటెడ్‌, పన్ను చెల్లించే, రిడీమ్‌బుల్‌ ఎన్‌సీడీలను జారీ చేసి రూ.2000 కోట్ల సమీకరిస్తున్నట్లు స్టాక్‌ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది.

ఏసియన్‌ పెయింట్స్‌:-  జేఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌కు వ్యతిరేకంగా ఏసియన్‌ పెయింట్స్‌ చేసిన ఫిర్యాదులను సీసీఐ పరిశీలిస్తోంది.

అలప్స్‌ ఇండస్ట్రీస్‌:-  కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ అలప్స్‌ ఇండస్ట్రీస్‌పై దాఖలు చేసిన పిటీషన్‌ను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసింది.

టొరెంట్‌ ఫార్మా:- ఈక్విటీ జారీ ద్వారా నిధుల సేకరణ అంశాన్ని జనవరి 27న టొరెంట్‌ బోర్డు పరిశీలించనుంది.

స్టెరిలైట్‌ టెక్‌:- స్టెరిలైట్‌ టెక్‌ మూడో త్రైమాసిక లాభం 43.1శాతం తగ్గి ఆదాయం రూ.91 కోట్లుగా నమోదైంది. ఏడాది ఆదాయం 11.5 శాతం క్షీణించి రూ.1,203 కోట్లకు చేరుకుంది. 

డిష్‌మాన్‌ కార్బోజెన్‌:- కంపెనీ ఉద్యోగుల స్టాక్‌ ఆప్షన్‌ ప్లాన్‌ పరిశీలించేందుకు, షేర్లను బైబ్యాక్‌ చేసేందుకు డిష్‌మాన్‌ కార్బొజెన్‌ అమ్సిస్‌ బోర్డు ఈరోజు(జనవరి 16) సమావేశం నిర్వహించనుంది. 

యస్‌ బ్యాంక్‌:- సికాల్‌ లాజిస్టిక్స్‌ తనఖాపెట్టిన 10.25 శాతం వాటాను కొనుగోలు చేయనుంది.

మంగళం సిమెంట్‌:- 11 మెగావాట్లతో 5.15 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన వేస్ట్‌ హీట్‌ రికవరీ ప్లాంట్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది.

ఐసీఐసీఐ బ్యాంక్‌:- కొత్త ఇన్వెస్టర్ల నుంచి తాజా మూలధనాన్ని సేకరించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌ కిసాన్‌ రూరల్‌ ఫైనాన్స్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

సింభోలి షుగర్స్‌:- బ్యాంకుల వద్ద ఉన్న  సింభోలి షుగర్స్‌ మొత్తం బకాయిలు డిసెంబర్‌ 31  రూ.1,041 కోట్లు డిఫాల్ట్‌ అయ్యింది.

యూనిటెక్‌:- యూనిటెక్‌ను తమ అజమాయిషీలోకి తీసుకునేందుకు ఎంసీఏ సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

పెనిన్సులా ల్యాండ్‌:-  కంపెనీకి చెందిన అసోసియేట్‌పై దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 

డీఎంఎఫ్‌ ఫుడ్స్‌:- డీఎంఎఫ్‌ ఫుడ్స్‌ ప్రమోటర్లతో పాటు ఇతర వాటాదారులు ఏఐ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

వాటాలు విక్రయించనున్న బ్యాంక్‌లు

1.ఈక్విఫ్యాక్స్‌ క్రెడిట్‌ ఇన్ఫర్మీషన్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఈసీఐఎస్‌)లో ఉన్న మొత్తం ఈక్విటీ వాటా(7.41 శాతం)ను ఉపసంహరించుకోవాలని ఎస్‌బీఐ నిర్ణయించింది.

2.ఈక్విఫ్యాక్స్‌ క్రెడిట్‌ ఇన్ఫో సర్వీసెస్‌లో ఉన్న తన మొత్తం వాటాను  కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌  5.56 శాతానికి విక్రయించింది.

3.ఈక్విఫ్యాక్స్‌ క్రెడిట్‌ ఇన్ఫర్మీషన్‌ సర్వీసెస్‌లో  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఉన్న ఈక్విటీ వాటాను 3.50 శాతం విక్రయించనుంది. 

4.యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా ఈక్విఫ్యాక్స్‌ క్రెడిట్‌ ఇన్ఫర్మీషన్‌ సర్వీసెస్‌లో ఉన్న 4.17 శాతం వాటాను విక్రయించేందుకు సిద్దమవుతంది. 
నేడు క్యూ3 ఫలితాలను వెల్లడించే కొన్ని ప్రధాన కంపెనీలు 
టాటా మెటాలిక్స్‌, సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌, కర్ణాటక బ్యాంక్‌, రేలీస్‌ ఇండియా, సియెంట్‌, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డాట్‌కామ్‌, సనత్‌నగర్‌ ఎంటర్‌ప్రైజెస్‌, రోస్‌ల్యాబ్స్‌ ఫైనాన్స్‌, ధృవ్‌ ఎస్టేట్స్‌ కంపెనీలు డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలను ఈరోజు(జనవరి 16)న విడుదల చేయనున్నాయి.  You may be interested

లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న బ్యాంక్‌ నిఫ్టీ

Thursday 16th January 2020

మార్కెట్‌ పరిమితి శ్రేణి ట్రేడింగ్‌లో భాగంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతుంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 31,810.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ అరశాతం పెరిగి 31,988.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. అనంతరం మార్కెట్‌ ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో భాగంగా ప్రైవేట్‌

ఫ్లాట్‌గా పసిడి ధర

Thursday 16th January 2020

జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ఫ్యూచర్ల ధర ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10గ్రాముల పసిడి ఫ్యూచర్ల ధర రూ.30ల స్వల్పలాభంతో 39640.00 వద్ద కదలాడుతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డు స్థాయి వద్ద ట్రేడ్‌ అవుతుండటం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి లాభంతో ట్రేడ్‌ అవుతుండటం దేశీయంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గిస్తున్నాయి. అమెరికా చైనాల మధ్య కుదిరిన తొలి దశ ఒప్పందం ఇరు దేశాల మధ్య

Most from this category