News


సోమవారం వార్తల్లో షేర్లు

Monday 23rd December 2019
Markets_main1577072679.png-30373

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ట్రేడింగ్‌లో ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు

టాటా ‍గ్లోబల్‌ బెవరేజెస్‌:- కంపెనీ ఎండీ, సీఈవోగా సునీల్‌ డిసౌజాను ఎంపిక చేసుకున్నట్లు టాటా గ్రూప్‌ పానీయాల దిగ్గజం టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ తాజాగా పేర్కొంది.

కేఈసీ ఇంటర్నేషనల్‌:- మొత్తం రూ. 1520 కోట్ల విలువైన ఆర్డర్లను తాజాగా సాధించినట్లు విద్యుత్‌ ప్రసారం, పంపిణీ తదితర మౌలిక సదుపాయాల రంగ కంపెనీ కేఈసీ ఇంటర్నేషనల్‌ బీఎస్‌ఈకి వెల్లడించింది. 

బజాజ్‌ కన్జూమర్‌:- కంపెనీ సీఈవోగా జైదీప్‌ నందీను ఎంపిక నియమించుకున్నట్లు ఎఫ్‌ఎంసీజీ రంగ కంపెనీ బజాజ్‌ కన్జూమర్‌ తాజాగా పేర్కొంది. 

కెనరా బ్యాంక్‌:- రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌.. బ్యాంక్‌ దీర్ఘకాలిక రేటింగ్‌ను వాచ్‌ డెవలపింగ్‌గా పేర్కొన్నట్లు పీఎస్‌యూ రంగ సంస్థ కెనరా బ్యాంక్‌ తెలియజేసింది.

ఎన్‌బీసీసీ:-  5.12 ఎకరాల భూమి అభివృద్ధికి వీలుగా ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసుల కోసం బిల్డింగ్‌ ప్రొడక్టుల కంపెనీ హెచ్‌ఐఎల్‌(ఇండియా) నుంచి ఆర్డర్‌ లభించినట్లు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్‌బీసీసీ తాజాగా వివరించింది.

రత్నమణి మెటల్స్‌:- చమురు, గ్యాస్‌ రవాణా ప్రాజెక్ట్‌ కోసం దేశీ కంపెనీ నుంచిరూ. 81 కోట్ల విలువైన కోటెడ్‌ సీఎస్‌ పైపుల సరఫరాకు కాం‍ట్రాక్ట్‌ లభించినట్లు రత్నమణి మెటల్స్‌ తెలియజేసింది. 

పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌:- గుజరాత్‌ గాంధీనగర్‌లోని గిఫ్ట్‌ సిటీలో గల జీఐడీసీ టెక్‌ హబ్‌కు సంబంధించి ఈపీసీ డిజైన్‌, నిర్మాణ కాంట్రాక్టు లభించినట్లు మౌలిక సదుపాయాల సంస్థ పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌ తెలియజేసింది. 



You may be interested

గృహ రుణ బదిలీ తో లాభం ఎంత ..?

Monday 23rd December 2019

తీసుకున్న రుణం ఏ బెంచ్‌మార్క్‌ ఆధారితమో చూడాలి ప్రస్తుతం అమల్లో ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ విధానం  కొత్త విదానంలో పారదర్శకత ఎక్కువ వడ్డీ రేట్ల బదిలీ వేగంగా ఉంటుంది పాత విధానంలో రేట్ల తగ్గింపు ప్రయోజనం తక్కువ నూతన విధానానికి మార్చుకోవాలి తక్కువ రేటుకు ఆఫర్‌ చేసే వేరే సంస్థకు బదిలీ చేసుకోవచ్చు  అరుణ్‌ మిశ్రా (40) ఓ ప్రైవేటు కంపెనీలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌. 2010లో యాక్సిస్‌ బ్యాంకు నుంచి రూ.20 లక్షల రుణాన్ని తీసుకుని నోయిడాలో రూ.37 లక్షల విలువ

నష్టాల ప్రారంభం

Monday 23rd December 2019

హెవీవెయిట్‌ షేరు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీ నష్టంతో ప్రారంభంకావడంతో దేశీయ స్టాక్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 133 పాయింట్లు క్షీణించి 41,548 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 12,235 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. పన్నా, ముక్తా చమురు క్షేత్రానికి సంబంధించి 4.5 బిలియన్‌ డాలర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చెల్లించాల్సివుందని, ఈ నేపథ్యంలో సౌదీ ఆరామ్‌కోతో రిలయన్స్‌ డీల్‌ రద్దును కేంద్ర ప్రభుత్వం కోరడంతో

Most from this category