News


గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 4th July 2019
Markets_main1562213342.png-26777

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు 
మహారాష్ట్ర స్కూటర్స్‌:-
కంపెనీ ఛైర్మన్‌ పదవికి మధుర్‌ బజాజ్‌ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సంజీవ్‌ ఎన్నికయ్యారు. 
మైండ్‌ ట్రీ:- కంపెనీలో 60.06 శాతం వాటాతో ఎల్ అండ్ టి కంపెనీ ప్రమోటర్‌గా వర్గీకరించబడింది.
వేదాంత:- ఇండియాలో 10 ఎక్సప్లోరేషన్‌ బ్లాక్‌లను దక్కించుకుంది 
కేఈపీ గ్లోబల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌:- ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రోడ్యూసర్‌ కేటగరిలో కంపెనీ సామర్థ్యాన్ని అదనంగా 8.827 మెగా వాట్లకు పెంచుకుంది. తద్వారా కంపెనీ మొత్తం సౌర విద్యుత్‌ సామర్థ్య ఉత్పత్తి 26.25 మెగావాట్లకు చేరింది.
ఇండియా హ్యూమ్‌ పైప్‌:- కంపెనీ ధీర్ఘకాలిక బ్యాంకు రుణ సౌకర్యానికి కేర్‌ రేటింగ్‌ సంస్థ రేటింగ్‌ ఎ(+) నుంచి ఎ కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. అలాగే స్థిరత్వం అవుట్‌లుక్‌ కేటాయించింది.
భారతీ ఎయిర్‌టెల్‌:- టెలీసోనిక్‌ లిమిటెడ్‌ను ఆఫ్టికల్‌ ఫైబర్‌ వ్యాపారాన్ని చేజిక్కించుకునేందుకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలిపింది.
ఐబీఆర్‌సీఎల్‌:- కంపెనీ చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసరుగా ఆర్‌ బలరామి రెడ్డి రాజీనామా చేశారు. 
క్రియేటివ్‌ ఐ:- న్యూ వెబ్‌సీరీస్‌ నిర్మాణం ద్వారా డిజిటల్‌ రంగంలోకి అడుపెట్టబోతుంది. 
పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌:- కంపెనీ ధీర్ఘకాలిక బ్యాంకు రుణ సౌకర్యానికి కేర్‌ రేటింగ్‌ సంస్థ రేటింగ్‌ ఎ(+) నుంచి ఎ కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. అలాగే స్థిరత్వం అవుట్‌లుక్‌ కేటాయించింది.
స్టీల్‌ స్ట్రిప్స్‌ వీల్స్‌:- గత నెల్లో మొత్తం అమ్మకాలు 10 శాతం క్షీణతతో 11.28 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి.
యాక్సిస్‌ బ్యాంక్‌:- బ్యాంకు ఫ్రాడ్‌ కేస్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రూ.4.58 కోట్లను అటాచ్‌ చేసింది. 
పీఎస్‌యూ బ్యాంక్‌:- రేపు కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులను ఆదుకునేందుకు భారీ రీక్యాపులైజేషన్‌ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. 
ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌సీఎఫ్‌లు:- బడ్జెట్‌లో భాగంగా ఆర్‌బీఐకు అదనపు రెగ్యూలేటరీ అధికారాలు ఇవ్వచ్చని అంచనా వేస్తున్నారు.
కాక్స్‌ అండ్‌ కింగ్స్‌:- జూన్‌ 30న ఎన్‌సీడీలపై చెల్లించాల్సిన రూ.7.2 కోట్ల రుణాల్ని చెల్లించడంలో విఫలమైంది. 
మెక్‌లాయిడ్‌ రస్సెల్‌:- దీర్ఘకాలికానికి కంపెనీపై రేటింగ్‌ బి(-) నుంచి డి కు డౌన్‌గ్రేడ్‌ చేసింది.
ఖరీఫ్‌ పంటలపై కేబినేట్‌ కనీస మద్దతు ధరకు ఆమోదం తెలిపింది. 
క్రితం వారంలో ఐపీఓ ఇష్యూకు పూర్తి చేసుకున్న ఇండియా మార్ట్‌ షేర్లు నేడు ఎక్చ్సేంజీల్లో లిస్టింగ్‌ కానున్నాయి. You may be interested

తగ్గిన చమురు ధర

Thursday 4th July 2019

అమెరికా చమురు నిల్వలు విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా పడిపోవడంతో అధిక సరఫరా కారణాన చమురు ధరలు గురువారం(జులై 4) స్వల్పంగా నష్టపోయి ట్రేడవుతున్నాయి. గత వారం అమెరికా నిల్వలు 30 లక్షల బ్యారెల్‌ల ఉత్పత్తి పడిపోతుందని అంచనా వేయగా అది 11లక్షల బ్యారల్‌ మాత్రమే ఉందని ఎనర్జీ ఇన్ఫ్‌ర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ తెలిపింది. బెంచ్‌మార్కు బ్రెంట్‌ క్రూడ్‌ ధర 0.4 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 63.60డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌

మరింత పెరిగిన రూపాయి

Thursday 4th July 2019

డాలర్‌ మారకంలో రూపీ గురువారం(జులై 4) ట్రేడింగ్‌లో 9 పైసలు బలపడి 68.82 వద్ద ప్రారంభమైంది. ఈ వారం బడ్జెట్‌ వెలువడనున్న నేపథ్యంలో దేశియ మార్కెట్లు సానుకూలంగా ముగియడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో స్వల్పంగా బలపడి 68.91 వద్ద ముగిసింది. జులై 5 న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడంతో రూపీ స్వల్పంగా బలపడవచ్చని, ప్రభుత్వం బడ్జెట్‌లో ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచుతుందా?లేదా? అనే అంశంపై మదుపర్లు దృష్ఠి పెట్టనున్నారని మోతిలాల్‌

Most from this category