News


సోమవారం వార్తల్లో షేర్లు

Monday 30th December 2019
Markets_main1577677543.png-30512

విభిన్న వార్తల ఆధారంగా నేడు(సోమవారం) పలు కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడయ్యే వీలున్నట్లు స్టాక్‌ మార్కెట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా వార్తలలో నిలుస్తున్న కంపెనీల వివరాలు చూద్దాం.. 

ప్రిన్స్‌ పైప్స్‌
ఈ నెల 18-21 మధ్య పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న ప్రిన్స్‌ పైప్స్‌ అండ్‌ ఫిట్టింగ్స్‌ కంపెనీ నేడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. షేరుకి రూ. 178 ధరలో కంపెనీ ఐవోవోను చేపట్టింది.

పీఐ ఇండస్ట్రీస్‌
ఐసాగ్రో స్పా, అనుబంధ సంస్థల నుంచి ఐసాగ్రో ఏషియా ఆగ్రోకెమికల్స్‌ కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్లు ‍ప్రయివేట్‌ రంగ సంస్థ పీఐ ఇండస్ట్రీస్‌ పేర్కొంది.

అదానీ పోర్ట్స్‌ 
గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌ నుంచి స్నోమన్‌ లాజిస్టిక్స్‌లో 40.25 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ వెల్లడించింది. ఇందుకు రూ. 296 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది.

ఎయిర్‌టెల్‌
ప్రీపెయిడ్‌ కస్టమర్లకు సంబంధించి కనీస రీచార్జీ పథక విలువను ఇటీవలి వరకూ అమలుచేస్తున్న రూ. 23 నుంచి రూ. 45కు పెంచినట్లు మొబైల్‌ సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌ వెల్లడించింది.

పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌
మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) జారీకి బోర్డు అనుమతించినట్లు పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ తెలియజేసింది. తద్వారా రూ. 2750 కోట్లవరకూ సమీకరించనున్నట్లు వివరించింది.

స్కిప్పర్‌ లిమిటెడ్‌
దేశీయంగా తొలిసారి విజయవంతంగా 765 కేవీ S/C మోనోపోల్‌కు సంబంధించి డిజైన్‌, ఫ్యాబ్రికేటెడ్‌, టైప్‌ టెస్టెడ్‌ను అభివృద్ధి చేసినట్లు స్కిప్పర్‌ లిమిటెడ్‌ పేర్కొంది.



You may be interested

2019 బిజినెస్‌ రివైండ్‌: గతుకుల రోడ్డుపై... ఆటో

Monday 30th December 2019

డిమాండ్‌ లేక అమ్మకాలు తగ్గడం మొదలుకుని ప్లాంట్ల మూసివేతలు, ఉద్యోగాల కోతలు, వందల మంది డీలర్ల దివాలా..  కొత్త కాలుష్య ప్రమాణాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల విధానాలు..  ఇలా వివిధ కారణాలు ఆటోమొబైల్‌ పరిశ్రమను తెరిపిన పడనివ్వకుండా చేశాయి. ఎకానమీలో మందగమనం, ధరల పెంపుతో ప్యాసింజర్‌ వాహన విక్రయాలు క్షీణించగా, అధిక నిల్వలు పేరుకుపోయి.. ఫైనాన్స్‌ అవకాశాలు తగ్గిపోయి వాణిజ్య వాహన అమ్మకాలు పడిపోయాయి. ఉద్యోగ కల్పన, డిమాండ్‌ అంతంత మాత్రంగానే

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Monday 30th December 2019

గత శుక్రవారం భారీ ర్యాలీ జరిపిన భారత్‌ స్టాక్‌ సూచీలు శుక్రవారం తిరిగి గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 111 పాయింట్ల లాభంతో 41,686 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 29 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,275 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 

Most from this category