News


ఇండియాపై అండర్‌వెయిట్‌

Thursday 6th February 2020
Markets_main1580971540.png-31560

వృద్ధి మందగమనాన్ని మార్కెట్లు జీర్ణించుకోలేదు
దేశీయ మార్కెట్లలో ఇటీవలి అప్‌మూవ్‌ క్రమంగా ఆవిరవుతుందని మాన్యులైఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సీఐఓ రొనాల్డ్‌ ఛన్‌ అభిప్రాయపడ్డారు. దేశీయ మార్కెట్లు ఇంకా దేశీయ ఎకానమీలో మందగమనాన్ని జీర్ణించుకోలేదని(ప్రైస్‌ఇన్‌) చెప్పారు. క్రెడిట్‌ సమస్యలు, వినిమయ మందకొడితనం, పనిచేయని పాలసీలతో దేశీయ ఎకానమీ 4.5-5 శాతం మధ్యనే ఉండొచ్చని, ఈ స్వల్ప వృద్దిని మార్కెట్‌ ఇంకా ప్రైస్‌ఇన్‌ చేసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్న బలం కేవలం కొన్ని టాప్‌ వెయిటేజ్‌ స్టాకుల ప్రదర్శనా ఫలితమన్నారు. దీనికితోడు కరోనా వైరస్‌ ప్రభావితం చేయని మార్కెట్లలోకి ఇన్వెస్టర్లు నిధులు కుమ్మరించడం కూడా ఇండియా మార్కెట్‌ అప్‌మూవ్‌కు కారణమని వివరించారు.

ఒక్కసారి చైనా మార్కెట్‌ స్థిరీకరణకు వస్తే అప్పుడు ఇండియా వృద్ది మందకొడితనంపై అందరి దృష్టి మరలుతుందని, అప్పుడు దేశీయ మార్కెట్లలో పతనం ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుతానికి ఇండియా మార్కెట్‌పై అండర్‌వెయిట్‌గా ఉన్నట్లు తెలిపారు. భారతీయ పారిశ్రామిక, కన్జూమర్‌ స్టాకులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే దేశీయ ఐటీ, ఫార్మా రంగాలు మాత్రం బలహీన రూపీతో లాభపడతాయని అంచనా వేశారు. మొత్తంమీద మార్కెట్లో నిజ పరిస్థితులపై అవగాహన పెరిగితే పతనం వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. 



You may be interested

రేపు యస్‌బ్యాంక్‌ ఈజీఎం

Thursday 6th February 2020

ప్రైవేటు రంగ రుణదాత యస్‌ బ్యాంక్‌ నిధులు సమీకరణకు సలహాలు సూచనలు ఇచ్చేందుకు కాంటర్‌ ఫిట్జ్‌గెరాల్డ్‌, ఐడీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌, అంబిట​ క్యాపిటల్‌ను ఎంపిక చేసింది. దీనిపై శుక్రవారం(ఫిబ్రవరి 7)న అత్యవసరం సమావేశం(ఈజీఎం) కానుంది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో యస్‌ బ్యాంక్‌ షేరు 3.19 శాతం పెరిగి 38.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  

ధర ఎక్కువయితే 5 జీ స్పెక్ట్రం కొనుగోలు చేయం భారతీ ఎయిర్‌టెల్‌

Thursday 6th February 2020

టెలికం ఆపరేటర్‌ అయిన భారతీ ఎయిర్‌టెల్‌ త్వరలో నిర్వహించనున్న వేలంలో 5జీ స్పెక్ట్రం కొనుగోలు చేయడంలేదని వెల్లడించింది. ట్రాయ్‌ సిఫార్సు చేసిన మెగా హెట్జ్‌ కనీస ధర రూ. 492 కోట్లయితే 5జీ స్పెక్ట్రం కొనబోమని భారతీ ఎయిర్‌ టెల్‌ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భారతీ ఎయిర్‌టెల్‌ షేరు 2.62 శాతం పెరిగి 547.30 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  

Most from this category