News


ఎంఏసీడీ బుల్లిష్‌ ట్రెండ్‌ చూపుతున్న స్టాకులివే!

Tuesday 7th January 2020
Markets_main1578385215.png-30733

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
బుల్లిష్‌ సిగ్నల్స్‌
సోమవారం ముగింపు ప్రకారం 13 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఐటీఐ, గ్రాసిమ్‌, హెచ్‌యూఎల్‌, రామ్‌కో సిమెంట్స్‌, ఐనాక్స్‌ విండ్‌, బోరోసిల్‌ గ్లాస్‌, భారత్‌రోడ్‌ నెట్‌వర్క్‌ తదితరాలున్నాయి.ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 29 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. ఆర్‌ పవర్‌, హెచ్‌పీసీఎల్‌, ఎన్‌ఎండీసీ, లుపిన్‌, జమ్నా ఆటో, ఆప్‌టెక్‌, ఇండియన్‌ హోటల్స్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, నెస్లె ఇండియా తదితరాలు ఈ జాబితాలో ఉన్నాయి. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. You may be interested

వచ్చే కొన్ని వారాలకు 12 స్టాక్‌ సిఫార్సులు

Tuesday 7th January 2020

రెండువారాల వరుస పతనం అనంతరం దురదృష్టవశాత్తూ సూచీలు ఈ వారాన్ని కూడా నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మధ్యప్రా‍చ్య దేశాల్లో చెలరేగిన రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు సూచీలను నష్టాల వైపు నడిపించాయి. మార్కెట్లో కొనసాగుతున్న ఈ దిద్దుబాటు చర్య షేరు కొనుగోళ్లకు మంచి తరుణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో అధిక రాబడులను ఇచ్చే 12స్టాకులను వారు సిఫార్సు చేస్తున్నారు.  షేరు పేరు :- ఓఎన్‌జీసీ రేటింగ్‌:- కొనవచ్చు టార్గెట్‌ ధర:- రూ.140 స్టాప్‌

సబ్‌ ఎడిటర్లు కావలెను

Tuesday 7th January 2020

సాక్షి పత్రిక అనుబంధ బిజినెస్‌ వెబ్‌సైట్‌ "బిజినెస్‌@ సాక్షి డాట్‌ కామ్‌‌"లో పనిచేసేందుకు సబ్‌ ఎడిటర్లు/సీనియర్‌ సబ్‌ ఎడిటర్లు కావలెను. మీడియా సంస్థల్లో, న్యూస్‌ వెబ్‌సైట్లలో బిజినెస్‌ విభాగంలో సబ్ ఎడిటర్లుగా, కనీసం రెండు నుంచి మూడు సంవత్సరాలు సబ్‌ ఎడిటర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. బిజినెస్‌, ఎకానమీ, ఫైనాన్షియల్‌ మార్కెట్లపై అవగాహన కలిగి ఉండాలి. ఇంగ్లీషు నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేషన్ బాగా చేయగలగాలి.  30 సంవత్సరాల లోబడిన వయసు కలిగిన అర్హులైన అభ్యర్థులు

Most from this category