News


నష్టాల మా‍ర్కెట్లోనూ ఈ షేర్లు రయ్‌రయ్‌

Monday 6th January 2020
Markets_main1578287466.png-30698

డిష్‌మన్‌ కార్బొజెన్‌
టైటన్‌ కంపెనీ
సవేరా ఇండస్ట్రీస్‌
ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 448 పాయింట్లు పతనమైంది. 41,016కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 140 పాయింట్లు దిగజారి 12,087 వద్ద ట్రేడవుతోంది. అయితే విభిన్న వార్తల కారణంగా పతన మార్కెట్లోనూ కొన్ని కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో బ్లూచిప్‌ కంపెనీ టైటన్‌తోపాటు.. ఫార్మా మిడ్‌ క్యాప్‌ డిష్‌మన్‌ కార్బొజెన్‌ ఎమిక్స్‌, స్మాల్‌ క్యాప్‌ సవేరా ఇండస్ట్రీస్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌(ఐవోబీ) చోటు సాధించాయి. వివరాలు చూద్దాం..

డిష్‌మన్‌ కార్బొజెన్‌ ఎమిక్స్‌
ఇటీవల ఆదాయపన్ను శాఖ సోదాల నేపథ్యంలో పతన బాటలో సాగిన డిష్‌మన్‌ కార్బొజెన్‌ ఎమిక్స్‌ కౌంటర్‌కు తాజాగా డిమాండ్‌ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో  ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 3.15 ఎగసి రూ. 67.05 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. కంపెనీ తాజాగా సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌) ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చింది. ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ అంశాన్ని పరిశీలించేందుకు బోర్డు ఈ నెల 16న సమావేశంకాన్నుట్లు తెలియజేసింది. దీంతో ఈ కౌంటర్‌ జోరందుకున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీనికితోడు ఆదాయపన్ను శాఖ సోదాల కారణంగా గతవారం 52 వారాల కనిష్టాన్ని తాకడంతో ట్రేడర్ల షార్ట్‌కవరింగ్‌ సైతం జత కలసినట్లు తెలియజేశారు. 

టైటన్‌ కంపెనీ
వాచీలు, జ్యువెలరీ తదితర లైఫ్‌స్టైల్‌ ప్రొడక్టుల టాటా గ్రూప్‌ రిటైలింగ్‌ సంస్థ టైటన్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. దీంతో ఈ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టైటన్‌ షేరు 2.3 శాతం లాభపడి రూ. 1166 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1171ను సైతం అధిగమించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో జ్యువెలరీ బిజినెస్‌ 11 శాతం పుంజుకోగా, రిటైల్‌ విభాగం 15 శాతం వృద్ధిని చూపినట్లు కంపెనీ తెలియజేసింది. ఇక పరిమళాల బిజినెస్‌ 20 శాతంపైగా పురోగమించినట్లు వెల్లడించింది. కాగా.. ఏడాది కాలంలో టైటన్‌ షేరు 24 శాతం ర్యాలీ చేయడం విశేషం!

ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 4360 కోట్లమేర తాజా పెట్టుబడులను అందుకున్నట్లు ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌ తెలియజేసింది. ప్రిఫరెన్షియల్‌ ఈక్విటీ షేర్ల జారీ ద్వారా ఈ నిధులను సమకూర్చుకున్నట్లు వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐవోబీ షేరు 5 శాతం జంప్‌చేసింది. రూ. 11.65 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 12.15 వద్ద గరిష్టాన్ని తాకింది.

సవేరా ఇండస్ట్రీస్‌
తమిళనాడులోని కూనూర్‌లో ఆస్తుల కొనుగోలుకి ప్రణాళికలు ప్రకటించడంతో ట్రావెలింగ్‌ సర్వీసుల కంపెనీ సవేరా ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. బీఎస్‌ఈలో ఈ షేరు ప్రస్తుతం 2 శాతం లాభపడి రూ. 47 వద్ద ట్రేడవుతోంది. తొలుత 18 శాతం దూసుకెళ్లి రూ. 54.35ను తాకింది. కాగా.. కాంచీపురంలోని కోకో బీచ్‌వద్ద గల ప్రాపర్టీని విక్రయించే ప్రతిపాదనలో ఉన్నట్లు సవేరా ఇండస్ట్రీస్‌ తెలియజేసింది. ఈ అంశాలపై చర్చించేందుకు ఈ నెల 16న బోర్డు సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొంది. 



You may be interested

జనవరి సీరిస్‌లో ఓఐ పెరిగిన స్టాకులివే!

Monday 6th January 2020

గత సీరిస్‌తో పోలిస్తే జనవరి డెరివేటివ్‌ సీరిస్‌లో ఓపెన్‌ఇంట్రెస్ట్‌(ఓఐ)లో భారీ మార్పులు వచ్చిన షేర్ల వివరాలు ఇలా ఉన్నాయి... 1. జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌: జనవరి సీరిస్‌లో ఓఐ 35.8 శాతం, షేరు ధర 5.4 శాతం పెరిగింది. ఫుడ్‌టెక్‌ యాప్స్‌ నుంచి పోటీ తగ్గుతోంది. ఈ యాప్స్‌కు రెస్టారెంట్ల డీలిస్టింగ్‌తో ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే కమీషన్ల విషయంలో కూడా పొసగడం లేదు. దీంతో వీటి నుంచి కంపెనీకి పోటీ తగ్గింది. ఇది

‘బేర్‌’మంటున్న బ్యాంకు నిఫ్టీ

Monday 6th January 2020

సోమవారం ఆరంభ ట్రేడింగ్‌లో బ్యాంకునిఫ్టీ భారీగా నష్టపోయింది. 31,910.45 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ఆరంభమైన బ్యాంకునిఫ్టీ 31,914.45పాయింట్ల హైని నమోదు చేసి వెనువెంటనే పతనం కావడం ఆరంభించింది. ఉదయం 9.45 నిమిషాల సమయానికి 31,487.10 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 1. 53 శాతం నష్టంతో 31579 పాయింట్ల వద్ద కదలాడుతోంది. సూచీలో వెయిటేజ్‌ ఉన్న బ్యాంకు స్టాకులన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. సూచీలో అత్యధికంగా పీఎన్‌బీ, బీఓబీ, ఎస్‌బీఐలు 3

Most from this category