News


మాంద్యాన్ని మార్కెట్‌ ఎక్కువకాలం ఎదుర్కోలేదు!

Thursday 29th August 2019
Markets_main1567071241.png-28094

ఆర్థిక మందగమ ప్రభావాన్ని దీర్ఘకాలం ఎదుర్కోనే సామర్థ్యం స్టాకుల లేదని ప్రముఖ అనలిస్టు రోనోజోయ్ మజుందార్ అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌ మూడురోజుల లాభాలకు బుధవారం బ్రేక్‌ పడింది. గతనెలలో దేశ ఆర్థిక కార్యకలాపాల్లో బలహీనత పెరిగిందన్న వార్తలు మార్కెట్‌ను కుంగదీశాయి. ఈ నేపథ్యంలో ఎకానమీ, మార్కెట్లు తదితర అంశాలపై ఆయన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...

మందగించిన ఆర్థిక వృద్ధిని ఉత్తేజపరిచేందుకు గత శుక్రవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ప్రకటించిన ఉద్దీపన చర్యల ప్రభావంపై పలు సందేహాలను తలెత్తుతున్నాయి. ఒకవేళ శుక్రవారం వెలువడనున్న దేశీయ జీడీపీ గణాంకాలు బలహీనంగా నమోదైనప్పటికీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జీడీపీ వృద్ధి 6శాతానికి కంటే దిగువన నమోదైనట్లైతే... మరిన్ని ఉద్దీపన చర్యలతో ముందుకు రావాలని ప్రభుత్వంపై ఒత్తిడి ఏర్పడటంతో పాటు ఆర్‌బీఐ కూడా వడ్డీరేట్లపై తగ్గించాల్సి వుంటుంది. ఇప్పటికే ఆర్‌బీఐ తొమ్మిదేళ్లలో కనిష్ట స్థాయికి వడ్డీరేట్లను తగ్గించింది. ఇకపై మరింత తగ్గించేందుకు సిద్ధంగా ఉన్న సంకేతాలు ఇస్తోంది.

ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన ఉద్దీపన చర్యలు సమీప కాలంలో డిమాండ్‌ పెంచేందుకు సరిపోకపోవచ్చని జెఫర్రీస్‌, ఎడెల్వీజ్‌ లాంటి బ్రోకరేజ్‌ సంస్థలు సైతం అభిప్రాయపడుతున్నాయి. అంటే దేశీయ ఆర్థిక మందగమన​ ప్రభావం రానున్న రోజుల్లో స్టాకులు, రూపాయిపై మరింత ఒత్తిడిని కొనసాగిస్తుంది. ఇప్పటికే రూపాయి ఆసియా కరెన్సీ విలువల్లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభమయ్యాక ఐదేళ్లలో త్రైమాసిక వృద్ధి మందగించినట్లు జూన్‌లో గణాంకాలు చూపాయి. అలాంటి అధ్వాన్న గణాంకాలు చూపించిన తరువాత ట్రేడింగ్ రోజు జూన్ 3న ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ ఇండెక్స్ రికార్డు స్థాయిలో ర్యాలీ చేసింది. ఈ ర్యాలీ అనంతరం సరిగ్గా నెలరోజులకు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. బడ్జెట్‌లో డిమాండ్‌ను పెంచేందుకు కొన్ని ప్రతిపాదినలున్నప్పటికీ, విదేశీ ఫండ్లపై పన్ను విధింపుతో ఇండెక్స్‌ భారీ పతనం ప్రారంభమైంది. ఈ ఏడాదిలో 19 రంగాల సూచీలకు గానూ 14రంగ సూచీలు పతనాన్ని చవిచూశాయి. మిగిలిన ఐదు రంగాల్లో ఐటీ రంగం మంచి పనితీరు కనబరిచింది.



You may be interested

ఈ లార్జ్‌క్యాప్స్‌ ఆకర్షణియం!

Thursday 29th August 2019

దేశియ బెంచ్‌మార్క్‌ సూచీలు జూన్  2019 లో నమోదుచేసిన రికార్డు స్థాయి గరిష్ఠాల నుంచి 6-8 శాతం పడిపోయాయి. అన్నిటికన్నా స్మాల్‌, మిడ్‌ క్యాప్స్‌కు చెందిన స్టాకులు భారీగా నష్టపోవడాన్ని గమనించవచ్చు. ప్రస్తుతం లార్జ్‌ క్యాప్‌లలో కూడా చాలా వరకు స్టాకులు డిస్కౌంట్‌లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ ఎస్‌ అండ్‌ పీ లార్జ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లో 27 స్టాకులు వరకు వాటి 52 వారాల గరిష్ఠ స్థాయి నుంచి 10-30 శాతం

రెండు రోజుల పాటు మార్కెట్‌లో అమ్మకాల వెల్లువ?

Thursday 29th August 2019

బ్రోకరేజిలు, క్లయింట్ల ఖాతాలలోని షేర్లను   బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు)లలో తనాఖా పెట్టి మూలధనాన్ని సమకూర్చుకోడాన్ని, ట్రేడింగ్‌ ఖాతాదారులకు పాక్షికంగ చెల్లించినా.. స్టాకులు కేటాయించడాన్ని నిలుపుదల చేస్తూ సెబి జారీ చేసిన కొత్త నిబంధనలు వచ్చే నెల1 నుంచి  అమల్లోకి రానున్నాయి. ఈ గడువు తేదీని పొడిగించాలని బ్రోకర్స్‌ సెబీని కొరినప్పటికి,  సెబీ వారి విజ్ఞప్తులను తోసిపుచ్చింది. ఫలితంగా సెప్టెంబర్‌ 1లోపు బ్రోకర్స్‌ తప్పనిసరిగా రూ.

Most from this category