STOCKS

News


నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు రయ్‌

Friday 3rd January 2020
Markets_main1578027281.png-30643

ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌
టీసీఎస్‌ లిమిటెడ్‌
ఓఎన్‌జీసీ లిమిటెడ్‌

కార్డ్స్‌ కేబుల్‌ ఇండస్ట్రీస్‌

ఇరాక్‌లోని బాగ్దాద్‌ విమానాశ్రయం వద్ద అమెరికా చేపట్టిన వైమానిక దాడులలో ఇరాన్‌, ఇరాక్‌లకు చెందిన ప్రముఖ వ్యక్తులు మరణించినట్లు వెలువడిన వార్తలు ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో అమెరికా స్టాక్‌ ఫ్యూచర్స్‌ బలహీనపడగా.. దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం నేలచూపులతో ప్రారంభమై నీరసంగా కదులుతున్నాయి. ఉదయం 10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 113 పాయింట్లు క్షీణించి 41,514ను తాకగా.. నిఫ్టీ 42 పాయింట్ల నష్టంతో 12,240 వద్ద ట్రేడవుతోంది. కాగా.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో దేశీయంగా ఆయిల్‌ అండ్‌ నేచురల్‌గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఈ బాటలో కొన్ని ఇతర కౌంటర్లు వార్తల ఆధారంగా నష్టాల మార్కెట్లోనూ జోరు చూపుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఓఎన్‌జీసీ లిమిటెడ్‌
విదేశీ మార్కెట్లో చమురు ధరలు జోరందుకోవడంతో ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్‌జీసీ షేరు బలపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 2.5 శాతం పుంజుకుని రూ. 131 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 133 వరకూ ఎగసింది. ఇంధన శాఖ నిర్వహించిన నాలుగో రౌండు వేలంలో భాగంగా కంపెనీ ఏడు చమురు, గ్యాస్‌ బ్లాకులను సొంతం చేసుకున్నట్లు వెలువడిన వార్తలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వీటిలో ఐదు బ్లాకులను మధ్యప్రదేశ్‌ నుంచి గెలుపొందినట్లు తెలుస్తోంది. కాగా.. మరోపక్క అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ గతంలో ఇచ్చిన న్యూట్రల్‌ రేటింగ్‌ను తాజాగా బయ్‌కు సవరించింది. అయితే టార్గెట్‌ ధరను రూ. 225 నుంచి రూ. 175కు తగ్గించడం గమనార్హం.

టీసీఎస్‌ లిమిటెడ్‌
సాఫ్ట్‌వేర్‌ సేవల టాటా గ్రూప్‌ దిగ్గజం టీసీఎస్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ నష్టాల మార్కెట్లోనూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల టాటా గ్రూప్‌ కౌంటర్లు జోరు చూపుతుండటం, తాజాగా డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడటం వంటి అంశాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టీసీఎస్‌ షేరు 2.5 శాతం లాభంతో రూ. 2210 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2223 వరకూ బలపడింది.

ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌
సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ రాకేష్‌ జున్‌జున్‌వాలా కంపెనీలో పెట్టుబడులకు దిగినట్లు వెలువడిన వార్తలు ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెంచాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 47 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ఈ కౌంటర్లో 6 లక్షలకుపైగా పెండింగ్‌ ఆర్డర్లున్నట్లు మార్కెట్‌వర్గాలు తెలియజేశాయి. రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ గురువారం బల్క్‌ డీల్‌ ద్వారా ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌కు చెందిన 27,84,879 షేర్లను కొనుగోలు చేసినట్లు బీఎస్‌ఈ డేటా వెల్లడించింది. షేరుకి రూ. 42.83 సగటు ధరలో వీటిని దాదాపు రూ. 12 కోట్లు వెచ్చించడం ద్వారా రాకేష్‌ సంస్థ రేర్‌ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కార్డ్స్‌ కేబుల్‌ ఇండస్ట్రీస్‌
జపనీస్‌ ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీ అండ్‌ కాంట్రాక్టింగ్‌ కంపెనీ నుంచి ప్రొడక్టులకు అనుమతి(అప్రూవల్‌) లభించినట్లు కార్డ్స్‌ కేబుల్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా పేర్కొంది. దీంతో జపనీస్‌ కంపెనీకి ప్రొడక్టులను సరఫరా చేసేందుకు వీలుగా ఇకపై బిడ్డింగ్‌లో పాల్గొనే వీలుచిక్కినట్లు తెలియజేసింది. కంపెనీ ఆయిల్‌, గ్యాస్‌, పెట్రోకెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌ తదితర రంగాలకు విద్యుత్‌ సంబంధ కేబుళ్లను సరఫరా చేస్తుంటుంది. కంపెనీలో ప్రమోటర్లకు 51.58% వాటా ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కార్డ్స్‌ కేబుల్‌ షేరు 4.2 శాతం జంప్‌చేసి రూ. 45 వద్ద ట్రేడవుతోంది.You may be interested

ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్ల పతనం

Friday 3rd January 2020

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు పెరగడంతో, బీపీసీఎల్‌ వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండకపోవచ్చని ప్రభుత్వ ఉన్నధికారి ఒకరి చెప్పడంతో దేశీయంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే నష్టాల్లో బాట పట్టాయి. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు 3శాతం నష్టపోగా, ఐఓసీ మాత్రం​ అరశాతం దాకా నష్టపోయింది.   శుక్రవారం వేకువజామున అమెరికా జరిపిన దాడిలో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మృతిచెందారు. రాకెట్ దాడిలో ఇరాన్‌

ఇంట్రాడే మార్జిన్లకు చెల్లుచీటి!

Friday 3rd January 2020

పూర్తి మార్జిన్‌ ఉంచాలని ఎక్చేంజ్‌ల ఆదేశాలు భారీగా తగ్గనున్న వాల్యూంలు చిన్న బ్రోకరేజ్‌ల కనుమరుగు తప్పదంటున్న నిపుణులు ట్రేడర్లలో బాగా పాపులరైన ఇంట్రాడే ట్రేడింగ్‌లో స్వల్పమార్జిన్ల కాలం ముగిసిపోతోంది. స్టాక్‌ లేదా డెరివేటివ్‌ విలువ లేదా మార్జిన్‌లో కొంత మొత్తం ఉంచి ఇంట్రాడేలో ట్రేడింగ్‌ చేసుకునే వెసులుబాటు ఇప్పటివరకు ఉంది. కానీ ఇకపై స్టాక్‌ లేదా డెరివేటివ్‌ విలువ లేదా మార్జిన్‌ మొత్తం ఉంటేనే క్లయింట్లను ఇంట్రాడే ట్రేడింగ్‌కు అనుమతించాలని ఎక్చేంజ్‌లు బ్రోకర్లను ఆదేశించాయి.

Most from this category