News


వాల్యూ ఇన్వెస్టర్లు ఏం కొన్నారు? ఏం అమ్మారు?

Friday 12th July 2019
Markets_main1562920741.png-27020

జూన్‌ త్రైమాసికంలో వాల్యూ ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోల్లో కొన్ని మార్పులు చేశారు. మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ కారణంగా జూన్‌ త్రైమాసికంలో చాలామంది వాల్యూ ఇన్వెస్టర్ల పోర్టుఫోలియోలు నష్టాల్లోకి మారాయి. మార్కెట్లు ఆశించినట్లు ప్రీ బడ్జెట్‌ లేదా పోస్ట్‌ బడ్జెట్‌ ర్యాలీ రాలేదు. దీంతో ఇందుకనుగుణంగా వాల్యూ ఇన్వెస్టర్లు తమ పోర్టుఫోలియోలను సర్దుబాటు చేశారు.
- డాలీఖన్నా: రెయిన్‌ఇండస్ట్రీస్‌లో వాటాను 2.22 శాతం నుంచి 3.82 శాతానికి పెంచుకుంది. రాడికో ఖైతాన్‌లో వాటాను 1.41 శాతం నుంచి 1.13 శాతానికి తగ్గించుకుంది. డాలీఖన్నాకు వాటాలున్న పలు కంపెనీలు ఇంకా తమ జూన్‌ త్రైమాసిక వాటాదారుల వివరాలను ప్రకటించలేదు.
- రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా: క్రిసిల్‌, ఫోర్టిస్‌ల్లో వాటాల్లో ఎలాంటి మార్పులేదు. ప్రకాశ్‌ పైప్స్‌లో కొత్తగా వాటాలు తీసుకున్నారు.
- ఆశిష్‌ కచోలియా: డీఎఫ్‌ఎం ఫుడ్స్‌లో వాటాను 1.89 శాతం నుంచి 2.23 శాతానికి పెంచుకున్నారు. మోల్డ్‌టెక్‌ ప్యాకేజింగ్‌ తదితర కంపెనీల్లో వాటాలను కదిలించలేదు. 
- ఆశిష​ ధావన్‌, కుమార్‌ గోయల్‌కు చెందిన పోర్టుఫోలియోల్లో భారీ మార్పులు కానరాలేదు. 

 



You may be interested

టాటా మోటర్స్‌ రికవరీ

Friday 12th July 2019

టాటా మోటర్స్‌ కంపెనీ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. నేడు ఈ కంపెనీ షేర్లు రూ.156.40ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ అమ్మకాలు జూన్‌లో  5శాతం క్షీణించినట్లు కంపెనీ గురువారం ప్రకటించింది. దీంతో నేటి ఉదయం మార్కెట్‌ ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనై దాదాపు 2శాతం నష్టపోయి రూ.153.95ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మార్కెట్‌ రివకరిలో భాగంగా షేర్లు తిరిగి లాభాల్లో

క్వెస్‌ కార్ప్‌ 18శాతం ర్యాలీ

Friday 12th July 2019

అమెజాన్‌ కంపెనీకి 7.5లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలపడంతో క్వెస్‌ కార్ప్‌ షేర్లు శుక్రవారం 18శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌లో క్వెస్‌ కార్ప్‌ షేర్లు రూ.445.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రిఫరెన్షియల్‌ బేసిస్‌ పద్ధతిలో అమెజాన్‌ కంపెనీకి ప్రతి ఈక్విటీ షేరు రూ.676 చొప్పున మొత్తం 754,437 షేర్లును రూ.51 కోట్లకు విక్రయించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు క్వెస్‌ కార్ప్‌ నేడు ఎక్చ్సేంజీలకు సమాచారం తెలిపింది. ఇష్యూలో

Most from this category