News


ఈ షేర్లు 52 వారాల గరిష్టం

Thursday 30th January 2020
Markets_main1580363456.png-31330

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రకటించనుండటం, జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. దీనికితోడు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా వైరస్‌పై అంతర్జాతీయంగా నేడు అత్యయిక పరిస్థితి(ఎమర్జెన్సీ)ని ప్రకటించనున్నట్లు వెలువడిన వార్తలు సైతం ఆందోళనలు పెంచాయి. దీంతో  ఒక్కరోజులోనే తిరిగి ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెరతీశారు. ఫలితంగా నేలచూపులతో ప్రారంభమైన మార్కెట్లు తదుపరి మరింత నీరసించాయి. ఉదయం 11 ప్రాంతంలో సెన్సెక్స్‌ 222 పాయింట్లు క్షీణించి 40,977ను తాకింది. తద్వారా 41,000 పాయింట్ల దిగువకు చేరింది. ఇక నిఫ్టీ సైతం 66 పాయింట్లు తక్కువగా 12,063 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ కొన్ని కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడం ద్వారా 52 వారాల గరిష్టాలను తాకుతుంటే.. మరికొన్ని కౌంటర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. వెరసి 52 వారాల కనిష్టాలకు చేరుతున్నాయి. వివరాలు చూద్దాం..

హుషారుగా
ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం అలెంబిక్‌ లిమిటెడ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బెర్జర్‌ పెయింట్స్‌, డీఎఫ్‌ఎం ఫుడ్స్‌, ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌, హిందుజా గ్లోబల్‌, ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌, ఐఆర్‌సీటీసీ, జూబిలెంట్‌ ఇండస్ట్రీస్‌, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌, లారస్‌ లేబ్స్‌, ఇన్ఫో ఎడ్జ్‌, నియోజెన్‌ కెమికల్స్‌, ఓరియంట్‌ రిఫ్రాక్టరీస్‌, ఓఎండీసీ, పిడిలైట్‌, రిలాక్సో, టాటా ఇన్వెస్ట్‌మెంట్‌, వైభవ్‌ గ్లోబల్‌ ఏడాది గరిష్టాలను అందుకున్నాయి.

నేలచూపులతో
 ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 52 వారాల కనిష్టాలను తాకిన షేర్ల జాబితాలో సీబీఎస్‌ బ్యాంక్‌, డీక్యూ, కాక్స్‌అండ్‌ కింగ్స్‌, ఫ్యూచర్‌ సప్లై, గ్లోబల్‌ ఆఫ్‌షోర్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, ఎంపీఎస్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ హోమ్‌, సికాల్‌ లాజిస్టిక్స్‌, థామస్‌ కుక్‌ ఇండియా, టచ్‌ఉడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, వైశాలీ ఫార్మా, వెల్‌స్పన్‌ ఇండియా చోటుచేసుకున్నాయి.You may be interested

యస్‌బ్యాంక్‌ 6 శాతం క్రాష్‌

Thursday 30th January 2020

‘‘ నెగిటివ్‌ వాచ్‌’’ కొనసాగింపుతో అమ్మకాలు యస్‌బ్యాంక్‌ బ్యాంక్‌ షేరు గురువారం ఉదయం ట్రేడింగ్‌లో 5శాతం నష్టాన్ని చవిచూసింది. ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ బ్రోకరేజ్‌ సంస్థ గతంలో ఇచ్చిన నెగిటివ్‌ వాచ్‌తో కూడిన ధీర్ఘకాలిక రేటింగ్‌ ‘‘ఎ’’ను కొనసాగించడంతో పాటు స్వల్పకాలికి కేటియించిన A1 రేటింగ్‌ను ఉపసంహరించుకునట్లు బుధవారం యస్‌బ్యాంక్‌ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఫలితంగా నేడు బీఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు మునుపటి ముగింపు(రూ.41.20)తో పోలిస్తే 1శాతం నష్టంతో

యాపిల్‌ ... భారత్‌ జీడీపీలో సగం!

Thursday 30th January 2020

1.42 లక్షల కోట్ల డాలర్లకు చేరిన యాపిల్‌ విలువ భారత్‌ స్టాక్‌ మార్కెట్‌ మొత్తం విలువలో ఇది సగానికికంటే ఎక్కువ అదరగొట్టే త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన యాపిల్‌ సంస్థ నూతన రికార్డులు సృష్టిస్తోంది. బుధవారం ట్రేడింగ్‌లో షేరు ఆల్‌టైమ్‌ హై 327.25 డాలర్లను చేరింది. దీంతో కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ 1.42 లక్షల కోట్ల డాలర్లను దాటింది. ఇది భారత ఎకానమీ విలువలో దాదాపు సగానికి సమానం. 2020 అంచనాల ప్రకారం భారత

Most from this category