News


ఈ వారం స్టాక్స్‌ రికమెండేషన్లు

Monday 11th November 2019
Markets_main1573441965.png-29485

ఇంజినీర్స్‌ ఇండియా    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: రిలయన్స్‌ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.106
టార్గెట్‌ ధర: రూ.157

ఎందుకంటే: ఈ ప్రభుత్వ రంగ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో నిలకడైన పనితీరు సాధించింది. ఆదాయం 6 శాతం వృద్ధి చెంది రూ.720 కోట్లకు పెరిగింది. కన్సల్టెన్సీ విభాగం ఆదాయం 7 శాతం, టర్న్‌కీ ప్రాజెక్ట్‌ విభాగం ఆదాయం 6 శాతం చొప్పున పెరిగాయి. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు కారణంగా నికర లాభం 53 శాతం ఎగసి రూ.150 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 17 శాతం వృద్ధితో రూ.1,110 కోట్లకు, నిర్వహణ లాభ మార్జిన్‌ 1.35 శాతం వృద్ధితో 14.8 శాతానికి పెరిగాయి. అయితే ఈ సెప్టెంబర్‌ నాటికి కంపెనీ ఆర్డర్ల బుక్‌ 4 శాతం తగ్గి రూ,.11,000 కోట్లకు చేరింది. పెట్రో రిఫైనరీలు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఉన్న ప్లాంట్లను విస్తరించడానికి కూడా ప్రయత్నాలు చేస్తుండటంతో రానున్న క్వార్టర్లలో ఆర్డర్ల బుక్‌ భారీగానే పెరగగలదని అంచనా వేస్తున్నాం. కన్సల్టెన్సీ సెగ్మెంట్‌ జోష్‌తో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,800  కోట్ల మేర ఆర్డర్లు రాగలవని భావిస్తున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కన్సల్టెన్సీ మార్జిన్లు 25-30 శాతం రేంజ్‌లో, టర్న్‌ కీ ప్రాజెక్ట్‌ విభాగం మార్జిన్‌ 5 శాతం, ఆదాయం 15-20 శాతం మేర పెరగగలవని కంపెనీ అంచనా వేస్తోంది.  హైడ్రోకార్బన్‌ కన్సల్టెన్సీ రంగంలో అగ్రస్థానంలో ఉండటం, రాబడి నిష్పత్తులు మెరుగుపడుతుండటం, భారీ ఆర్డర్లు దక్కే అవకాశాలుండటం, నగదు నిల్వలు పుష్కలంగా ఉండటం, ఎలాంటి రుణ భారం లేకపోవడం, గత రెండేళ్లలో 50 శాతం మేర డివిడెండ్‌లు చెల్లింపులు జరపడం....ఇవన్నీ సానుకూలాంశాలు. ఆయిల్‌, గ్యాస్‌ రంగంలో మూలధన పెట్టుబడులు తక్కువగా ఉండటం, టర్న్‌ కీ ప్రాజెక్ట్‌ విభాగం మార్జిన్లు అంచనాల కంటే తక్కువగా ఉండటం... ప్రతికూలాంశాలు. 


బీపీసీఎల్‌    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 
ప్రస్తుత ధర: రూ.502
టార్గెట్‌ ధర: రూ.632

ఎందుకంటే: ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ, బీపీసీఎల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఈ క్యూ2లో రూ.2,790 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించింది. స్థూల రిఫైనరీ మార్జిన్‌ (జీఆర్‌ఎమ్‌-ఒక్కో బ్యారెల్‌ చమురును ఇంధనంగా మార్చినందువల్ల లభించే లాభం) 3.8 డాలర్లుగా ఉంది. ముడి చమురును అధిక ధరకు కొనుగోలు చేయడం, భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌)-6 ఇంధన తయారీ, డైవర్సిఫికేషన్‌  నిమిత్తం అప్‌గ్రేడ్‌ కోసం కోచి రిఫైనరీని కొన్ని రోజుల పాటు మూసివేయడం వంటి కారణాల వల్ల జీఆర్‌ఎమ్‌ తగ్గింది. అయితే మార్కెటింగ్‌ మార్జిన్‌ ఒక్కో లీటర్‌కు 11 శాతం వృద్ధితో రూ.4.8 కు పెరిగింది. పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు 2 శాతం మేర పెరిగాయి. కోచి రిఫైనరీ అప్‌గ్రెడేషన్‌ కారణంగా భవిష్యత్తులో జీఆర్‌ఎమ్‌ ఒక డాలర్‌ మేర పెరగనున్నది. బీఎస్‌-సిక్స్‌ ఇంధన తయారీ నిమిత్తం అప్‌గ్రేడ్‌ చేయడం కోసం ఈ ఏడాది నవంబర్‌-డిసెంబర్‌ కాలంలో ముంబై రిఫైనరీని కొన్ని రోజులు మూసివేయనున్నది. వచ్చే ఏడాది జనవరి నుంచి బీఎస్‌-6 ఇంధనాన్ని సరఫరా చేయడానికి ఈ కంపెని సిద్ధమవుతోంది. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ఈ కంపెనీలో కొంత వాటాను  అంతర్జాతీయ దిగ్గజ కంపెనీకి విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. పెట్టుబడుల ప్రణాళిక షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రూ.4,300  కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది. కంపెనీ మూలధన పెట్టుబడుల ప్రణాళికలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,000 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.12,500 కోట్లుగా ఉన్నాయి. You may be interested

అప్పు చేసి కారు కొనచ్చా..?

Monday 11th November 2019

ప్ర: నేను ఇప్పటికే మిడ్, లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశాను. స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈ ఫండ్స్‌ల్లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో 12-13 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. నాది సరైన మదుపు వ్యూహమేనా ? -ఇంతియాజ్‌, ఈ మెయిల్‌ ద్వారా  జ: పదేళ్లకు మించి ఇన్వెస్ట్‌ చేయడానికి మ్యూచువల్‌ ఫండ్స్‌ మంచి సాధనాలు. మీరు ఇప్పటికే మిడ్‌, లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారు. కాబట్టి స్మాల్‌

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కంపెనీలు

Monday 11th November 2019

కోల్‌ ఇండియా, హిందాల్కో, బ్రిటినియా ఇండస్ట్రీస్‌, మదర్‌సన్‌ సుమి సిస్టమ్స్‌, ఆయిల్‌ ఇండియా, పంజాజ్‌ సింధ్‌ బ్యాంక్‌, మెట్రోపాలిన్‌ హెల్త్‌కేర్‌, శ్రేయా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌, ఎస్‌జేవీఎన్‌, గుజరాత్‌ ఇండస్ట్రీస్‌ పవర్‌, ఇండియన్‌ హోటల్స్‌, ఆస్ట్రాజెనికా ఫార్మా, ఆర్బన్‌ ఆఫ్‌షోర్స్‌, బలరాంపూర్ చినిమిల్స్‌, శంకర్‌ బిల్డింగ్‌ ప్రాడెక్ట్స్‌, జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌, బాంబే డైయింగ్‌, ఇండియా సిమెంట్స్‌, ఎన్‌హెచ్‌పీసీ, అదానీ పోర్ట్స్‌, మహానగర్‌ గ్యాస్‌ కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక

Most from this category