News


ఈ వారం స్టాక్‌ రికమెండేషన్స్‌

Monday 30th September 2019
Markets_main1569816350.png-28617

ఏషియన్‌ పెయింట్స్‌     కొనచ్చు 
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.1,776
టార్గెట్‌ ధర: రూ.1,950

ఎందుకంటే:- కార్పొరేట్‌ ట్యాక్స్‌ను  33 శాతం నుంచి 25.2 శాతానికి కేంద్రం తగ్గించడం ఈ కంపెనీకి బాగా ప్రయోజనం చేకూర్చే అంశమే. ఈ పన్ను కోత కారణంగా ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరంలోనూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ చెరో 12 శాతం చొప్పున పెరగనున్నది. డెకరేటివ్‌ పెయిం‍ట్స్‌ సెగ్మెంట్లో ముఖ్యంగా ప్రీమియమ్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ పుంజుకోగలదని భావిస్తున్నాం. ఈ సెగ్మెంట్లో 53 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉన్నది ఈ కంపెనీయే. దేశవ్యాప్తంగా 55,000 మంది డీలర్లతో పటిష్టమైన పంపిణీ నెట్‌వర్క్‌ ఈ కంపెనీకి ఉంది. మన దేశంలో తలసరి పెయింట్‌ వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ అమ్మకాలు 13 శాతం పెరగడం విశేషం. రానున్న రెండేళ్లలో అమ్మకాలు ఈ రేంజ్‌లోనే వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకల్లో కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌ అవకాశాలను ఈ కొత్త ప్లాంట్లు అందిపుచ్చుకోగలవని భావిస్తున్నాం. రెండేళ్లలో ఆదాయం 16 శాతం, నికర లాభం 27 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) ఈ ఆర్థిక సంవత్సరంలో 32 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 33 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నాం. భారీగా మూలధన ప్రణాళికలున్నా, సగటున 50 శాతం మేర డివిడెండ్‌ను చెల్లిస్తోంది. ఈ కారణాలన్నింటి వల్ల గతంలో ‘హోల్డింగ్‌’ రేటింగ్‌ ఇచ్చిన ఈ షేర్‌కు తాజాగా ‘కొనచ్చు’ అనే రేటింగ్‌ను ఇస్తున్నాం. టార్గెట్‌ ధరను రూ.1,950కు పెంచుతున్నాం. 

స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌     కొనచ్చు 
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
ప్రస్తుత ధర: రూ.162
టార్గెట్‌ ధర: రూ.296
ఎందుకంటే:-
ఇంగ్లాండ్‌కు చెందిన ఐడీఎస్‌ గ్రూప్‌ అనే డేటా సెంటర్‌ నెట్‌వర్క్‌ కంపెనీలో 80 శాతం వాటాను  ఇటీవలనే స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ కొనుగోలు చేసింది. తర్వాతి సంవత్సరాల్లో మిగిలిన 20 శాతం వాటాను కూడా కొనుగోలు చేయనున్నది.  డేటా సెంటర్‌ డిజైన్‌ స్పేస్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఇంగ్లాండ్‌ కంపెనీ కొనుగోలు కారణంగా స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. అంతేకాకుండా యూరప్‌లో మరింతగా విస్తరించగలుగుతుంది. 2022 కల్లా 7,500 కోట్ల డాలర్ల మార్కెట్‌ను సాధించే లక్ష్యంలో భాగంగా ఈ కంపెనీని స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ కొనగోలుకు వెచ్చించిన మొత్తం స్వల్పమే అయినందున కంపెనీకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావిస్తున్నాం. ప్రొడక్ట్‌ బిజినెస్‌లో ధరల ఒత్తిడి పెరుగుతుండటంతో స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌...సర్వీసుల బిజినెస్‌ వైపు దృష్టి సారిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌(ఎర్నింగ్స్‌ పర్‌ షేర్‌-షేర్‌ వారీ ఆర్జన)కు 12 రెట్ల ధరకే ప్రస్తుతం ఈ షేర్‌ ట్రేడవుతోంది. కొనుగోళ్లకు ఇది ఆకర్షణీయమైన ధర అని భావిస్తున్నాం. రెండేళ్లలో నికర లాభం 14 శాతం చొప్పున చక్రగతిన వృద్ది చెందగలవని అంచనా. రాబడి నిష్పత్తులు అధిక స్థాయిల్లో ఉండడం సానుకూలాంశం. 



You may be interested

కుప్పకూలిన బ్యాంక్‌ నిఫ్టీ

Monday 30th September 2019

654 పాయింట్లు నష్టపోయిన ఇండెక్స్‌ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం ఉదయం ట్రేడింగ్‌లోనే 2శాతానికి పైగా నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 29,674.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో ఇండెక్స్‌ 2.20శాతం(654 పాయింట్లు) నష్టపోయి 29222.70 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది.

70.42 వద్ద రూపీ ప్రారంభం

Monday 30th September 2019

దేశీయ రూపీ, డాలర్‌ మారకం‍లో 14 పైసలు బలపడి 70.42 వద్ద సోమవారం ట్రేడింగ్‌లో ప్రారం‍భమైంది. కాగా యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులపై  పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందానికి సౌదీ అరేబియా అంగీకరించిందనే నివేదిక విడుదలవ్వడంతో గత సెషన్‌లో చమురు ధరలు పడిపోయాయి. దీంతో శుక్రవారం సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 32 పైసలు బలపడి 70.56 వద్ద ముగిసింది. ఇది అగష్టు 2 తర్వాత గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. అంతేకాకుండా

Most from this category