STOCKS

News


ఈ వారం స్టాక్‌ రెకమెండేషన్లు

Monday 16th September 2019
Markets_main1568607840.png-28396

కోల్‌ ఇండియా        కొనచ్చు
​‍బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
ప్రస్తుత ధర: రూ.199
టార్గెట్‌ ధర: రూ.235

ఎందుకంటే:- భారత్‌లో అతి పెద్ద బొగ్గు మైనింగ్‌ కంపెనీ. ఉక్కు, సిమెంట్‌, విద్యుదుత్పత్తి తదితర వివిధ పరిశ్రమల్లో ఉపయోగపడే  కోకింగ్‌ కోల్‌, నాన్‌-కోకింగ్‌ కోల్‌, మిడ్‌లింగ్స్‌, తారు, హెవీ ఆయిల్‌ తదితర ఉత్పత్తులను విక్రయిస్తోంది. గత నెలలో ఈ కంపెనీ ఉత్పత్తి, అమ్మకాలు చెరో 10 శాతం చొప్పున తగ్గాయి. గత మూడేళ్లలో ఇదే కనిష్ట స్థాయి. సాధారణం కంటే అధికంగా వర్షాలు కురియడం వల్ల అనుబంధ సంస్థలు-మహానది కోల్‌ఫీల్డ్స్‌ (ఎమ్‌సీఎల్‌),  సదరన్‌ ఈస్ట్‌ కోల్‌ఫీల్డ్స్‌ (సీఈసీఎల్‌) గనుల్లో ఉత్పత్తి తగ్గింది. వాతావరణ సంబంధిత అంశాల ప్రభావం తగ్గడంతో ఈ గనుల్లో ఉత్పత్తి ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో సాధారణ స్థాయికి రావచ్చు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 9 శాతం పెరగగలవన్న కంపెనీ అంచనాలు సాకారం కాలేకపోయినా,  5 శాతం వృద్ధి ఉండొచ్చని భావిస్తున్నాం. పెరుగుతున్న బొగ్గు దిగమతులకు అడ్డుకట్ట వేయడానికి దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచే విషయమై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఫలితంగా ఈ కంపెనీ అమ్మకాలు నిలకడగా వృద్ధి చెందే అవకాశాలున్నాయి. దిగమతి చేసుకునే బొగ్గు ఉత్పత్తుల ధరలతో పోల్చితే ఈ కంపెనీ ధరలు తక్కువగా ఉండటం, డివిడెండ్‌ ఈల్డ్‌ 6-7 శాతం రేంజ్‌లో ఉండటం....సానుకూలాంశాలు. ఈ కంపెనీలో కొంత వాటాను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తుండటం ప్రతికూలాంశం. 


ఐసీఐసీఐ బ్యాంక్‌        కొనచ్చు
​‍బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ 
ప్రస్తుత ధర: రూ.392
టార్గెట్‌ ధర: రూ.520
ఎందుకంటే:
మార్జిన్లు అధికంగా ఉండే క్రెడిట్‌్‌, పర్సనల్‌ లోన్‌ వంటి  రిటైల్‌ రుణాల(మొత్తం బ్యాంక్‌ ఇచ్చిన రుణాల్లో రిటైల్‌ రుణాల వాటా 61 శాతంగా ఉంది)పై మరింతగా దృష్టి పెట్టటం ద్వారా బ్యాలెన్స్‌ షీట్‌ను మరింత పటిష్టం చేసుకోవాలని ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్రయత్నాలు చేస్తోంది. 2015-19 కాలంలో డిపాజిట్లు 16 శాతం, కాసా డిపాజిట్లు 18 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో టర్మ్‌ డిపాజిట్లు 34 శాతం వృద్ధి చెందినా, కాసా డిపాజిట్లు 1 శాతం తగ్గి 43 శాతానికి చేరాయి. అయినప్పటికీ, బ్యాంకింగ్‌ పరిశ్రమలో ఇది ఉత్తమమైన స్థాయేనని చెప్పవచ్చు. 2016-17లో రూ.200 కోట్లుగా ఉన్న సగటు బ్రాంచ్‌ వ్యాపారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌కు రూ.260 కోట్లకు పెరిగాయి. చాలా ఏళ్లుగా స్థూల మొండి బకాయిలు 1.7 శాతం రేంజ్‌లోనే కొనసాగడం సానుకూలాంశం. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా రుణ ఉత్పత్తులను అందిస్తోంది. లఘు, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లకు జీఎస్‌టీ బిజినెస్‌ లోన్స్‌, ఇన్‌స్టంట్‌ డిజిటెల్‌ క్రెడిట్‌  కోసం ‘పే లేటర్‌’ రుణాలను అందుబాటులోకి తెచ్చింది.  రెండేళ్లలో రుణ వృద్ధి 17 శాతం,  రిటర్న్‌ ఆన్‌ అసెట్‌(ఆర్‌ఓఏ) 1.5 శాతానికి, రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 15.5 శాతానికి పెరగగలవని అంచనా వేస్తున్నాం. You may be interested

రూపాయి 70 పైసలు క్రాష్‌

Monday 16th September 2019

సౌదీ ఉత్పాదక క్షేత్రాలపై డ్రోణ్‌ దాడులు జరగడంతో సోమవారం ట్రేడింగ్‌లో చమురుధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా రూపీ డాలర్‌ మారకంలో నష్టాలతో సోమవారం ప్రారంభమైంది. రూపీ డాలర్‌ మారకంలో 70 పైసలు కోల్పోయి 71.62 వద్ద ప్రారంభమైంది.     యుఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌ కొంత సరళతరం అవ్వడం, డాలర్‌ మారకంలో ఆసియా కరెన్సీలు బలపడడంతో పాటు చమురు ధరలు తగ్గడంతో శుక్రవారం ట్రేడింగ్‌లో రూపీ డాలర్‌ మారకంలో 22 పైసలు లాభపడి 70.92

ఈ ఆర్థిక అలవాట్లకు దూరం...

Monday 16th September 2019

ఈ ఆర్థిక అలవాట్లకు దూరం... (ప్రాఫిట్‌) ఆర్థిక ప్రయోజనాలకు కొన్ని అలవాట్లతో విఘాతం సరైన అధ్యయనంతోనే షేర్లలో పెట్టుబడులు వైవిధ్యం పేరుతో భారీ సంఖ్యలో షేర్లతో నష్టమే అత్యవసర నిధిని విస్మరించడం తగదు పన్ను ఆదా కోసం కాదు బీమా జీవిత రక్షణే ప్రధమ ప్రాధాన్యం కావాలి జీవన ప్రయాణంలో ఆర్థిక ఇబ్బందులు పడకూడదనుకుంటే అందుకు పక్కా ప్రణాళిక, క్రమశిక్షణ, మంచి అలవాట్లు కూడా అవసరం అవుతాయి. ముఖ్యంగా కొన్ని అలవాట్లు ఆర్థికంగా ఎంతో ప్రభావం చూపించేవి అయి ఉంటాయి.

Most from this category