News


ఈ వారం రికమెండేషన్లు

Monday 29th July 2019
Markets_main1564383740.png-27376


ఎల్‌ అండ్‌ టీ     కొనొచ్చు
​బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.1,392
టార్గెట్‌ ధర:రూ.1,790

ఎందుకంటే:- ఇంజినీరింగ్‌ దిగ్గజం, ఎల్‌ అండ్‌ టీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఎన్నికల కారణంగా దేశీయ ఇంజినీరింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ విభాగం ఆదాయం అంతంతమాత్రంగానే ఉండగలదన్న అంచనాలున్నాయి. అయితే ప్రాజెక్ట్‌ల అమలు జోరు కారణంగా ఈ విభాగం ఆదాయం 18 శాతం పెరిగింది. కంపెనీ కన్సాలిడేడెట్‌ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.31,100 కోట్లకు పెరిగింది. నిర్వహణ లాభం 22 శాతం పెరిగి రూ.3,550 కోట్లకు చేరింది. తరుగుదల, పన్ను వ్యయాలు తక్కువగా ఉండటంతో నిర్వహణ లాభ మార్జిన్‌ 11.4 శాతంగా నమోదైంది. నికర లాభం 29 శాతం వృద్ధితో రూ.1,560 కోట్లకు చేరింది. అయితే వివిధ సెగ్మెంట్లలో మార్జిన్లు బలహీనంగా ఉన్నాయి. ఎన్నికల కారణంగా వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఆర్డర్లు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ప్రభుత్వ రంగ, ప్రైవేట్‌ కంపెనీల జోరు కారణంగా ఈ క్యూ1లో ఆర్డర్లు 11 శాతం ఎగిశాయి. ఎన్నికలు ముగియడంతో వివిధ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి మరిన్ని ఆర్డర్లు రాగలవని అంచనా. ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ సమస్య తగ్గగానే ఈ కంపెనీ వర్కింగ్‌ క్యాపిటల్‌ సైకిల్‌ సాధారణ స్థాయికి రాగలదని భావిస్తున్నాం. 2017-18లో 14.6 శాతంగా ఉన్న రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) రెండేళ్లలో 17.6 శాతానికి పెరగగలదని అంచనా వేస్తున్నాం. ప్రాజెక్ట్‌ల అమలు పటిష్టంగా ఉండటం, మార్జిన్లు సాధారణ స్థాయికి రావడం దీనికి ప్రధాన కారణాలు. ఈ షేర్‌ ఏడాది కాలంలో రూ.1,790ను చేరగలదని భావిస్తున్నాం. సమ్‌ ఆఫ్‌ ద పార్ట్స్‌(ఎస్‌ఓటీపీ)  ప్రాతిపదికన టార్గెట్‌ ధరను నిర్ణయించాం. హైదరాబాద్‌ మెట్రో రైలు వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.800 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల మేర నష్టాలు వస్తాయనే అంచనాలతో టార్గెట్‌ ధరను నిర్ణయించాం. 


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌     కొనొచ్చు
​బ్రోకరేజ్‌ సంస్థ: ఏంజెల్‌ బ్రోకింగ్‌
ప్రస్తుత ధర: రూ.2,276
టార్గెట్‌ ధర:రూ.2,620
ఎందుకంటే:-
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మరోసారి పటిష్టమైన ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో  స్థూల/నికర మొండి బకాయిలు నిలకడగానే ఉన్నా, వ్యవసాయ, సెక్యూరిటీ లేని రుణాలకు కేటాయింపులు పెరిగాయి. ఫలితంగా క్రెడిట్‌ కాస్ట్‌ స్వల్పంగా పెరిగింది. గత మూడు క్వార్టర్లలో 24 శాతంగా ఉన్న రుణ వృద్ధి ఈ క్వార్టర్‌లో 17 శాతంగానే నమోదైంది. మొత్తం రిటైల్‌ రుణాల్లో 28 శాతంగా ఉండే వాహన రుణాలు 9 శాతమే పెరగడం వల్ల మొత్తం రుణ వృద్ధి తగ్గింది. వ్యక్తిగత రుణాలు 25 శాతం, క్రెడిట్‌ కార్డ్‌ రుణాలు 28 శాతం మేర పెరిగాయి. రిటైల్‌ వ్యాపారం పటిష్టంగా ఉండటంతో పరిశ్రమ రుణ వృద్ధిని మించిన రుణ వృద్ధిని ఈ బ్యాంక్‌ సాధించింది. టర్మ్‌ డిపాజిట్లు 23 శాతం పెరగడంతో డిపాజిట్లు 19 శాతం ఎగిశాయి. వాహన రంగంలో మందగమనం, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండటంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అనుబంధ సంస్థ, హెచ్‌డీబీ ఆర్థిక గణాంకాలపై తీవ్రమైన ప్రభావమే పడింది. నిర్మాణ రంగంలో మొండి బకాయిలు పెరగడంతో స్థూల మొండి బకాయిలు 2.3 శాతానికి, నికర మొండి బకాయిలు 1.7 శాతానికి చేరాయి. ఏడాది కాలంలో​ ఈ బ్యాంక్‌ షేర్‌ రూ.2,610 వద్దకు చేరగలదని భావిస్తున్నాం. సమ్‌ ఆఫ్‌ ద పార్ట్స్‌(ఎస్‌ఓటీపీ-అనుబంధ సం‍స్థలను కలుపుకొని) ప్రాతిపదికన టార్గెట్‌ ధరను నిర్ణయించాం. 



You may be interested

రియల్టీలోకి పెట్టుబడుల ప్రవాహం..

Monday 29th July 2019

- ప్రథమార్ధంలో దాదాపు రూ. 18,900 కోట్ల నిధులు ముంబై: నియంత్రణ విధానాలపరమైన ప్రతికూల పరిస్థితులతో రియల్టీ రంగం కార్యకలాపాలు మందకొడిగా ఉన్నప్పటికీ.. పెట్టుబడులు మాత్రం భారీగానే వస్తున్నాయి. 2019 ప్రథమార్ధంలో 2.7 బిలియన్ డాలర్ల మేర (దాదాపు రూ. 18,900 కోట్లు) వచ్చాయని ప్రాపర్టీల నిర్వహణ సంస్థ వెస్టియాన్‌, పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 2015-2018 మధ్యకాలంలో రియల్టీలోకి పెట్టుబడుల ప్రవాహం 25.7 బిలియన్ డాలర్ల

ఫండ్స్‌? పీఎమ్‌ఎస్‌ ? దేనిని ఎంచుకోవాలి ?

Monday 29th July 2019

(ధీరేంద్ర కుమార్‌ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌) ప్ర: నేను గత కొంత కాలం నుంచి మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ, నేరుగా షేర్లలోనూ ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అయితే షేర్లలో నేరుగా ఇన్వెస్ట్‌ చేయడం కంటే మ్యూచువల్‌ ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయడం మంచిదని నాకనిపిస్తోంది. షేర్లలో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ రూ.35 లక్షలకు పెరిగాయి. వీటిని మెల్లగా మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి మళ్లించమంటారా లేక పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌(పీఎమ్‌ఎస్‌)కి అప్పగించమంటారా ?  -కార్తీక్‌, బెంగళూరు  జ: షేర్లలోని మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మ్యూచువల్‌

Most from this category