News


ఈ స్టాక్స్‌.. టెక్నికల్‌ బయ్స్‌

Wednesday 4th March 2020
Markets_main1583303458.png-32267

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తాజాగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ అత్యవసర ప్రాతిపదికన వడ్డీ రేట్లను తగ్గించింది. ఫండ్స్‌ రేట్లలో 0.5 శాతం కోత పెట్టింది. అయినప్పటికీ మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 3 శాతం పతనమయ్యాయి. మరోపక్క చైనా, జపాన్‌, యూరోపియన్‌ దేశాల కేంద్ర బ్యాంకులు, జీ7 దేశాల ఆర్థిక మంత్రులు సైతం కరోనాపై యుద్ధానికి సన్నద్ధతను వ్యక్తం చేశారు. అయితే గతంలోలేని విధంగా కరోనా వైరస్‌ వేగంగా పలు దేశాలకు విస్తరిస్తుండటంతో ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యే వీలున్నట్లు ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగానూ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. వెరసి దేశీ స్టాక్‌మార్కెట్లు హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. కాగా.. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌, రెలిగేర్‌ బ్రోకింగ్‌ సంస్థలు సాంకేతిక అంశాల ఆధారంగా స్వల్ప కాల పెట్టుబడులకు కొన్ని కౌంటర్లను సిఫారసు చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. 

 

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

ఇప్కా ల్యాబ్స్‌
హెల్త్‌కేర్‌ రంగ కౌంటర్‌ ఇప్కా ల్యాబ్స్‌ కౌంటర్‌ మంచి ట్రేడింగ్‌ పరిమాణంతో జోరు చూపుతోంది. మంగళవారం ఇంట్రాడేలో రూ. 1529 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకింది. (నేటి ట్రేడింగ్‌లోనూ తొలుత రూ. 1540 వరకూ ఎగసింది) గత రెండు వారాల్లో కన్సలిడేషన్‌ పరిధి నుంచి బయటపడింది. హైయర్‌ టాప్స్‌, హైయర​బాటమ్స్‌ ఏర్పాటు ద్వారా ఈ కౌంటర్‌ బుల్లిష్‌గా కనిపిస్తోంది. ఆస్కిలేటర్లు, ఇండికేటర్లు సైతం​సానుకూల ట్రెండ్‌ను సూచిస్తున్నాయి. ఈ షేరుని రూ. 1625 టార్గెట్‌ ధరతో రూ. 1500 స్థాయిలో కొనుగోలు చేయవచ్చు. రూ. 1450 వద్ద స్టాప్‌లాస్‌ అమలు చేయవలసి ఉంటుంది.

అజంతా ఫార్మా
ఏడాదిన్నర, రెండేళ్ల కాలంలో జరిగిన కన్సాలిడేషన్‌ నుంచి బయటపడిన హెల్త్‌కేర్‌ కంపెనీ అజంతా ఫార్మా కౌంటర్‌ నిలకడగా పుంజుకుంటోంది. మంగళవారం ట్రేడింగ్‌లో ఈ షేరు తాజాగా బ్రేకవుట్‌ సాధించింది. రూ. 1350-1480 శ్రేణిని ఛేదించింది. దీంతో ఇకపై మరికొంత పుంజుకునేందుకు వీలుంది. ఈ షేరుని రూ. 1470-1480 స్థాయిల వద్ద రూ. 1590 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ. 1425 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది. ఇదే కౌంటర్‌పై రెలిగేర్‌ సెక్యూరిటీస్‌ సైతం బుల్లిష్‌ వ్యూ వ్యక్తం చేసింది. రెలిగేర్‌ సూచనల ప్రకారం అజంతా ఫార్మా షేరుని రూ. 1460-1470 స్థాయిల వద్ద రూ. 1550 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే రూ. 1420 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది. 

 

రెలిగేర్‌ బ్రోకింగ్‌
డాబర్‌ ఇండియా
ఎఫ్‌ఎంసీజీ కౌంటర్‌ డాబర్‌ ఇండియా రూ. 446 నుంచి రూ. 523కు స్పీడ్‌గా జంప్‌చేసింది. తదుపరి స్వల్ప రీట్రేస్‌మెంట్‌కు లోనైంది. పరిమిత పరిధిలో కదులుతోంది. రోజువారీ చార్టుల ప్రకారం 50 ఈఎంఏ మద్దతు స్థాయిల వద్ద ట్రేడవుతోంది. సమీప భవిష్యత్‌లో తిరిగి బలపడే సంకేతాలు కనిపిస్తున్నాయి. రూ. 528 టార్గెట్‌ ధరతో డాబర్‌ ఇండియా షేరుని రూ. 502-505 స్థాయిలవద్ద కొనుగోలు చేయవచ్చు. రూ. 490 వద్ద స్టాప్‌లాస్‌ తప్పనిసరి.

ఇంద్రప్రస్థ గ్యాస్‌
గత మూడు వారాలుగా సీఎన్‌జీ పంపిణీ సంస్థ ఇంద్రప్రస్థ గ్యాస్‌ కౌంటర్‌లో లాభాల స్వీకరణ జరిగిన సంకేతాలున్నాయి. గత నెల తొలి వారంలో రూ. 534 వద్ద రికార్డ్‌ గరిష్టాన్ని అందుకున్నాక ఈ కౌంటర్‌ వెనకడుగు వేసింది. తద్వారా రోజువారీ చార్టుల ప్రకారం 100 ఈఎంఏ వద్ద మద్దతు స్థాయిలకు దగ్గరలో కదులుతోంది. దీంతో ఈ స్థాయిలలో నామమాత్ర కన్సాలిడేషన్‌కు అవకాశముంది. తదుపరి తిరిగి జోరందుకోవచ్చు. రూ. 470 టార్గెట్‌ ధరతో ఈ షేరుని రూ. 442-446 స్థాయిల వద్ద సొంతం చేసుకోవచ్చు. రూ. 432 వద్ద స్టాప్‌లాస్‌ను అమలు చేయవలసి ఉంటుంది. You may be interested

ఆటో సెక్టార్‌పై జీఎస్టీ తగ్గనుందా..?

Wednesday 4th March 2020

ఆటో రంగంలో జీఎస్టీ భారం కొంత మేర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రంగానికి మరింత ఊతం ఇచ్చేందుకు జీఎస్టీ రేట్లను తగ్గించాలని  పార్లమెంటరీ ప్యానెల్‌ సూచించింది. అంతేకాకుండా 2018 జులై నుంచి నెగిటివ్‌ వృద్ధి చూపుతున్న ఆటోమొబైల్‌ ఉత్పత్తిని మరింత పెంచేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఏకీకృత విధానంలో రోడ్డు పన్ను విధించాలని పార్లమెంట్‌కు సమర్పించిన  హెవీ ఇండస్ట్రీ డిమాండ్స్‌ ఫర్‌ గ్రాంట్స్‌ 2020-21 నివేదికలో పేర్కొంది.

ఆందోళనలకు త్వరలో చెక్‌- నిఫ్టీ రీబౌండ్‌

Wednesday 4th March 2020

కరోనా వైరస్‌ వ్యాప్తితో ఇన్వెస్టర్లలో పెరిగిన ఆందోళనలు నెల రోజుల్లో 15 శాతం పతనమైన ప్రపంచ మార్కెట్లు నెల- రెండు నెలల్లో మార్కెట్లు రికవరీ బాట పట్టే చాన్స్‌ ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనాలు చైనాలో పుట్టినప్పటికీ కొవిడ్‌-19.. ప్రపంచాన్ని వణికిస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరుగుతున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇది ఎంతవరకూ ప్రభావం చూపుతుందన్న అంశంపై అంచనాలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు భయాలకు లోనవుతున్నట్లు ఒక నివేదికలో తెలియజేసింది. అయితే దేశీయంగా రెండు లేదా మూడు నెలల్లోనే

Most from this category