అంతర్జాతీయ బ్రోకరేజీల నుంచి టాప్ సిఫార్సులు
By Sakshi

వివిధ స్టాకులపై అంతర్జాతీయ బ్రోకరేజిల సిఫార్సులు: బ్రోకరేజి: గోల్డ్‌మాన్ సాచ్స్ బ్రోకరేజి: మాక్వేరీ బ్రోకరేజి: మోర్గాన్ స్టాన్లీ బ్రోకరేజి: మాక్వేరీ బ్రోకరేజీ: సీఎల్ఎస్ఏ
బ్రోకరేజి: మోర్గాన్ స్టాన్లీ
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాకుపై మోర్గాన్ స్టాన్లీ ‘ఓవర్ వెయిట్’ కొనసాగిస్తు, టార్గెట్ ధరను రూ. 3,000 గా నిర్ణయించింది. జూన్ త్రైమాసిక ఫలితాల తర్వాత ఈ స్టాకు దిద్దుబాటుకు గురయ్యిందని, ప్రస్తుతం ఈ స్టాకు ఆకర్షిణయమైన వాల్యుషన్ దగ్గర లభిస్తోందని ఈ బ్రోకరేజి తెలిపింది.
గోల్డ్‌మాన్ సాచ్స్, హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) స్టాకుపై ‘సెల్’ కాల్‌ను కొనసాగిస్తు, టార్గెట్ ధరను రూ. 1,880గా నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం ద్వితియార్ధంలో హెచ్‌యూఎల్ రికవరి అవ్వగలదని, ప్రస్తుతం వాల్యుషన్ దగ్గర ‘సెల్’ కాల్‌ను కొనసాగించడం మంచిదని సలహా ఇచ్చింది.
మాక్వేరీ, హెచ్డీఎఫ్సీ లైఫ్‌పై ‘న్యూట్రల్’ కాల్నిస్తూ..టార్గెట్ ధరను రూ. 475 గా నిర్ణయించింది. మొత్తంగా హెచ్డీఎఫ్సీ లైఫ్ వృద్ధి బాగుందని, కానీ సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని ఈ బ్రోకరేజి తెలిపింది.
యెస్ బ్యాంక్ షేరుపై మోర్గాన్ స్టాన్లీ అండర్ వెయిట్‌ను కొనసాగిస్తు, టార్గెట్ ధరను రూ. 55 గా నిర్ణయించింది. గతంలో ఈ స్టాకుపై ఉన్న టార్గెట్ ధర రూ. 95 ను ప్రస్తుతం రూ. 55కి తగ్గించింది. ఆస్తి నాణ్యత ఆందోళనలు, మూల ధన సమీకరణలో అనిశ్చితి, అధికంగా ఒత్తిడిలో ఉన్న రుణాలు వంటి అంశాలు ఈ స్టాకు టార్గెట్ ధరను తగ్గించడానికి కారణమయ్యాయని తెలిపింది.
బాలక్రిష్ణా ఇండస్ట్రీస్ స్టాకుపై మాక్వేరీ, ‘అండర్ పెర్ఫార్మా’ రేటింగ్నిస్తు, టార్గెట్ ధరను రూ. 575 గా నిర్ణయించింది. అంతేకాకుండా కంపెనీ ఆర్థిక సంవత్సరం 20-21 ఈపీఎస్ అంచనాలను మార్కెట్ అంచనాల కంటే 15 శాతం తగ్గించింది. ‘అంతర్జాతీయంగా వ్యవసాయ రంగం మందగమనంలో ఉండడంతో ఈ కంపెనీ ఇబ్బందులను ఎదుర్కొంటుంది’ అని మాక్వేరీ తెలిపింది.
జీ స్టాకుపై సీఎల్ఎస్ఏ ‘బై’ టార్గెట్‌ను కొనసాగిస్తు, టార్గెట్ ధరను రూ. 515గా నిర్ణయించింది. జీ వీక్షకులు పెరగడంతోపాటు, ప్రమోటర్లు రుణాలను చెల్లించేందుకు ప్రయత్నాలు చేస్తుండడం జీ షేరుకు ఉత్ర్పేరకంగా పనిచేస్తున్నాయని ఈ బ్రోకరేజి తెలిపింది. గ్రామీణ మార్కెట్లలో ఛానెల్ వీక్షకుల సంఖ్య పెరగడం, ప్రాంతీయ ఛానెల్‌లు వీక్షకుల వాటా పెరగడంతో ఈ షేరు బాగుందని ఈ బ్రోకరేజి తెలిపింది.
You may be interested
జెట్‌కు కొత్త బిడ్డర్లు దూరం
Wednesday 4th September 2019బిడ్ల దాఖలుకు మూడోసారి ముగిసిన డెడ్‌లైన్ ఇక రేసులో మూడే సంస్థలు ముంబై: దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ను కొనుగోలు చేసే రేసులో మూడే సంస్థలు మిగిలాయి. విక్రయానికి గడువు మూడుసార్లు పొడిగించినప్పటికీ కొత్త బిడ్డర్లెవరూ ముందుకు రాకపోవడం గమనార్హం. "మూడోసారి పెంచిన గడువు ఆగస్టు 31తో ముగిసింది. కానీ కొత్తగా ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలేమీ (ఈవోఐ) రాలేదు. డెడ్‌లైన్‌ను ఇక మరింత పొడిగించే
వోల్వో ఎక్స్‌సీ-90 @ రూ. 1.42 కోట్లు
Wednesday 4th September 2019కేవలం 15 కార్లు మాత్రమే విక్రయం ముంబై: స్వీడన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘వోల్వో’ తాజాగా తన ఆల్ట్రా-లగ్జరీ హైబ్రీడ్ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ‘ఎక్స్‌సీ-90’ పేరుతో విడుదలైన ఈ త్రీ-సీటర్ కారు ధర రూ. 1.42 కోట్లుగా ప్రకటించింది. వచ్చే ఏడాదికాలంలో కేవలం 15 కార్లను మాత్రమే ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నట్లు వోల్వో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ ఫ్రంప్ వెల్లడించారు. ఎంపికచేసిన కస్టమర్లకు