News


సంవత్‌ 2076కు నవరత్నాల్లాంటి సిఫార్సులు

Wednesday 23rd October 2019
Markets_main1571828205.png-29087

వచ్చే ఆదివారంతో సంవత్‌ 2075 ముగిసి 2076 ఆరంభం కానుంది. సంవత్‌ 2075లో నిఫ్టీ దాదాపు 11 శాతం రాబడినిచ్చింది. అయితే లాభాలు కొన్ని రంగాలు, కొన్ని స్టాకులకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం ఎకానమీల్లో మందగమన భయాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్‌ ఎలాఉంటుందోనన్న ఆసక్తి పెరిగింది. ఇక ఎప్పటిలాగే కొత్త సంవత్‌కు టాప్‌ బ్రోకరేజ్‌లు కొన్ని టాప్‌ స్టాక్స్‌ను రికమండ్‌ చేస్తున్నాయి.
కొత్త సంవత్‌ రికమండేషన్లు..

1. బజాజ్‌ ఆటో:

టార్గెట్‌ రూ. 3447. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎంపిక. ఆటోమొబైల్‌ రంగంలో పునరుజ్జీవం రాబోతోందని, ఈ రంగంలో బజాజ్‌ ఆటో ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉందని తెలిపింది.
2. జేకే పేపర్‌:

టార్గెట్‌ రూ. 174. ఇండియా నివేశ్‌ ఎంపిక. ఈకామ్‌ పరిశ్రమలో బూమ్‌, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధాలు.. జేకే పేపర్‌కు కలిసివస్తాయని తెలిపింది. రెండేళ్లలో దాదాపు 15 శాతం వార్షిక వృద్ధి సాధిస్తుందని అంచనా వేసింది.

 


3. ఏసియన్‌ పెయింట్స్‌:

టార్గెట్‌ రూ. 1935. యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎంపిక. కంపెనీ డెకరేటివ్‌ పెయింట్‌ వ్యాపారంలో మంచి వృద్ధి అవకాశాలున్నాయని అంచనా వేసింది. 
4. అల్ట్రాటెక్‌ సిమెంట్‌:

టార్గెట్‌ రూ. 4980. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎంపిక. వ్యయాల నియంత్రణ, సామర్ధ్య వినియోగం పెరగడం కలిసివస్తాయి. బలమైన రెవెన్యూతో లాభాలు మరింత పెరగవచ్చు.

 


5. ఐసీఐసీఐ బ్యాంక్‌:

టార్గెట్‌ రూ. 505. ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌తో పాటు పలు బ్రోకరేజ్‌ల సిఫార్సు. రిటైల్‌ పోర్టుఫోలియోలో వృద్ధి, మూలధన కొరత లేకపోవడం.. తదితరాలు కలిసివచ్చే అంశాలు.

 

 


 

6. ఎల్‌అండ్‌టీ:

టార్గెట్‌ రూ.1875. ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ ఎంపిక. పెట్టుబడుల వలయం పుంజుకునే దశలో బాగా లబ్ది చెందే కంపెనీ అని పలు బ్రోకింగ్‌ సంస్థలు సూచిస్తున్నాయి.


7. డా.రెడ్డీస్‌:

టార్గెట్‌ రూ. 2900. యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎంపిక. దేశీయ ఫార్ములేషన్‌ వ్యాపారం పుంజుకోవడం, యూఎస్‌ మార్కెట్లో అధిక విలువ ఉత్పత్తుల లాంచింగ్‌, వ్యయనియంత్రణలు కలిసివస్తాయి. 
8. ఎస్‌బీఐ లైఫ్‌: 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

టార్గెట్‌ రూ. 965. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎంపిక. బలమైన డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌, పొదుపు మొత్తాలు ఈక్విటీలవైపు మరలడం, వంటివి కంపెనీ వృద్ధిని ప్రోత్సహిస్తాయి. 
9. హెచ్‌యూఎల్‌:

టార్గెట్‌ రూ. 2135. యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎంపిక. తోటి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలతో పోలిస్తే ఈ కంపెనీలో ఎర్నింగ్స్‌ వృద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. 



You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్‌-ఎంటీఎన్‌ఎల్‌ విలీనం

Thursday 24th October 2019

పునరుద్ధరణకు రూ. 68,751 కోట్ల ప్యాకేజీ 4జీ స్పెక్ట్రం కేటాయింపు, వీఆర్‌ఎస్‌ పథకం ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ: భారీ నష్టాలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించే దిశగా రూ. 68,751 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. రెండు సంస్థలను విలీనం చేయడంతో పాటు 4జీ స్పెక్ట్రం కేటాయింపు, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం మొదలైనవి ఈ ప్యాకేజీలో భాగంగా ఉండనున్నాయి. బుధవారం

వచ్చే ఏడాది పీఎస్‌యూలే లీడర్లు: రమేష్‌ దమాని

Wednesday 23rd October 2019

‘నేను పీఎస్‌యూ స్టాకులను కొనుగోలు చేయను, పీఎస్‌యూల వైపు చూడను వంటి మాటలు మార్కెట్‌లో సాధరణమయ్యాయి. ఒకవేళ నువ్వు వాల్యూ ఇన్వెస్టర్‌ అయితే ముఖ్యంగా ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ చేస్తుందని నమ్మితే పీఎస్‌యూ స్టాకులను పరిశీలిస్తావు’ అని బీఎస్‌ఈ మెంబర్‌ రమేష్‌ దమాని ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. కొత్త సంవత్‌లో కొత్త లీడర్‌ కావాలి.. ప్రభుత్వం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించిన తర్వాత మార్కెట్‌ చాలా పాజిటివ్‌గా

Most from this category