ఏడాది కనిష్ఠానికి 67 స్టాక్‌లు
By Sakshi

ఎన్ఎస్ఈ నిఫ్టీలో 67 స్టాక్‌లు తమ 52 వారాల కనిష్ఠ స్థాయిని సోమవారం తాకాయి. ఏక్సిలియ సొల్యుషన్స్ ఇండియా, అరవింద్ స్మార్ట్ స్పేసస్, కాస్ట్రోల్ ఇండియా, బర్న్‌పుర్ సిమెంట్, కాక్స్ అండ్ కింగ్స్ ఏడాది కనిష్ఠాన్ని తాకిన స్టాక్‌లలో ఉన్నాయి. వీటితో పాటు దన్సేరి ఇన్వెస్ట్మెంట్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా, గ్లెన్ మార్క్ పార్మా, హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్, హిందుస్థాన్ మీడియా వెంచర్స్, విండ్సర్ మిషెన్స్ కూడా తమ ఏడాది కనిష్ఠాన్ని తాకాయి. దేశియా సూచీలైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 72.95 పాయింట్ల లాభంతో 11,860.50 పాయింట్ల వద్ద, బీఎస్ఈ సెన్సెక్స్ 274.87 పాయింట్ల లాభంతో 39,671.46 వద్ద ట్రేడవుతున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 ఇండెక్స్‌లో ఎన్టీపీసీ, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హీరో మోటర్ కార్ప్ లాభపడిన షేర్లలో ముందుండగా, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్ప్, హెచ్‌సీఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్ నష్టపోయిన షేర్లలో ముందున్నాయి.
You may be interested
బడ్జెట్ వరకు 11600-11900 పాయింట్ల రేంజ్లో నిఫ్టీ!
Monday 1st July 2019బడ్జెట్ వరకు నిఫ్టీ 11600- 11900 పాయింట్ల రేంజ్‌లోనే కదలాడుతుందని ఇండియానివేశ్ సెక్యూరిటీస్ అనలిస్టు మెహుల్ కొఠారి అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిఫ్టీ 11600 పాయింట్ల పైన ఉన్నంత వరకు ట్రెండ్బలంగానే ఉంటుందని చెప్పారు. గతవారం బుల్స్ చిన్నపాటి బ్రేకవుట్ సాధించారని చెప్పారు. ఈ స్థితిలో నిఫ్టీ 11911 పాయింట్ల వద్ద మధ్యంతర హైని సాధించిందన్నారు. డైలీ చార్టుల్లో నిఫ్టీ షూటింగ్ స్టార్క్యాండిల్ను ఏర్పరిచింది. అది కూడా 78.6 శాతం
బ్యాంక్ నిఫ్టీ 1శాతం అప్..!
Monday 1st July 2019మార్కెట్ ర్యాలీలో భాగంగా బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే దాదాపు 1శాతం ర్యాలీ చేసింది. నేడు బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్ 31,271.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1.50శాతం), ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు (1శాతం) ర్యాలీతో ఇండెక్స్ ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాల బాట పట్టింది. దాదాపు 1శాతం వరకు ర్యాలీ చేసి 31,380.70