News


ఏడాది కనిష్ఠాన్ని తాకిన 117 స్టాక్‌లు

Monday 24th June 2019
Markets_main1561360666.png-26528

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలోని 117 స్టాక్‌లు సోమవారం ట్రేడింగ్‌లో తమ ఏడాది కనిష్ఠాన్ని తాకాయి. ఎక్సేల్యా సొల్యుషన్స్‌ ఇండియా, ఆర్షియా, బన్నారి అమ్మన్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌, బినాని ఇండస్ట్రీస్‌, భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్‌ స్టాక్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, ఈమామి, ఈమామి పేపర్ మిల్స్‌, జీకేవీ, గ్లెన్‌మార్క్‌ పార్మా, ఐఎఫ్‌జీఎల్‌ రిఫ్రాక్సరిస్‌, జే భారత్‌ మారుతి, లుమెక్స్‌ ఇండస్ట్రీస్‌, సామ్‌ డిస్టిలరీస్‌ అండ్‌ బ్రేవరీస్, టీవీఎస్‌ మోటర్‌ కంపెనీ, వెందత్‌(ఇండియా) స్టాక్‌లు కూడా ఏడాది కనిష్ఠాన్ని తాకాయి. మధ్యాహ్నాం 12.33 సమయానికి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 0.05శాతం నష్టంతో 11,718.45 పాయింట్ల వద్ద, బీఎస్‌ఈ 0.060శాతం నష్టంతో 39,170.42 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50లో యూపీఎల్‌, యస్‌ బ్యాంక్‌, జీల్‌, ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్న షేర్లలో ముందుండగా, ఓఎన్‌జీసీ, వేదాంత, బజాజ్‌ ఆటో, జెఎస్‌డబ్యూ స్టీల్‌, ఎయిచర్‌ మోటర్స్‌ నష్టపోయిన షేర్లలో ముందున్నాయి.
 



You may be interested

కళ తప్పిన మెటల్‌ షేర్లు

Monday 24th June 2019

మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు స్తబ్దుగా సాగుతాయి. మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా మెటల్‌ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం వరకు నష్టపోయింది. నేడు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2,932.85ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇండెక్స్‌ మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒకదశలో 1శాతం క్షీణించి 2898.00ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది.

బ్యాంక్‌ నిఫ్టీ అరశాతం జంప్‌

Monday 24th June 2019

పరిమిత మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా ఉదయం ట్రేడింగ్‌లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 30,680.95ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్లో అనిశ్చితితో సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నప్పటికీ, ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ సెక్టార్‌లో అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యస్‌ బ్యాంక్‌,

Most from this category